బేసిక్‌గా హిందీ సినిమాలు ఎంత బాగున్నా.. మన దగ్గర 30 కోట్లు రావడమే గగనం అనుకుంటే.. పఠాన్, జవాన్ ఏకంగా 50 కోట్ల క్లబ్‌లో చేరాయి. తాజాగా రణ్‌బీర్ కపూర్ యానిమల్ సైతం 50 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమైపోయింది. 4 రోజుల్లోనే 40 కోట్ల గ్రాస్ వసూలు చేసిన యానిమల్.. ఇదే వారంలో మ్యాజికల్ ఫిగర్ టచ్ చేయబోతుంది. సందీప్ రెడ్డి వంగా ఇమేజ్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయింది.