Mangalavaaram OTT: ‘మంగళవారం’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారింది.. పాయల్‌ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన మంగళవారం నవంబర్‌ 17న థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని మలుపులతో సాగే మంగళవారం సినిమా జనాలను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత ఆ స్థాయిలో విజయాలు లేని పాయల్‌ రాజ్‌పుత్, డైరెక్టర్‌ అజయ్‌ భూపతిలకు మంచి సాలిడ్‌ హిట్‌ దొరికింది.

Mangalavaaram OTT: 'మంగళవారం' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మారింది.. పాయల్‌ సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Mangalavaram Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2023 | 8:06 PM

ఆర్‌ ఎక్స్‌ 100 ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ సినిమా ‘మంగళవారం’. తనకు హీరోయిన్‌గా మొదటి అవకాశం కల్పించిన అజయ్‌ భూపతినే ఈ హార్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని తెరకెక్కించాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన మంగళవారం నవంబర్‌ 17న థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఊహించని మలుపులతో సాగే మంగళవారం సినిమా జనాలను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత ఆ స్థాయిలో విజయాలు లేని పాయల్‌ రాజ్‌పుత్, డైరెక్టర్‌ అజయ్‌ భూపతిలకు మంచి సాలిడ్‌ హిట్‌ దొరికింది. థియేటర్లలో ఓ రేంజ్‌లో హిట్‌ అయిన మంగళవారం ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై సోషల్‌ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్‌ 21 లేదా 22 తేదీల్లో మంగళవారం ఓటీటీలోకి రానుందని, లేకపోతే డిసెంబర్‌ 25న స్ట్రీమింగ్ రానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరొక కొత్త డేట్‌ వినిపిస్తోంది. మంగళవారం సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే మంగళవారమే అంటే డిసెంబర్‌ 19న లేదా 26 పాయల్‌ రాజ్‌పుత్‌ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు మంగళవారం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఆహాలో వస్తుందని కొందరు, డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌లోనే స్ట్రీమింగ్ అవుతుందని సోషల్‌ మీడియాలో పోస్టులు షేర్‌ అవుతున్నాయి.

మరోవైపు మంగళవారం మూవీ డైరెక్టర్ అజయ్‌ భూపతి తన సినిమా ఓటీటీ రిలీజ్‌పై వస్తోన్న వార్తలను కొట్టిపరేశాడు. త్వరలోనే అధికారిక తేదీని ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చాడు. మిస్టీరియస్‌ థ్రిల్లర్ కాన్సెప్టెతో తెరకెక్కిన మంగళవారం సినిమాలో ప్రియదర్శి, నందితా శ్వేత, దివ్యా పిళ్లై, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, అజయ్‌ ఘోష్‌, అజ్మల్‌ అమీర్‌, శ్రావణ్‌ రెడ్డి, శ్రీ తేజ్‌, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాంతార, విరూపాక్ష ఫేమ్‌ అజనీష్‌ అందించిన స్వరాలు, బీజీఎమ్‌ మంగళవారం సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మంగళవారమే స్ట్రీమింగ్ అవుతుందా?

మంగళవారం సినిమాలో పాయల్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..