National Sports Awards 2023: జాతీయ క్రీడా పురస్కారాలు.. షమీకి అర్జున, ఏపీ బ్యాడ్మింటన్‌ స్టార్‌కు ఖేల్‌ రత్న

క్రీడా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే  జాతీయ క్రీడా అవార్డులను బుధవారం (డిసెంబర్ 20) కేంద్రం ప్రకటించింది. సీనియర్‌ క్రికెటర్ మహ్మద్ షమీ, పారా ఆర్చర్ శీతల్ దేవి సహా మొత్తం 26 మంది ఆటగాళ్లను అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.

National Sports Awards 2023: జాతీయ క్రీడా పురస్కారాలు.. షమీకి అర్జున, ఏపీ బ్యాడ్మింటన్‌ స్టార్‌కు ఖేల్‌ రత్న
National Sports Awards 2023
Follow us

|

Updated on: Dec 20, 2023 | 5:28 PM

క్రీడా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే  జాతీయ క్రీడా అవార్డులను బుధవారం (డిసెంబర్ 20) కేంద్రం ప్రకటించింది. సీనియర్‌ క్రికెటర్ మహ్మద్ షమీ, పారా ఆర్చర్ శీతల్ దేవి సహా మొత్తం 26 మంది ఆటగాళ్లను అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకున్నారు. కాగా ఈ ఏడాది మొత్తం 26 మంది ఆటగాళ్లను అర్జున అవార్డుతో సత్కరించాలని క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. షమీతో పాటు అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డికి కూడా అర్జున అవార్డు ఇవ్వనున్నారు. కబడ్డీ, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్ సహా  వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన ఆటగాళ్లు కూడా జాతీయ క్రీడా అవార్డులకు ఎంపికయ్యారు.  వీరే కాకుండా వివిధ క్రీడలకు చెందిన 5 మంది కోచ్‌లను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. ముగ్గురు అనుభవజ్ఞులకు ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేయనున్నారు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా  విజేతలందరికీ 2024న  9 జనవరి  రాష్ట్రపతి భవన్‌లో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

జాతీయ క్రీడా పురస్కారాల విజేతలు..

మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న..

చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి (బ్యాడ్మింటన్).

ఇవి కూడా చదవండి

అర్జున అవార్డులు:

 • ఓజాస్ ప్రవీణ్ డియోటాలే (ఆర్చరీ)
 • అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ)
 • మురళీ శ్రీశంకర్ (అథ్లెటిక్స్)
 • పారుల్ చౌదరి (అథ్లెటిక్స్),
 • మొహమీద్ హుసాముద్దీన్ (బాక్సింగ్),
 • ఆర్ వైశాలి (చెస్),
 • మహ్మద్ షమీ (క్రికెట్),
 • అనుష్ అగర్వాలా (ఈక్వెస్ట్రియన్),
 • దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్),
 • దీక్షా దాగర్ (గోల్ఫ్),
 • క్రిషన్ బహదూర్ పాఠక్ (హాకీ), ​​సుశీల చాను (హాకీ), ​​
 • పవన్ కుమార్ (కబడ్డీ),
 • రీతు నేగి (కబడ్డీ),
 • నస్రీన్ (ఖోఖో),
 • పింకీ (లాన్ బౌల్స్),
 • ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్),
 • ఈషా సింగ్ (షూటింగ్),
 • హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్),
 • ఐహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్),
 • సునీల్ కుమార్ (రెజ్లింగ్),
 • ఆంటిమ్ (రెజ్లింగ్),
 • నౌరెమ్ రోషిబినా దేవి ( ఉషు),
 • శీతల్ దేవి (పారా ఆర్చరీ),
 • ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్),
 • ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్).
 • ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరీ):
 • లలిత్ కుమార్ (రెజ్లింగ్),
 • ఆర్‌బీ రమేష్ (చెస్),
 • మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్),
 • శివేంద్ర సింగ్ (హాకీ), ​​
 • గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లాఖాంబ్).

ద్రోణాచార్య అవార్డు (లైఫ్ టైమ్ కేటగిరీ):

 • జస్కిరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్)
 • భాస్కరన్ ఇ (కబడ్డీ),
 • జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్).

ధ్యాన్ చంద్ జీవిత సాఫల్య పురస్కారం:

 • మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్)
 • వినీత్ కుమార్ శర్మ (హాకీ) ​​
 • కవిత సెల్వరాజ్ (కబడ్డీ)

విజేతలకు కేంద్ర మంత్రి అభినందనలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
అట్లీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్‌తో కాదా..?
అట్లీ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్‌తో కాదా..?
శీతల పానీయాలు తెగ తాగేస్తున్నారా.. ఆరోగ్యానికి ఎంత హనికరమో తెలుసా
శీతల పానీయాలు తెగ తాగేస్తున్నారా.. ఆరోగ్యానికి ఎంత హనికరమో తెలుసా
'ఇది జట్టు కాదు.. నిప్పుల కుంపటి' పాక్ కోచ్ షాకింగ్ స్టేట్‌మెంట్
'ఇది జట్టు కాదు.. నిప్పుల కుంపటి' పాక్ కోచ్ షాకింగ్ స్టేట్‌మెంట్
చిక్కనంటున్న టమాట.. ధర ఏంటి ఒక్కసారిగా ఇలా..?
చిక్కనంటున్న టమాట.. ధర ఏంటి ఒక్కసారిగా ఇలా..?
మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో..
మీ మంచాన్ని మించిన మురికి ప్రదేశం మరొకటి లేదు..! పిల్లో కవర్‌లో..
అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?
అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?
మొగదారమ్మకు ప్రత్యేక మొక్కులు.. సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు
మొగదారమ్మకు ప్రత్యేక మొక్కులు.. సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు
కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు..తెలిస్తే ఇకపై తొక్కకూడా
కూరల్లో రారాజు వంకాయతో బోలెడు ప్రయోజనాలు..తెలిస్తే ఇకపై తొక్కకూడా
సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..
సూపర్ 8లో విధ్వంసం సృష్టించనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు..
ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..
ఆహారంలో బ్లేడ్.. విమానంలో ఓ ప్రయాణీకుడి అనుభవం వైరల్..