Bigg Boss 7 Telugu: బిగ్బాస్ గ్రాండ్ ఫినాలేలో ఓటీటీ సీజన్ 2 ప్రకటన.. ?.. ఎప్పటినుంచి అంటే..
ఈసారి సీజన్ 7 విజేతగా కామన్ మెన్ రైతుబిడ్డ ప్రశాంత్ చరిత్ర సృష్టించబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే అతడి ఫ్యాన్స్ నెట్టింట సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు. ప్రశాంత్ కు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రశాంత్ విన్నర్ అంటూ లీకులు కూడా వచ్చేశాయి. మరికాసేపట్లో విన్నర్ ఎవరనేది కూడా స్పష్టం కానుంది. ఈ క్రమంలోనే బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై హోస్ట్ నాగార్జున ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారట.
బిగ్బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే నడుస్తోంది. మరికొన్ని గంటల్లో విజేత ఎవరనేది తెలియబోతుంది. ఆరుగురు ఫైనలిస్ట్స్ మిగలగా.. ఇప్పటివరకు యావర్, అర్జున్, ప్రియాంక, శివాజీ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు అమర్, ప్రశాంత్ మధ్య గట్టి పోటి నడుస్తోంది. అయితే ఈసారి సీజన్ 7 విజేతగా కామన్ మెన్ రైతుబిడ్డ ప్రశాంత్ చరిత్ర సృష్టించబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే అతడి ఫ్యాన్స్ నెట్టింట సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు. ప్రశాంత్ కు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రశాంత్ విన్నర్ అంటూ లీకులు కూడా వచ్చేశాయి. మరికాసేపట్లో విన్నర్ ఎవరనేది కూడా స్పష్టం కానుంది. ఈ క్రమంలోనే బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై హోస్ట్ నాగార్జున ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారట.
అదేంటంటే.. గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై నాగార్జున్ ఓటీటీ సీజన్ 2 అప్డేట్ ఇవ్వబోతున్నారట. అంటే.. సీజన్ 7 పూర్తికావడంతోనే ఓటీటీ సీజన్ 2 అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మార్చి నుంచి ఈ సీజన్ 2 స్టార్ట్ కానుందని సమాచారం. మరీ నాగార్జున కేవలం ఓటీటీ సీజన్ 2 మాత్రమే అనౌన్స్ చేస్తారా ?.. లేదా? స్ట్రీమింగ్ ఎప్పుడనేది చెబుతారా ? అనేది చూడాలి. ఇప్పటివరకు వచ్చిన అన్ని సీజన్లలో ఈ సీజన్ సూపర్ హిట్ అయింది. ఉల్టా పుల్టా అంటూ మొదలుపెట్టిన ఈ సీజన్ లో నాగార్జున హోస్టింగ్ అదరగొట్టేశారు. కానీ పలు సందర్భాల్లో మాత్రం పూర్తిగా నెగిటివిటీ వచ్చింది.
ఇదంతా పక్కన పెడితే.. గతంలో బిగ్బాస్ ఓటీటీ సీజన్ 1 కూడా హిట్ అయ్యింది. టీవీలో కాకుండా హాట్ స్టార్ లో వచ్చే ఈ సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సీజన్ 1 విజేతగా మొదటిసారి అమ్మాయి నిలిచింది. హీరోయిన్ బింధు మాధవి విజేత కాగా.. అఖిల్ సార్థక్ రన్నర్ అయ్యాడు. ఆ తర్వాత సీజన్ 6 అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో ఓటీటీ సీజన్ 2 గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక ఆతర్వాత వచ్చిన సీజన్ 7 హిట్ కావడంతో మరోసారి ఓటీటీ సీజన్ 2 తీసుకోచ్చే ఆలోచనలో ఉన్నారట. మరీ ఓటీటీ సీజన్ 2 గురించి ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.