AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Grand Finale Highlights: చరిత్ర సృష్టించిన రైతు బిడ్డ.. బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్

Bigg Boss Telugu 7 Grand Finale Highlights: సుమారు 105 రోజుల పాటు  బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్‌ బాస్‌ షో ఆఖరి అంకానికి చేరుకుంది. మరికాసపేట్లో ఈ సెలబ్రిటీ గేమ్‌ షోకు శుభం కార్డు పడనుంది. బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేతను నిర్ణయించే గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టగా పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌ దీప్‌, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, అంబటి అర్జున్‌ గ్రాండ్‌ ఫినాలేకు చేరుకున్నారు

Bigg Boss 7 Grand Finale Highlights: చరిత్ర సృష్టించిన రైతు బిడ్డ.. బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్
Bigg Boss 7 Telugu Grand Finale
Basha Shek
|

Updated on: Dec 17, 2023 | 11:00 PM

Share

Bigg Boss Telugu 7 Grand Finale Live Updates: సుమారు 105 రోజుల పాటు  బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్‌ బాస్‌ షో ఆఖరి అంకానికి చేరుకుంది. మరికాసపేట్లో ఈ సెలబ్రిటీ గేమ్‌ షోకు శుభం కార్డు పడనుంది. బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేతను నిర్ణయించే గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ మరికొన్ని క్షణాల్లో ప్రారంభం కానుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టగా పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌ దీప్‌, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, అంబటి అర్జున్‌ గ్రాండ్‌ ఫినాలేకు చేరుకున్నారు. మరి బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ టైటిల్‌ విన్నర్‌ ఎవరు? రన్నరప్‌ ఎవరు? ఎంత ప్రైజ్‌ మనీ ఇచ్చారు? తదితర ఆసక్తికర విషయాల కోసం మినిట్‌ టు మినిట్‌ లైవ్‌ అప్డేట్స్‌ మీకోసం..

బిగ్ బాస్ సీజన్ 7 మొత్తం కంటెస్టెంట్స్ వీళ్లే..

1. కిరణ్ రాథోడ్
2. షకీలా
3. సింగర్ దామిని
4. శుభ శ్రీ రాయగురు
5. సందీప్ మాస్టర్
6. పల్లవి ప్రశాంత్
7. శివాజీ
8. శోభా శెట్టి
9. ప్రియాంక జైన్
10. రతికా రోజ్
11. గౌతమ్ కృష్ణ
12. అమర్ దీప్
13. ప్రిన్స్ యావర్
14. తేస్టీ తేజా

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్..

15. నయని పావని
16. పూజా మూర్తి
17. అశ్విని శ్రీ
18. అర్జున్ అంబటి
19. భోలే షావళి

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లేటెస్ట్ ప్రోమో..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Dec 2023 10:44 PM (IST)

    బిగ్ బాస్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.

    రైతు బిడ్డ చరిత్ర సృష్టించాడు. ఒక కామన్ మ్యాన్ గా హౌజ్లోకి అడుగపెట్టిన పల్లవి ప్రశాంత్ ఏకంగా టైటిల్ ను ఎగరేసుకుపోయాడు. తద్వారా ఒక బిగ్ బాస్ చరిత్రలో కామన్ మెన్ కేటగిరిలో విజేతగా నిలిచిన తొలి కంటెస్టెంట్ గా రికార్డుల కెక్కాడు.

  • 17 Dec 2023 10:33 PM (IST)

    బిగ్ బాస్ స్టేజిపైకి రైతు బిడ్డ, అమర్

    బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లి టాప్ 2 కంటెస్టెంట్స్ అయిన ప్రశాంత్, అమర్ దీప్ లను స్టైజీపైకి తీసుకొచ్చాడు హోస్ట్ నాగార్జున. అనంతరం స్టైజీపై నాగార్జున జర్నీ చూపించారు. మరికాసేపట్లో విజేత ఎవరో తేలనుంది..

