My Name Is Shruthi OTT: ఓటీటీలోకి హన్సిక లేటెస్ట్‌ క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

హన్సిక నటించిన లేటెస్ట్‌ సినిమా 'మై నేజ్ ఈజ్ శ్రుతి'. స్కిన్‌ మాఫియా అంశంతో ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఓంకార్‌. నవంబర్ 17న థియేటర్లలో విడుదలైన మై నేమ్ ఈజ్ శ్రుతి ఆడియెన్స్‌ను బాగానే అలరించింది. ముఖ్యంగా సస్పెన్స్‌ అండ్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ చూసే వారికి ఈ మూవీ బాగా నచ్చింది.

My Name Is Shruthi OTT: ఓటీటీలోకి హన్సిక లేటెస్ట్‌ క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
My Name Is Shruthi Movie OTT
Follow us
Basha Shek

|

Updated on: Dec 10, 2023 | 3:14 PM

పెళ్లయిన తర్వాత ప్రొఫెషనల్‌ కెరీర్ పరంగా స్పీడ్ పెంచేసింది యాపిల్‌ బ్యూటీ హన్సిక మెత్వాని. వరుసగా సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. ఈ కోవలో హన్సిక నటించిన లేటెస్ట్‌ సినిమా ‘మై నేజ్ ఈజ్ శ్రుతి’. స్కిన్‌ మాఫియా అంశంతో ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఓంకార్‌. నవంబర్ 17న థియేటర్లలో విడుదలైన మై నేమ్ ఈజ్ శ్రుతి ఆడియెన్స్‌ను బాగానే అలరించింది. ముఖ్యంగా సస్పెన్స్‌ అండ్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ చూసే వారికి ఈ మూవీ బాగా నచ్చింది. థియేటర్లలో యావరేజ్‌గా నిలిచిన హన్సిక మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 17 నుంచి హన్సిక మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ మై నేజ్ ఈజ్ శ్రుతి స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది.  త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

స్కిన్ మాఫియా వర్సెస్ హన్సిక..

మై నేమ్ ఈజ్‌ శ్రుతి చిత్రంలో ముర‌ళీశ‌ర్మ‌, న‌రేన్‌, పూజా రామ‌చంద్ర‌న్, సాయి తేజ, రాజా రవీంద్ర, ప్రవీణ్‌, ఆడుకులం నరేన్‌, జయ ప్రకాశ్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. రమ్య ప్రభాకర్‌, నాగేంద్ర రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఒక యాడ్ ఏజెన్సీలో ప‌నిచేసే శ్రుతి (హన్సిక) స్కిన్ మాఫియా వ‌ల‌లో ఎలా ప‌డింది? ఆ మాఫియాను ఎదుర్కొంటూ ఆమె ఎలాంటి పోరాటాన్ని సాగించింద‌న్న‌దే ఈ సినిమా నేపథ్యం. థియేటర్లలో హన్సిక మై నేమ్ ఈజ్ శ్రుతి సినిమాను మిస్‌ అయ్యారా? మరి ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పెళ్లి రోజు వేడుకల్లో హన్సిక..

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

హన్సిక లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.