- Telugu News Photo Gallery Cinema photos Fans expecting director bobby balakrishna NBK109 going to be a hit
Balakrishna: వరుస విజయాలతో జోరుమీదున్న బాలయ్య.. నాలుగో హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్
బాలయ్య, బాబీ సినిమా ఇలా మొదలైందో లేదో అప్పుడే సంచలనాలు సృష్టిస్తుంది. ఈ చిత్ర బ్యాక్ డ్రాప్ తెలిసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. మా హీరోకు వరసగా నాలుగో హిట్ పక్కా అంటూ సంబరాల్లో మునిగిపోతున్నారు. ఇంతకీ ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్న ఆ నేపథ్యమేంటి..? ఇందులో హీరోయిన్ ఎవరు..? అసలు సినిమా ఎలా ఉండబోతుంది..? బాలయ్య ఫామ్ చూస్తుంటే ఎవరికైనా భయం పుడుతుంది. 60 దాటిన తర్వాత ఈయన అస్సలు ఆగట్లేదు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Dec 09, 2023 | 2:30 PM

బాలయ్య, బాబీ సినిమా ఇలా మొదలైందో లేదో అప్పుడే సంచలనాలు సృష్టిస్తుంది. ఈ చిత్ర బ్యాక్ డ్రాప్ తెలిసి పండగ చేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. మా హీరోకు వరసగా నాలుగో హిట్ పక్కా అంటూ సంబరాల్లో మునిగిపోతున్నారు. ఇంతకీ ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్న ఆ నేపథ్యమేంటి..? ఇందులో హీరోయిన్ ఎవరు..? అసలు సినిమా ఎలా ఉండబోతుంది..?

బాలయ్య ఫామ్ చూస్తుంటే ఎవరికైనా భయం పుడుతుంది. 60 దాటిన తర్వాత ఈయన అస్సలు ఆగట్లేదు. ఎంచుకుంటున్న కథలు.. పని చేస్తున్న దర్శకులు.. ఆయనిస్తున్న విజయాలు అన్నీ మారిపోయాయి. ఒక్కముక్కలో బాలయ్య 2.0 వర్షన్ నడుస్తుందిపుడు. ఈ స్పీడ్‌లోనే నెక్ట్స్ బాబీతో సినిమా చేయబోతున్నారు బాలయ్య. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ చేస్తున్న సినిమా ఇది.

చిరంజీవిని 20 ఏళ్లుగా ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాగే చూపించి థియేటర్లలో పూనకాలు పుట్టించారు బాబీ. నిజం చెప్పాలంటే వాల్తేరు వీరయ్యలో కొత్త కథేం ఉండదు.. కానీ టేకింగ్ ఈ సినిమాకు బలం. ఇప్పుడిక బాలయ్య ఫ్యాన్స్ వంతు. పైగా NBK ఫుల్ మాస్ బ్యాటింగ్ చేస్తున్నారు. దాంతో బాబీ పని మరింత సులువు కానుంది.

మాఫియా నేపథ్యంలో NBK109 రాబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.. ఇందులో యాక్షన్ సీక్వెన్సులు హైలైట్‌గా నిలవబోతున్నాయి. మాఫియా నేపథ్యంలో అశోక చక్రవర్తి, యువరత్న రానా, ప్రాణానికి ప్రాణం, సుల్తాన్ లాంటి సినిమాలు చేసారు బాలయ్య. ఫలితాలతో సంబంధం లేకుండా.. అన్ని సినిమాల్లోనూ బాలయ్య పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంది.

ప్రపంచానికి ఆయన తెలుసు.. కానీ ఆయన ప్రపంచమేంటో ఎవరికీ తెలియదంటూ ఫస్ట్ లుక్‌తోనే హైప్ పెంచేసారు బాబీ. 1980ల నేపథ్యంలో సాగే మాఫియా స్టోరీ ఇదని తెలుస్తుంది. ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నారు బాలయ్య. మరోసారి ఏజ్డ్‌గానే కనిపించబోతున్నారు. కాజల్, త్రిషలలో ఎవరో ఒకరు బాలయ్యతో నటించే అవకాశాలున్నాయి. మార్చ్ 2024లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.





