  • 17 Dec 2023 10:11 PM (IST)

    శివాజీ ఎలిమినేట్.. కాళ్లు మొక్కి కన్నీళ్లు పెట్టుకున్న రైతు బిడ్డ

    బిగ్ బాస్ పెద్దన్న, చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న శివాజీ ఎలిమినేట్ అయ్యాడు. విన్నర్ గా నిలుస్తాడనుకున్న అతను మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.  హౌజ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు శివాజీ కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్..

  • 17 Dec 2023 09:53 PM (IST)

    ప్రిన్స్ యావర్ ఔట్.. రూ. 15 లక్షలతో బయటకు..

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నుంచి ప్రిన్స్ యావర్ బయటకు వచ్చేశాడు. తనకు అప్పులు ఉండడంతో రూ. 15 లక్షల బ్రీఫ్ కేసును తీసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని రూ. 15 లక్షల సూట్ కేసుతో బయటకు వచ్చేశాడు.

  • 17 Dec 2023 09:43 PM (IST)

    15 లక్షల బ్రీఫ్ కేస్ తో హౌజ్ లోకి అల్లరి నరేష్

    బిగ్ బాస్ హౌజ్ లోకి సూట్ కేస్ బాక్స్ తో అల్లరి నరేష్, రాజ్ తరుణ్  ను పంపించారు నాగార్జున. మొత్తం నలుగురిలో ఒకరికి డబ్బు ఆశ చూపించి బయటకు తీసుకురావాలాని  టాస్క్ అప్పజెప్పాడు. దీంతో హౌజ్ లోకి వెళ్లారు నరేష్, రాజ్ తరుణ్..

  • 17 Dec 2023 09:30 PM (IST)

    బిగ్ బాస్ వేదికపైకి నా సామిరంగ టీమ్..

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వేదికపై నా సామిరంగ టీమ్ సందడి చేసింది. ఇందులో హీరో నాగార్జునతో పాటు నటిస్తోన్న అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు హీరోయిన్ అషికా రంగనాథ్, డైరెక్టర్ అంజిని ఆడియెన్స్ కు పరిచయం చేశారు హోస్ట్. ఈ సందర్భంగా నా సామిరంగ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

  • 17 Dec 2023 09:25 PM (IST)

    కంటెస్టెంట్స్ కు నాగార్జున ఇచ్చిన అవార్డులివే..

    • పిడకలు- దామిని
    • ఇన్‌స్టంట్ న్యూడిల్స్ నయని పావని
    • వాటర్ బాటిల్ – పూజామూర్తి
    • రెడ్ లిప్‌స్టిక్  – శుభశ్రీ
    • ఉడుత – రతిక
    • సంచాలక్ ఆఫ్ సీజన్ – సందీప్ మాస్టర్
    • గోల్డెన్ మైక్  – భోలె షా వళి
    • టిష్యూ – అశ్విని
    • డంబెల్ – గౌతమ్
    • ఫైర్ బ్రాండ్ – శోభాశెట్టి
  • 17 Dec 2023 09:18 PM (IST)

    హౌజ్ నుంచి బయటకు వచ్చేసిన ప్రియాంక జైన్..

    బిగ్ బాస్ టాప్-6 కంటెస్టెంట్స్ లో ఏకైక అమ్మాయి ప్రియాంక జైన్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆమె టాప్-3లో ఉంటుందని చాలామంది భావించారు. అయితే ఐదో స్థానంతోనే సరిపెట్టుకుంది కన్నడ బ్యూటీ.

  • 17 Dec 2023 09:06 PM (IST)

    శివాజీ అంత మైండ్ గేమర్ లేడు..

    ‘బిగ్ బాస్ చరిత్రలోనే శివాజీ అంత మైండ్ గేమర్ లేడు’ అనేదానికి హౌజ్ మేట్స్ నుంచిఎస్, నో అని  ఆన్సర్ చెప్పాల్సిందిగా నాగ్ అడిగాడు. దానికి అంతా అవును అని బోర్డ్ ఎత్తారు. దీంతో నీకు ఊరికే చాణక్య అని పేరు పెట్టలేదని నాగ్ శివాజీతో అన్నాడు.

