Rohit Sharma: ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా.. మరోసారిఎమోషనలైన కెప్టెన్‌ రోహిత్ .. వీడియో

టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ కన్నీటీ పర్యంతమై మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు హిట్‌ మ్యాన్‌. దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అయితే డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు రోహిత్‌.

Rohit Sharma: ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా.. మరోసారిఎమోషనలైన కెప్టెన్‌ రోహిత్ .. వీడియో
Rohit Sharma
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2023 | 6:52 PM

2011 తర్వాత వన్డే ప్రపంచకప్ గెలవాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోయింది. ఈ ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత జట్టు వరల్డ్‌ చాంపియన్‌గా నిలుస్తుందని అందరూ భావించారు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ సేన అనూహ్యంగా ఓటమి పాలైంది. ఫైనల్‌లో పరాజయం చెందడంతో ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ కన్నీటీ పర్యంతమై మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు హిట్‌ మ్యాన్‌. దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అయితే డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు రోహిత్‌. ప్రస్తుతం టెస్ట్‌ సిరీస్‌ కోసం రెడీ అవుతోన్న రోహిత్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమిపై మరోసారి ఎమోషనల్‌ అయ్యాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్‌ చేశాడు. ‘ప్రపంచకప్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను. కప్ గెలవలేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి 50 ఓవర్ల ప్రపంచకప్ చూస్తూ పెరిగాను. ఇది నాకు గొప్ప అవకాశం. ఇందుకోసం చాలా కష్టపడ్డాం కూడా. అయితే చివరి దశలో తడబడడం మమ్మల్ని బాగా నిరాశపరిచింది. మన కలలు నెరవేరనప్పుడు చాలా నిరాశ కలుగుతుంది. ప్రస్తుతం నేను కూడా చాలా నిరాశగా ఉన్నాను. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమిని ఎలా అధిగమించాలో తెలియలేదు. ఆ ఓటమి నన్ను తీవ్రంగా కలిచి వేసింది. అభిమానుల ఆశలను అడియాశలు చేయడం ఎంతో బాధించింది’

ఈ క్లిష్ట సమయంలో నా కుటుంబం, స్నేహితులు నాకు అండగా నిలిచారు. ఓటమిని అంగీకరించడం అంత సులభం కాదు. అయితే అన్నిటినీ ముందుకెళ్లడం అనివార్యం. చాలామంది నా వద్దకు వచ్చి భారత జట్టు గురించి గర్వపడుతున్నారని చెబుతున్నారు. ఈ మాటలు నాకు చాలా ఊరటనిచ్చాయి. దీంతో నేను కూడా ప్రపంచకప్‌ ఫైనల్ బాధ నుంచి క్రమంగా తేరుకుంటున్నాను. ప్రపంచకప్‌లో మాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. ఫైనల్‌లోనూ ఓటమి పాలైన తర్వాత కూడా మాకు అండగా నిలిచారు. ఆ మద్దతే ఇప్పుడు నాకు కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అభిమానులు హిట్‌ మ్యాన్‌ మద్దతుగా నిలుస్తున్నారు. రాబోయే టీ 20 ప్రపంచకప్‌లోనూ భారత జట్టుకు నాయకత్వం వహించాలంటూ కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ కామెంట్స్.. వీడియో

View this post on Instagram

A post shared by Team Ro (@team45ro)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..