IPL 2024 Auction: జార్ఖండ్‌ యంగ్ క్రికెటర్‌కు జాక్‌పాట్‌.. 20 లక్షలతో ఎంట్రీ ఇచ్చి ఏకంగా 7 కోట్లకు..

దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తోన్న కుమార్‌ కుషాగ్రా సొంతం చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తదితర ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దీంతో ఈ యంగ్‌ ప్లేయర్‌ విలువ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. మొదట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోటి రూపాయలతో బిడ్డింగ్‌ ప్రారంభించింది.

IPL 2024 Auction: జార్ఖండ్‌ యంగ్ క్రికెటర్‌కు జాక్‌పాట్‌.. 20 లక్షలతో ఎంట్రీ ఇచ్చి ఏకంగా 7 కోట్లకు..
Kumar Kushagra
Follow us
Basha Shek

|

Updated on: Dec 19, 2023 | 9:45 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 వేలంలో జార్ఖండ్‌ కు చెందిన యువ వికెట్‌ కీపర్‌ అండ్‌ బ్యాటర్‌ కుమార్ కుషాగ్రా జాక్‌ పాట్ కొట్టాడు. రూ. 20 లక్షలతో వేలంలోకి అడుగుపెట్టిన అతను ఏకంగా కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఏకంగా రూ.7 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించాడీ అనామక ప్లేయర్‌. దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తోన్న కుమార్‌ కుషాగ్రా సొంతం చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తదితర ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దీంతో ఈ యంగ్‌ ప్లేయర్‌ విలువ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. మొదట ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోటి రూపాయలతో బిడ్డింగ్‌ ప్రారంభించింది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కూడా వేలంలోకి దిగింది. దీంతో కుమార్ కుషాగ్రా విలువ చాలా త్వరగా రూ.5 కోట్లకు చేరుకుంది. అయితే చివరకు రూ.7.20 కోట్లు. ఢిల్లీ క్యాపిటల్స్ జార్ఖండ్ యువ వికెట్ కీపర్ కుమార్ కుషాగ్రాను కొనుగోలు చేసింది.

కుమార్ కుష్రా దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో పాటు అద్భుతమైన వికెట్ కీపింగ్ సామర్థ్యం కుషాగ్రాకు ఉంది. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అతను 37 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఈ కారణాలన్నింటి కారణంగా, CSK, ఢిల్లీ క్యాపిటల్స్ కుమార్ కుషాగ్రాను కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తి చూపాయి. చివరకు 7.20 కోట్లు. కుమార్ కుషాగ్రా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడిగా మారిపోయాడు.కాగా 2021లో దేశవాలీ క్రికెట్‌లో అడుగుపెట్టిన కుషాగ్రా.. అంతకుముందు ఏడాది (2020) అండర్‌ 19 వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికయ్యాడు. కుషాగ్రా తన కెరీర్‌లో 3 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 2 లిస్ట్‌ ఏ మ్యాచ్‌లు, 2 టీ20లు ఆడాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో కుషాగ్రా సెంచరీ, 2 హాఫ్‌ సెంచరీలు సాధించాడు.

ఇవి కూడా చదవండి

ట్యాలెంటెడ్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ గా గుర్తింపు..

 మహేంద్ర సింగ్ ధోని స్ఫూర్తితో ..

ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్: రిషబ్ పంత్, ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిక్ నోకియా, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగి ఎన్గిడి, ముఖేష్ కుమార్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్,

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?