Rohit Sharma: తప్పుకున్నాడా? తప్పించారా? ముంబై  కెప్టెన్‌గా ముగిసిన రోహిత్‌ శకం.. ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేకింగ్

రోహిత్ శర్మ స్వయంగా ముంబై కెప్టెన్సీని వదిలేశాడా? లేదా మేనేజ్‌మెంట్‌ తప్పించిందా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా రోహిత్ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ మార్పు చాలా మంది ఊహించిందే కానీ ఇంత హఠాత్తుగా మాత్రం కాదంటున్నారు.

Rohit Sharma: తప్పుకున్నాడా? తప్పించారా? ముంబై  కెప్టెన్‌గా ముగిసిన రోహిత్‌ శకం.. ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేకింగ్
Rohit Sharma
Follow us

|

Updated on: Dec 15, 2023 | 9:05 PM

ఐపీఎల్‌లో అత్యం విజయవంతమైన జట్టైన ముంబై ఇండియన్స్‌లో ఒక శకం ముగిసింది. తన అసాధారణ కెప్టెన్సీతో రికార్డు స్థాయిలో ముంబైకు ఐదు సార్లు ఐపీఎల్‌ ట్రోఫీని అందించిన రోహిత్ శర్మ ఇక కేవలం ఆటగాడిగా మాత్రమే కనిపించనున్నారు. ముంబై ఇండియన్స్‌ కొత్త కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్ హార్ధిక్‌ పాండ్యాను నియమిస్తూ ఆ జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో హార్దిక్‌ సారథ్యంలోనే ముంబై బరిలోకి దిగనుండని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు హార్దిక్‌ పాండ్యాకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ సేవలందించడాని కొనియాడింది. రోహిత్‌ మైదానం, వెలుపల తమతోనే ఉంటాడని చెప్పుకొచ్చింది. అయితే రోహిత్ శర్మ స్వయంగా ముంబై కెప్టెన్సీని వదిలేశాడా? లేదా మేనేజ్‌మెంట్‌ తప్పించిందా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా రోహిత్ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ మార్పు చాలా మంది ఊహించిందే కానీ ఇంత హఠాత్తుగా మాత్రం కాదంటున్నారు. హిట్‌ మ్యాన్‌కు మరో 3-4 ఏళ్ల కెప్టెన్సీ చేసే సత్తా ఉందని, ఇంత సడెన్‌గా తప్పించాల్సింది కాదంటూ ఫ్యాన్స్‌ తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. 2013లో రికీ పాంటింగ్‌ సారథ్యంలో ముంబై ఇండియన్స్‌ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. గత పదేళ్లుగా ముంబై ఇండియన్స్‌ బాధ్యతలను భుజాన మోస్తున్నాడు. అతను మొత్తం 158 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో 87 మ్యాచుల్లో ముంబై విజయం సాధించింది. మరో 67 మ్యాచుల్లో ఓడిపోయింది. అంటే హిట్‌ మ్యాన్‌ కెప్టెన్సీలో విజయాల శాతం 55.06. విశేషమేమిటంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్ గా నిలిచింది. 2013, 2015, 2017, 2019, 2020 ఇలా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. ఇప్పుడీ పదేళ్ల కెప్టెన్సీ ప్రయాణం అనూహ్యంగా ముగిసింది. మరి ముంబై ఇండియన్స్‌ నిర్ణయంపై రోహిత్ శర్మ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

పదేళ్లలో ఐదు సార్లు ఛాంపియన్ గా..

ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేకింగ్ మూమెంట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles