- Telugu News Photo Gallery Cinema photos A new promotion formula that is becoming trend in the industry is sneak peek
Sneak Peak: ఇండస్ట్రీలో ట్రెండీగా మారుతున్న స్నీక్ పీక్.. ఇది నయా ప్రమోషన్ ఫార్ములా అంటున్న మేకర్స్..
మారుతున్న కాలంతో పాటు ప్రమోషన్‌లో పద్దతులు కూడా మార్చాల్సిందే. అలా కాదు మేమింకా పాత కాలంలోనే ఉంటాం అంటే సరిపోదు. ఇప్పుడు మన దర్శక నిర్మాతలు కూడా ఇదే చేస్తున్నారు. ఒకప్పుడు టీజర్, ట్రైలర్ విడుదల చేసేవాళ్లు.. ఇప్పుడు ఏకంగా స్నీక్ పీక్ అంటూ సీన్స్ రిలీజ్ చేస్తున్నారు. మరి ఆ కథేంటో చూద్దామా..? తమ కంటెంట్ చూపించడం కోసం టీజర్, ట్రైలర్ విడుదల చేయడం అనేది కామన్.
Updated on: Dec 09, 2023 | 3:41 PM

మారుతున్న కాలంతో పాటు ప్రమోషన్‌లో పద్దతులు కూడా మార్చాల్సిందే. అలా కాదు మేమింకా పాత కాలంలోనే ఉంటాం అంటే సరిపోదు. ఇప్పుడు మన దర్శక నిర్మాతలు కూడా ఇదే చేస్తున్నారు. ఒకప్పుడు టీజర్, ట్రైలర్ విడుదల చేసేవాళ్లు.. ఇప్పుడు ఏకంగా స్నీక్ పీక్ అంటూ సీన్స్ రిలీజ్ చేస్తున్నారు. మరి ఆ కథేంటో చూద్దామా..?

తమ కంటెంట్ చూపించడం కోసం టీజర్, ట్రైలర్ విడుదల చేయడం అనేది కామన్. కానీ స్నీక్ పీక్ పేరుతో సినిమాలోని మూడు నాలుగు నిమిషాల ఫుల్ సీన్ రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు ట్రెండ్. నిజానికి హాలీవుడ్‌లో ఇది ఎప్పట్నుంచో ఉంది.. బాలీవుడ్, కోలీవుడ్ కూడా ఇది ఫాలో అవుతుంది. ఇప్పుడు తెలుగులోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది.'

మన దగ్గర విడుదలకు ముందే మూడు నాలుగు నిమిషాల సీన్ రిలీజ్ చేయడం అనేది అరుదుగా జరుగుతుంది. కానీ హిట్ సినిమా కోసం శైలేష్ కొలను ఇది చేసారు. అది వర్కవుట్ అయింది. అడవి శేష్ హిట్ 2కి ఇదే సీన్ రిపీట్ చేసారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న వెంకటేష్ సైంధవ్‌కు ఇదే ఫార్ములా అప్లై చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ మధ్యే విడుదలైన కోట బొమ్మాళీకి కూడా 2 నిమిషాలకు పైగానే ఉండే సీన్ ఒకటి అలాగే విడుదల చేసారు మేకర్స్. నవంబర్ చివరి వారంలో ఎలక్షన్ బేస్డ్ గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.

తాజాగా కార్తిక్ రాజు హీరోగా నటిస్తున్న అథర్వ సినిమా స్నీక్ పీక్ విడుదలైంది. 3 నిమిషాలు ఉండే ఈ సీన్‌లో మర్డర్ మిస్టరీ చూపించారు మేకర్స్. మొత్తానికి మన దర్శక నిర్మాతలకు ఈ స్నీక్ పీక్ ప్రమోషన్ బాగానే అలవాటైపోయింది.





























