Kotabommali PS OTT: ఓటీటీలోకి లేటెస్ట్‌ సూపర్‌ హిట్‌.. శ్రీకాంత్ కోట బొమ్మాళి పీఎస్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నవంబర్‌ 24న థియేటర్లలో విడుదలైన కోట బొమ్మాళి పీఎస్‌ మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆసక్తికరమైన కథ, కథనాలు, , గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉండడంతో కోట బొమ్మాళి పీఎస్‌కు మంచి ఆదరణే వచ్చింది. ముఖ్యంగా శ్రీకాంత్‌ కు చాలా రోజుల తర్వాత ఓ మంచి సాలిడ్‌ హిట్‌ దొరికింది.

Kotabommali PS OTT: ఓటీటీలోకి లేటెస్ట్‌ సూపర్‌ హిట్‌.. శ్రీకాంత్ కోట బొమ్మాళి పీఎస్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kotabommali PS Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 18, 2023 | 7:00 PM

సీనియర్ హీరో శ్రీకాంత్ చాలా రోజుల తర్వాత మెయిన్‌ లీడ్‌లో నటించిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్‌. మలయాళ బ్లాక్‌ బస్టర్‌ నాయట్టు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌, శివాజీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్‌ 24న థియేటర్లలో విడుదలైన కోట బొమ్మాళి పీఎస్‌ మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆసక్తికరమైన కథ, కథనాలు, , గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉండడంతో కోట బొమ్మాళి పీఎస్‌కు మంచి ఆదరణే వచ్చింది. ముఖ్యంగా శ్రీకాంత్‌ కు చాలా రోజుల తర్వాత ఓ మంచి సాలిడ్‌ హిట్‌ దొరికింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ దక్కించుకున్న కోట బొమ్మాళి పీఎస్‌ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా శ్రీకాంత్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 26న కోట బొమ్మాళి పీఎస్‌ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని తెలుస్తోంది. ఒకవేళ క్రిస్మస్‌ కు రాకపోయినా కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి విద్య సంయుక్తంగా కోట బొమ్మాళి పీఎస్ సినిమాను నిర్మించారు. తేజ మార్ని దర్శకత్వం వహించారు. మురళీ శర్మ, బెనర్జీ, సీవీఎల్ నరసింహారావు, ప్రవీణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రంజిన్‌ స్వరాలు సమకూర్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన యాస, భాషలకు తగ్గట్టుగా కోట బొమ్మాళి పీఎస్‌ సినిమాను తెరకెక్కించారు. ఇందులోని లింగి లింగిడి పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

లింగి లింగిడి పాట కు 50 మిలియన్ల వ్యూస్..

లింగి లింగిడి పాటకు శివానీ రాజశేఖర్ డ్యాన్స్..

కోట బొమ్మాళి పీఎస్‌ ట్రైలర్..

View this post on Instagram

A post shared by GA2 Pictures (@ga2pictures)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?