Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సినిమాతోనే కుర్రాళ్లను ఆగం చేసిన బ్యూటీ.. స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్‌.. ఎవరో గుర్తుపట్టారా?

ఇటీవల విడుదలైన ఓ సినిమా ఈ సొగసరిని సెన్సేషన్‌గా మార్చేసింది. ఎక్కడ లేని క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఒక్క బాలీవుడ్‌, టాలీవుడ్ కాదు ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా ఈ అందాల తార పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఏ సోషల్‌ మీడియా ప్లాట్ ఫామ్‌ చూసినా తన ఫొటోలే. మరి ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా?

ఒక్క సినిమాతోనే కుర్రాళ్లను ఆగం చేసిన బ్యూటీ.. స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్‌.. ఎవరో గుర్తుపట్టారా?
Actress
Follow us
Basha Shek

|

Updated on: Dec 14, 2023 | 9:24 PM

ఈ ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తుపట్టారా? ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్‌ సెన్సేషన్‌. ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అంతకు ముందు చాలా సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించిందామె. అయితే దేనితోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇటీవల విడుదలైన ఓ సినిమా ఈ సొగసరిని సెన్సేషన్‌గా మార్చేసింది. ఎక్కడ లేని క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఒక్క బాలీవుడ్‌, టాలీవుడ్ కాదు ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా ఈ అందాల తార పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఏ సోషల్‌ మీడియా ప్లాట్ ఫామ్‌ చూసినా తన ఫొటోలే. మరి ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా? లేదా? మమ్మల్నే సమాధానం చెప్పేయమంటారా? ఈ బ్యూటీ మరెవరో కాదు యానిమల్‌ సినిమా సెకెండ్‌ హీరోయిన్‌ తృప్తి దిమ్రి. గతంలో ఈ బ్యూటీ పలు షార్ట్‌ ఫిల్మ్స్‌, సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల్లో నటించింది. యానిమల్‌ మూవీలో లాగానే కొన్నింటిలో బోల్డ్‌గా నటించింది. అలా 8 ఏళ్ల క్రితం త్రిప్తి దిమ్రీ నటించిన ఒక్క వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

గతంలో త్రిప్తి దిమ్రీ ‘లైలా మజ్ను’, ‘బుల్బుల్’ వంటి సినిమాల్లో నటించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘కాలా’ వెబ్ సిరీస్‌లో కూడా అతను బోల్డ్ పాత్రను పోషించింది. ఇందులో ఆమె ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇవే గాక కెరీర్‌ ప్రారంభంలో పోస్టర్‌ బాయ్స్‌, మామ్స్‌ వంటి మూవీలో నటించింది. అయితే యానిమల్‌ విడుదల తర్వాత తృప్తి దిమ్రీ బాగా ఫేమస్ అయ్యింది. ఏకంగా ‘నేషనల్ క్రష్’ ట్యాగ్‌ సొంతం చేసుకుంది. యానిమల్’ సినిమా విడుదలకు ముందు తృప్తి దిమ్రీకి ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 6 లక్షల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పుడు 37 లక్షల మందికి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. అంతేకాదు క్రేజీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. త్రిప్తి డిమ్రీకి ఇప్పుడు 28 ఏళ్లు. గతంలో అనుష్క శర్మ తన సోదరుడు కర్నేష్ శర్మతో రిలేషన్ షిప్‌లో ఉంది. అయితే ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.

ఇవి కూడా చదవండి

తృప్తి దిమ్రి లేటెస్ట్ ఫొటోస్..

యానిమల్ సినిమాలో రణ్ బీర్ తో కలిసి..

గతంలో ఓ షార్ట్ ఫిల్మ్ లో తృప్తి దిమ్రి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏప్రిల్‌ నెల పాఠశాలల సెలవులు జాబితా.. ఎన్ని రోజులో తెలుసా..?
ఏప్రిల్‌ నెల పాఠశాలల సెలవులు జాబితా.. ఎన్ని రోజులో తెలుసా..?
చేపల పులుసు మామిడి కాయతో ట్రై చేయండి.. సూపర్ టేస్ట్​ గురూ
చేపల పులుసు మామిడి కాయతో ట్రై చేయండి.. సూపర్ టేస్ట్​ గురూ
వారానికి రెండు రోజులే పని.. షాకిస్తున్న బిల్‌గేట్స్ వ్యాఖ్యలు
వారానికి రెండు రోజులే పని.. షాకిస్తున్న బిల్‌గేట్స్ వ్యాఖ్యలు
ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్
ఏపీలో రూ.7.55 లక్షల పెన్షన్‌ డబ్బులతో పరారైన వెల్ఫేర్‌ అసిస్టెంట్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కెమెరామన్ గంగతో రాంబాబు నటి..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కెమెరామన్ గంగతో రాంబాబు నటి..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది..
ఆ స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోమని వాళ్ల అమ్మ అడిగింది..
Earthquake Video: శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క...
Earthquake Video: శిథిలాల కింద ప్రాణాలను పసిగడుతున్న కుక్క...
క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయండి
క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ లాలిపాప్స్.. ఇలా చేయండి
వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..
వరమాల కోసం వేచి ఉన్న వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిన..
అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆట జపాన్‌ వ్యోమగామి వీడియో వైరల్‌
అంతరిక్ష కేంద్రంలో బేస్‌బాల్‌ ఆట జపాన్‌ వ్యోమగామి వీడియో వైరల్‌