AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vyooham OTT: ఓటీటీలోకి ‘వ్యూహం’.. క్రైమ్‌ థ్రిల్లర్‌ తెలుగు వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కుమారి శ్రీమతి, మోడర్న్ లవ్ హైదరాబాద్, హాస్టల్ డేస్, రానా నాయుడు, సైతాన్‌, రెక్కీ, లేటెస్ట్‌గా దూత వెబ్‌ సిరీస్‌లు తెలుగు ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ కోవలోనే మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ రానుంది. అదే వ్యూహం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లో..

Vyooham OTT: ఓటీటీలోకి 'వ్యూహం'..  క్రైమ్‌ థ్రిల్లర్‌ తెలుగు వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Vyooham Web Series
Basha Shek
|

Updated on: Dec 11, 2023 | 4:20 PM

Share

ప్రస్తుతం ఓటీటీ వెబ్ సిరీస్‌లకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ఎక్కువగా హిందీలోనే వచ్చే ఈ సిరీస్‌లు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సైతం తెరకెక్కుతున్నాయి. తెలుగులో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తుంటే, స్టార్‌ హీరోలు సైతం వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కుమారి శ్రీమతి, మోడర్న్ లవ్ హైదరాబాద్, హాస్టల్ డేస్, రానా నాయుడు, సైతాన్‌, రెక్కీ, లేటెస్ట్‌గా దూత వెబ్‌ సిరీస్‌లు తెలుగు ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ కోవలోనే మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ రానుంది. అదే వ్యూహం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియా యార్లగడ్డ నిర్మించిన ఈ ఇన్వెస్టిగేషన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లో సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్, శశాంక్ సిద్దంశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న వ్యూహం సిరీస్‌ డిసెంబర్‌ 14న అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సోమవారం (డిసెంబర్‌ 11) అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌.

ఇక వ్యూహం వెబ్‌ సిరీస్‌ కథ విషయానికి వస్తే.. ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. న్యాయం కోసం అతను చేసే పోరాటం, ఈ క్రమంలో అతడు ఎదుర్కొనే సవాళ్లు, నిత్యం వేటాడే గతం.. ఇలా ఆసక్తికర అంశాలతో వ్యూహం వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించారు. కాగా నాగచైతన్య నటించిన దూత వెబ్‌ సిరీస్‌ ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 240 దేశాల్లో ఈ సిరీస్‌ ట్రెండింగ్‌లో ఉంటోంది. వ్యూహం కూడా ఇదే కోవలోకి వస్తుందని, ప్రేక్షకులను ఊహించని మలుపులు ఇందులో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

ట్రెండింగ్ లో దూత వెబ్ సిరీస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా ? ఇరుముడి రివ్యూ
రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా ? ఇరుముడి రివ్యూ
ఈ స్టార్ కమెడియన్ కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ అని తెలుసా?
ఈ స్టార్ కమెడియన్ కొడుకు ఇప్పుడు ప్రముఖ స్వామిజీ అని తెలుసా?
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?