  • 17 Dec 2023 08:35 PM (IST)

    అంబటి అర్జున్ ఎలిమినేట్

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో మొదటిగా అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. స్టార్ యాంకర్ సుమ అర్జున్ ను హౌజ్ నుంచి బయటకు తీసుకొచ్చింది. అర్జున్ తో పాటు అతని భార్య సురేఖ కూడా బిగ్ బాస్ వేదిక పైకి వచ్చారు.

  • 17 Dec 2023 08:24 PM (IST)

    కుమారుడితో కలిసొచ్చిన స్టార్ యాంకర్ సుమ

    బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలేలో స్టార్‌ యాంకర్‌ సుమ సందడి చేశారు. తన కుమారుడు రోషన్‌ కనకాలతో కలిసి స్టేజిపైకి వచ్చారు. అలాగే బబుల్‌ గమ్‌ సినిమా ప్రమోషన్లలో భాగంగా మానస చౌదరి కూడా వచ్చింది.

  • 17 Dec 2023 08:19 PM (IST)

    అక్కడే మంచి అనుభవాలున్నాయి..

    బిగ్ బాస్ హౌజ్‌లో ఫేవరెట్‌ స్పాట్‌ ఏంటని హోస్ట్‌ నాగార్జున కంటెస్టెంట్స్‌ అందరినీ అడిగాడు. మొదట ప్రియాంకను అడగ్గా.. తన ఫేవరేట్‌ రూమ్‌ స్టాండర్డ్‌ రూమ్‌ అని చెప్పింది. ఆతర్వాత అర్జున్‌ తనకు గార్డెన్‌ ఏరియా అంటే ఇష్టమన్నాడు. ఇక జోస్ అలుక్కాస్ రూమ్‌లో మంచి రిలాక్సేషన్ ఉంటుందని శివాజీని ఆ రూం ఎంచుకున్నాడు. ఇక అమర్‌-గోడౌన్‌, ప్రశాంత్‌-గార్జెన్‌ ఏరియాలోని మొక్క అని చెప్పారు.

  • 17 Dec 2023 08:14 PM (IST)

    నిధి అగర్వాల్ హాట్ హాట్ స్టెప్పులు..

    టాలీవుడ్  స్టార్ హీరోయిన్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో సందడి చేసింది. తనదైన  హాట్ హాట్ స్టెప్పులతో అదరగొట్టింది. ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగ్గాయెట్టు’, ‘రామయ్యా.. వస్తావయ్యా..’ వంటి సాంగ్స్‌తో ఆడియెన్స్ ను,  అభిమానులను అలరించింది.
  • 17 Dec 2023 08:09 PM (IST)

    బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జర్నీ.. ఏడ్చేసిన టేస్టీ తేజా

    బిగ్ బాస్ ఏడో సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరికి సంబంధించిన బిగ్‌‌బాస్ జర్నీని వీడియోగా ప్లే చేసి అందరికీ చూపించారు హోస్ట్ నాగార్జున.ఈ సందర్ప్రబంగా అందరూ తమని తాము స్క్రీన్‌పై చూసుకుని మురిసిపోయారు. టేస్టీ తేజా ఎమోషనల్ అయ్యి ఏడ్చేశాడు.

  • 17 Dec 2023 08:02 PM (IST)

    మైసమ్మ పాటకు శివాజీ స్టెప్పులు,

    బిగ్ బాస్ 7 తెలుగు టాప్ 6 కంటెస్టెంట్స్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చూపిస్తున్నారు. శివాజీ తన మైసమ్మ పాటకు స్టెప్పులేస్తే, ప్రిన్స్ యావర్ వాట్ లగాదేంగే అంటూ లైగర్ మూవీలోని పాటకు కాలు కదిపాడు. ఇక రంజితమే సాంగ్ కు ప్రియాంక జైన్ ఆకట్టుకునేలా డ్యాన్స్ చేసింది. తర్వాత తనకు ఇచ్చిన మొక్కను పట్టుకుని రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ పుష్ప మూవీలోని ఏయ్ బిడ్డా అనే పాటకుస్టెప్పులేశాడు.

