Bigg Boss 7 Telugu : బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌పై కాసుల వర్షం.. 50 లక్షలు కాదు.. ఈసారి అంతకు మించి..

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలిచినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నడుస్తోంది. అమర్‌ దీప్‌ రెండో స్థానంలో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బిగ్‌ బాస్‌ పెద్దన్న శివాజీ మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నట్లు సమాచారం. ఇక ప్రిన్స్‌ యావర్‌ నాలుగు, ఐదో ప్లేస్‌లో అంబటి అర్జున్‌, ఆరో ప్లేస్‌లో ప్రియాంక జైన్‌ నిలిచి నట్లు తెలుస్తుంది. అయితే ఎపిసోడ్‌ ప్రారంభమైతే..

Bigg Boss 7 Telugu : బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌పై కాసుల వర్షం.. 50 లక్షలు కాదు.. ఈసారి అంతకు మించి..
Bigg Boss 7 Telugu Prize Money
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2023 | 5:25 PM

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌ టైటిల్‌ విన్నర్‌ విజేత మరికాసేపట్లో తేలనుంది. దీంతో గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ కోసం బుల్లితెర ప్రేక్షకులు, అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక టైటిల్‌ విన్నర్‌ ఎవరన్నదానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌గా నిలిచినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నడుస్తోంది. అమర్‌ దీప్‌ రెండో స్థానంలో సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బిగ్‌ బాస్‌ పెద్దన్న శివాజీ మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నట్లు సమాచారం. ఇక ప్రిన్స్‌ యావర్‌ నాలుగు, ఐదో ప్లేస్‌లో అంబటి అర్జున్‌, ఆరో ప్లేస్‌లో ప్రియాంక జైన్‌ నిలిచి నట్లు తెలుస్తుంది. అయితే ఎపిసోడ్‌ ప్రారంభమైతే కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాదు. ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీ గురించి నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత సీజన్ల కంటే టైటిల్‌ విజేతకు ఈసారి భారీగానే అందనున్నట్లు తెలుస్తోంది. విజేతగా నిలిచిన వారికి రూ.50 లక్షల ప్రైజ్‌ మనీని బిగ్‌ బాస్‌ టీమ్‌ ఇవ్వనుంది. అలాగే ఈ సెలబ్రిటీ గేమ్‌ షోకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న ఒక ప్రముఖ ఆభరణాల సంస్థ విజేతకు రూ. 20 లక్షల విలువైన వజ్రాల నెక్లెస్‌ కూడా బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం.

నగదు, నెక్లెస్‌తో పాటు రూ. 12 ల‌క్ష‌ల విలువైన మారుతి బ్రిజా కారుకు కూడా బిగ్‌ బాస్ టైటిల్‌ విన్న‌ర్‌కు బహూకరించనున్నట్లు తెలిసింది. ఓవ‌రాల్‌గా చూసుకుంటే బిగ్‌బాస్ టైటిల్‌ విజేతకు రూ. 80 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ ద‌క్క‌నున్న‌ట్లు సమాచారం. మరికాసేపట్లో ప్రారంభం కానున్న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే వెంకటేశ్‌ సైంధవ టీమ్‌ కూడా సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే