AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmanandam: ‘యానిమల్‌’ సినిమాలో హీరోగా బ్రహ్మానందం.. ఈ స్పూఫ్‌ వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే

సినిమాల్లో కనిపించకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం మీమ్స్‌ రూపంలో నిత్యం మనల్ని పలకరిస్తున్నారు బ్రహ్మీ. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఏ అంశమైనా సరే.. బ్రహ్మీనందం మీమ్స్‌ రెడీ అయిపోతుంటాయి. అలా బ్రహ్మీకి సంబంధించిన ఒక స్పూఫ్‌ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Brahmanandam: 'యానిమల్‌' సినిమాలో హీరోగా బ్రహ్మానందం.. ఈ స్పూఫ్‌ వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే
Brahmanandam In Animal Movie
Basha Shek
|

Updated on: Dec 09, 2023 | 9:19 PM

Share

వేలాది సినిమాల్లో తన నటనతో మనల్ని కడుపుబ్బా నవ్వించాడు బ్రహ్మానందం. హాస్య బ్రహ్మగా అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే గతంలో మాదిరిగా బ్రహ్మీ ఇప్పుడు వేగంగా సినిమాలు చేయడం లేదు. అడపా దడపా మాత్రమే వెండితెరపై కనిపిస్తున్నారు. అయితే సినిమాల్లో కనిపించకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం మీమ్స్‌ రూపంలో నిత్యం మనల్ని పలకరిస్తున్నారు బ్రహ్మీ. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఏ అంశమైనా సరే.. బ్రహ్మీనందం మీమ్స్‌ రెడీ అయిపోతుంటాయి. అలా బ్రహ్మీకి సంబంధించిన ఒక స్పూఫ్‌ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లందరూ తెగ నవ్వుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌ రణ్‌ బీర్‌ కపూర్‌ ఊర మాస్ అవతారంలో కనిపించిన సినిమా యానిమల్‌. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని తెరకెక్కించాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్‌ 1న విడుదలైన యానిమల్ సినిమా ఇప్పటివరకు రూ. 600 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోన్న ఈ సినిమాలో రణ్‌ బీర్‌ కపూర్‌, అనిల్‌ కపూర్‌ తండ్రీ, కొడుకులుగా నటించారు. ఇప్పుడిదే సినిమాలో రణ్‌ బీర్‌ కపూర్‌కు బదులుగా బ్రహ్మానందంను పెట్టి ఓ వీడియని రూపొందించారు కొందరు నెటిజన్లు. అలాగే అనిల్‌ కపూర్‌ పాత్రలో నాజర్‌ను చూపించారు.

బాద్‌షా, అతడు, పోకిరి, ఢీ, సూపర్, మనీ మనీ.. ఇలా బ్రహ్మానందం నటించిన సినిమాల్లోని సీన్లను యానిమల్ మూవీలో జత చేస్తూ ఈ స్పూఫ్‌ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను ఎవరు క్రియేట్‌ చేశారో కానీ అందరినీ తెగ నవ్విస్తోంది. ఈ క్రియేటివిటీకి యానిమల్ టీమ్‌ కూడా ఫిదా అయ్యింది. యానిమల్ సీక్వెల్‌గా వస్తోన్న యానిమల్ పార్క్‌లో బ్రహ్మీకి ఛాన్స్‌ ఇవ్వండి సార్‌ అంటూ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగాను అడిగారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరి మీరు కూడా ఈ వీడియోను చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి

బ్రహ్మీ యానిమల్ స్పూఫ్ వీడియో

స్పందించిన యానిమల్ టీమ్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..