Mangalavaram: ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘మంగళవారం’.. పూర్తి వివరాలు..
కలెక్షన్లతో పాటు, విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుందీ చిత్రం. నవంబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కి గురి చేసింది. వైవిధ్యమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు...

ఆర్‌ఎక్స్ 100 మూవీతో సంచలన విజయం అందుకున్న అజయ్ భూపతి.. వరుస పరాజయాల తర్వాత తెరకెక్కించిన చిత్రం ‘మంగళవారం’. తనకు తొలి సక్సెస్ ఇచ్చిన పాయల్‌తో మరో విజయాన్ని అందుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
కలెక్షన్లతో పాటు, విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుందీ చిత్రం. నవంబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కి గురి చేసింది. వైవిధ్యమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ తాజాగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం మంగళవారం ఓటీటీ ఈనెలలో ఉందని తెలుస్తోంది.
డిస్నీ+ హాట్‌స్టార్‌లో మంగళవారం స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఇక డిసెంబర్ 22 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుందని సమాచారం. త్వరలోనే మంగళవారం స్ట్రీమింగ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం మూవీ మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
తొలి తెలుగు ఓటీటీ ఆహాలోనూ మంగళవారం స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ఆహాలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దీనిపై కూడా ఆహా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసిన మంగళవారం ఓటీటీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇక మంగళవారం సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు.. నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, శ్రవణ్ రెడ్డి ముఖ్యపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో అజయ్ దర్శకత్వ ప్రతిభ, అజ్నిశ్ లోకనాథ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేశాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




