Rohit Sharma: ముంబైను వదిలేయ్‌.. కెప్టెన్సీ తొలగించడంపై రోహిత్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ .. ట్రెండింగ్‌ లో #ShameonMI

త్త కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను ప్రకటించిన కొద్ది గంటల్లోనే ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌ ఇచ్చారు రోహిత్‌ ఫ్యాన్స్‌. ఆ జట్టు అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌ను ఏకంగా 4 లక్షల మందికి పైగా అన్‌ ఫాలో చేశారు. అలాగే రోహిత్‌కు మద్దతుగా నెట్టింట #ShameonMI అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

Rohit Sharma: ముంబైను వదిలేయ్‌.. కెప్టెన్సీ తొలగించడంపై రోహిత్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ .. ట్రెండింగ్‌ లో #ShameonMI
Rohit Sharma
Follow us

|

Updated on: Dec 15, 2023 | 10:44 PM

కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ముంబై ఇండియన్స్‌ యాజమాన్యంపై హిట్‌ మ్యాన్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ను ఇలా తొలగించడం భావ్యం కాదంటూ ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీపై దమ్మెత్తిపోస్తున్నారు. కొత్త కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను ప్రకటించిన కొద్ది గంటల్లోనే ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌ ఇచ్చారు రోహిత్‌ ఫ్యాన్స్‌. ఆ జట్టు అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌ను ఏకంగా 4 లక్షల మందికి పైగా అన్‌ ఫాలో చేశారు. అలాగే రోహిత్‌కు మద్దతుగా నెట్టింట #ShameonMI అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి సినిమాలో సత్యరాజ్‌ (కట్టప్ప) ప్రభాస్‌ను వెనక నుంచి కత్తితో పొడిచినట్లు ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ ను వెన్నుపోటు పొడిచారంటూ మండిపడుతున్నారు. జోన్‌45 అని ఐడీ ఉన్న ఒక రోహిత్‌ అభిమాని అయితే ఏకంగా ముంబై ఇండియన్స్‌ జెండాను మంటల్లో కాల్చుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో షేర్‌ చేస్తూ తన ఆవేదనను వెల్లగక్కాడు. మొత్తానికి మధ్యాహ్నం నుంచి అంబానీ ఫ్యామిలీతో పాటు హార్దిక్‌ పాండ్యాపై నెట్టింట ఒక రకమైన హేట్‌ క్యాంపెయిన్ నడుస్తోంది.

ముంబై ఇండియన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా పదేళ్ల పాటు సేవలందించాడు రోహిత్ శర్మ. తన అద్బుతమైన కెప్టెన్సీతో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ నేపథ్యంలో తన సేవలకు గుర్తింపుగా కనీసం ఈ సీజన్‌లో నైనా కెప్టెన్‌గా కొనసాగించాల్సిందంటూ క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరో సీజన్‌ కొనసాగించాల్సింది..

కట్టప్పలా వెన్నుపోటు పొడిచారు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles