Satwiksairaj Rankireddy: అమలాపురం కుర్రోడికి ఖేల్ రత్న పురస్కారం.. బ్యాడ్మింటన్ స్టార్ ఖాతాలో మరో కీర్తి కిరీటం
ఆంధ్రప్రదేశ్ కు చెందిన బ్మాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయి రాజ్ రంకిరెడ్డి కీర్తి ఖాతాలో మరో కిరీటం వచ్చి చేరింది. బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తోన్న ఈ అమలాపురం కుర్రోడు ప్రతిష్ఠాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యాడు. సాత్విక్‌తో పాటు బ్యాడ్మింటన్ కోర్టులో అతని జోడి చిరాగ్ శెట్టికి కూడా ఈ అవార్డు అందుకోనున్నాడు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన బ్మాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయి రాజ్ రంకిరెడ్డి కీర్తి ఖాతాలో మరో కిరీటం వచ్చి చేరింది. బ్యాడ్మింటన్‌లో సంచలనాలు సృష్టిస్తోన్న ఈ అమలాపురం కుర్రోడు ప్రతిష్ఠాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యాడు. సాత్విక్‌తో పాటు బ్యాడ్మింటన్ కోర్టులో అతని జోడి చిరాగ్ శెట్టికి కూడా ఈ అవార్డు అందుకోనున్నాడు. కేంద్ర ప్రభుత్వం బుధవారం (డిసెంబర్ 20) జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. సాత్విక్- చిరాగ్ తో పాటు మొత్తం 26 మందికి అర్జున అవార్డులకు ఎంపిక చేశారు. ఇందులో టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ కూడా ఉన్నాడు. సాత్విక్- చిరాగ్ జోడీల విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ భారత బ్యాడ్మింటన్ జట్టుకు మరుపురాని విజయాలు అందిస్తున్నారు. అంతర్జాతీయ టోర్నీల్లోనూ రాణించి మువ్వెన్నల జెండాను రెపరెపలాడించారు. ఎన్నో బంగారు పతకాలు, టైటిల్స్‌ను గెల్చుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సాత్విక్ సాయి రాజ్ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 565 కి.మీ./గం వేగంతో బ్యాడ్మింటన్ స్మాష్ కొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ షాట్ పాక్ స్పీడ్ బౌలర్ షోయబ్ అక్తర్ గరిష్ట వేగం గంటకు 161.3 కిమీ/గం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో 565 కిమీ/గం వేగంతో దూసుకుపోయింది.
గతంలో ఈ రికార్డు మలేషియా షట్లర్ టాన్ పెర్లీ పేరిట ఉంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లోనే 493 కిలోమీటర్ల వేగంతో బ్యాడ్మింటన్ స్మాష్ కొట్టి పెర్లీ రికార్డులను తుడిచిపెట్టేశాడు. ఈ ఏడాది జూన్‌లో జకార్తా వేదికగా జరిగిన ఇండోనేషియా ఓపెన్‌ను సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ గెల్చకుంది. సూపర్ 1000 ఈవెంట్‌ను గెలుచుకున్న మొదటి డబుల్స్ జోడీ వీరే కావడం విశేషం.
గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు..
ASIAN GAMES GOLD MEDALISTS 🏆 To all who cheered, believed, and stood by me – this gold is as much yours as it is ours. Holding this gold, I feel the weight of your love and support more than ever. This victory belongs to all of us. Thank you Jai Hind 🇮🇳 pic.twitter.com/GSouLRYgXM
— Satwik SaiRaj Rankireddy (@satwiksairaj) October 10, 2023
సాత్విక్ సాయి రాజ్ రంకిరెడ్డి 2000 ఆగస్టు 13న. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం జిల్లా అతని స్వగ్రామం. . సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి తండ్రి పేరు కాశీ విశ్వనాథ్. ఈయన కూడా రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. తల్లి పేరు రంగమణి అన్నయ్య రామ్‌చరణ్ రంకిరెడ్డి బ్యాడ్మింటన్ ప్లేయర్. 2014లో కృష్ణ ప్రసాద్ గర్గాతో కలిసి సబ్-జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్‌లో అండర్-17 విభాగంలో తన మొదటి జాతీయ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. 2015లో, ఈ జంట ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి అండర్-17 అంతర్జాతీయ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
Congratulations to our badminton champions @satwiksairaj & @Shettychirag04 for winning the Indonesia Open. They’ve also made history by becoming the first Indians to win the Super 1000 title. Well done, boys. You’ve made the country proud! pic.twitter.com/r8HiEmVnh7
— N Chandrababu Naidu (@ncbn) June 18, 2023
సాత్విక్ కుటుంబ నేపథ్యమిదే..
సాత్విక్‌సాయిరాజ్- చిరాగ్ శెట్టి 2019లో చైనాకు చెందిన లి జున్‌హుయ్, లియు యుచెన్‌లను ఓడించి థాయ్‌లాండ్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకుంది. తద్వారా సూపర్ 500 సిరీస్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ డబుల్స్ జోడీగా వీరు రికార్డు సృష్టించారు. ఆ ఏడాది డబుల్స్‌లో ఫైనల్ వరకూ చేరుకున్నారు. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో మార్కస్ ఫెర్లాండి ఇండోనేషియాకు చెందిన గిడియాన్, కెవిన్ సంజయ్ సుకముల్జో చేతిలో ఓడిపోయారు. సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ 2021 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. అయితే ఈ జోడీ 9వ స్థానంలో నిలిచింది.
Proud of @satwiksairaj and @Shettychirag04 for scripting history by becoming the first Indian Men’s Doubles pair to win the Badminton Asia Championships Title. Congratulations to them and wishing them the very best for their future endeavours. pic.twitter.com/i0mES2FuIL
— Narendra Modi (@narendramodi) April 30, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..