Manchu Manoj: తనతో లవ్‌లో పడ్డాకే ఫ్యాన్స్‌ ప్రేమ విలువ తెలిసింది.. మనోజ్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నమౌనిక

పెళ్లి తర్వాత సందర్భమొచ్చినప్పుడల్లా తన భార్యపై ప్రేమను కురిపిస్తున్నాడు మనోజ్‌. మౌనిక రాకతో తన జీవితంలో పలు మార్పులు వచ్చాయంటూ పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి మౌనికపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు మనోజ్‌.

Manchu Manoj: తనతో లవ్‌లో పడ్డాకే ఫ్యాన్స్‌ ప్రేమ విలువ తెలిసింది.. మనోజ్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్నమౌనిక
Manchu Manoj, Mounika
Follow us

|

Updated on: Dec 08, 2023 | 9:27 PM

టాలీవుడ్‌ రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌, భూమా మౌనికా రెడ్డి ఈ ఏడాది మార్చిలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మంచు లక్ష్మీ దగ్గరుండి తమ సోదరుడి వివాహాన్ని జరిపించింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక మౌనికతో జీవితం పంచుకున్న మనోజ్‌ ఆమె కుమారుడు ధైరవ్ బాధ్యత కూడా తనదేనంటూ చెప్పి తన గొప్ప మనసును చాటుకన్నాడు. పెళ్లి తర్వాత సందర్భమొచ్చినప్పుడల్లా తన భార్యపై ప్రేమను కురిపిస్తున్నాడు మనోజ్‌. మౌనిక రాకతో తన జీవితంలో పలు మార్పులు వచ్చాయంటూ పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి మౌనికపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు మనోజ్‌. ప్రస్తుతం వాట్‌ ది ఫిష్ అనే సినిమా చేస్తున్న ఉస్తాద్‌ పేరుతో ఓటీటీలో ఒక షో చేస్తున్నాడు. తాజాగా ఉస్తాద్‌ షో ప్రమోషన్‌కు తన సతీమణితో కలిసి హాజరయ్యాడు మనోజ్‌. ఈ సందర్భంగా మాట్లాడిన రాకింగ్‌ స్టార్‌ తన పర్సనల్ లైఫ్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. మౌనిక కారణంగా తన లైఫ్‌ ఎలా టర్న్‌ తీసుకుందో చెప్పుకొచ్చాడు. మనోజ్‌ మాటలకు మౌనిక కంట్లో కూడా నీళ్లు తిరిగాయి.

నా పర్సనల్‌ లైఫ్‌లో ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల కారణంగా ఏడేళ్ల పాటు మీకు (అభిమానులు) దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే మౌనిక తో ప్రేమలో పడి, ఆమెతో ఏడు అడుగులు వేసిన తర్వాత ఫ్యాన్స్ ప్రేమ, వారి అభిమానం విలువ తెలిసింది. ఏడేళ్ల గ్యాప్ తర్వాత.. ఏడడుగులు వేసి మళ్లీ సినిమాల్లోకి వేశాను. ఈ గ్యాప్‌లో చాలా డిఫరెంట్‌ లైఫ్‌ను చూశా. అంతుకుముందు సినిమాలు చేసేటప్పుడు ఒక ఫ్యాషన్ ఉండేది. అయితే ఏడేళ్ల తర్వాత మీ ప్రేమ, బాధ్యతతోనే వచ్చా. నాకు ధైర్యమిచ్చింది ఫ్యాన్స్ ప్రేమనే’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు మనోజ్‌. ఈ మాటను విన్న మౌనిక కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. లవ్లీ కపుల్‌ అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భార్య మౌనికతో మంచు మనోజ్..

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మౌనికా రెడ్డి ఫొటోస్..

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్మిత సబర్వాల్‌ తీరుపై మండిపడుతోన్న నెటిజన్లు.. ఆమె ఏమన్నరాంటే..
స్మిత సబర్వాల్‌ తీరుపై మండిపడుతోన్న నెటిజన్లు.. ఆమె ఏమన్నరాంటే..
Mohammed Shami: భారత జట్టులో ఆ ఇద్దరే నా క్లోజ్ ఫ్రెండ్స్..
Mohammed Shami: భారత జట్టులో ఆ ఇద్దరే నా క్లోజ్ ఫ్రెండ్స్..
Paris Olympics: పారిస్‌లో గోల్డ్ మెడల్ అందించే భారత ఆటగాళ్లు వీరే
Paris Olympics: పారిస్‌లో గోల్డ్ మెడల్ అందించే భారత ఆటగాళ్లు వీరే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం.. బరిలో నుంచి తప్పుకున్న
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం.. బరిలో నుంచి తప్పుకున్న
కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు.. ఎక్స్‌రే తీసి చూడగా
కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు.. ఎక్స్‌రే తీసి చూడగా
గూగుల్ పిక్సెల్ 9 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్చ్..!
గూగుల్ పిక్సెల్ 9 రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్చ్..!
ఏంది మచ్చా ఇది.. 1504 వికెట్లు తీసిన దిగ్గజాలకే దడ పుట్టించావ్
ఏంది మచ్చా ఇది.. 1504 వికెట్లు తీసిన దిగ్గజాలకే దడ పుట్టించావ్
మరికాసేపట్లో పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే.. రిలీజ్ చేసేది ఎవరంటే..?
మరికాసేపట్లో పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే.. రిలీజ్ చేసేది ఎవరంటే..?
Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త..
Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ రాశివారు జాగ్రత్త..
బాత్ రూంలో అనుమానాస్పద మృతి.. రంగంలోకి క్లూస్ టీం..
బాత్ రూంలో అనుమానాస్పద మృతి.. రంగంలోకి క్లూస్ టీం..