  • 17 Dec 2023 07:40 PM (IST)

    పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ భావోద్వేగం

    బిగ్ బాస్‌లో టాప్ కంటెస్టెట్ గా పల్లవి ప్రశాంత్ నిలవడంపై అతని తండ్రి ఎమోషనల్ అయ్యాడు.  బిగ్ బాస్ కు ముందు తానెవరికీ తెలియదని.. ఇప్పుడు లక్షల మంది తమను చూస్తున్నారని ఎమోషనల్ అయ్యారు.
  • 17 Dec 2023 07:23 PM (IST)

    కుటుంబ సభ్యుల ఎమోషనల్..

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు మాజీ కంటెస్టెంట్స్ తో పాటు టాప్-6 కంటెస్టెంట్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. అంబటి అర్జున్ భార్య, పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు, అమర్ దీప్ తల్లితో పాటు ఇతర కంటెస్టెంట్స్ అందరూ హాజరయ్యారు.

  • 17 Dec 2023 07:14 PM (IST)

    ఆ ఇద్దరూ కంటెస్టెంట్లు మిస్..

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందరూ తరలి వచ్చారు. అయితే కిరణ్ రాథోడ్,  షకీలా మాత్రం మిస్ అయ్యారు.

  • 17 Dec 2023 07:11 PM (IST)

    గ్రాండ్ ఫినాలేకు మాజీ కంటెస్టెంట్స్..

    బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలేకు మాజీ కంటెస్టెంట్స్ అందరూ హాజరు కానున్నారు. ఇప్పటికే సందీప్ మాస్టర్, భోలే షావళి, టేస్టీ తేజా, శోభా శెట్టి, అశ్విని శ్రీ, శుభ శ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ, సింగర్ దామిని, రతికా రోజా, పూజా మూర్తి తదితరులు డ్యాన్సులు చేస్తూ తమదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు.

  • 17 Dec 2023 07:07 PM (IST)

    కేజీఎఫ్ పాటతో నాగ్ ఎంట్రీ..

    బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ప్రారంభమైంది. కేజీఎఫ్ సినిమాలోని ధీరా ఓ ధీరా పాటతో హోస్ట్  నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. బ్లాక్ కలర్ డ్రెస్ లో మన్మథుడి లుక్ అదిరిపోయిందంతే..

  • 17 Dec 2023 07:00 PM (IST)

    గ్రాండ్ ఫినాలే అతిథులు ఎవరంటే?

    బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా రానున్నారని తెలుస్తోంది. అలాగే డెవిల్ టీమ్ నుంచి కల్యాణ్ రామ్, సంయుక్తా మేనన్ సందడి చేయనున్నారు. ఇక బబుల్ గమ్ ప్రమోషన్లలో భాగంగా స్టార్ యాంకర్ సుమ, ఆమె కుమారుడు రోషన్ కనకాల రానున్నారు.

  • 17 Dec 2023 06:20 PM (IST)

    మహేశ్ బాబు చేతుల మీదుగా..

    బిగ్ బాస్ 7 తెలుగు గ్రాండ్ ఫినాలేకు సూపర్ స్టార్ మహేశ్ బాబు  ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలుస్తోంది. మహేశ్ బాబు చేతులమీదుగా బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విజేతకు ట్రోఫీని అందజేయనున్నట్లు సమాచారం.

  • 17 Dec 2023 05:52 PM (IST)

    గ్రాండ్ ఫినాలేకు ఆరుగురు కంటెస్టెంట్ల్స్..

    టాప్ -6 కంటెస్టెంట్స్ వీళ్లే..

    1. పల్లవి ప్రశాంత్
    2. అమర్ దీప్
    3. శివాజీ
    4. ప్రిన్స్ యావర్
    5. ప్రియాంక జైన్
    6. అర్జున్ అంబటి..

Published On - Dec 17,2023 5:51 PM