AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: ఒక్కో సినిమాకు నాగచైతన్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. చైతూ బైక్స్, కార్స్ కలెక్షన్ చూశారా ?..

దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు చిత్రసీమలో నాగార్జున తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే కస్టడీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం చందూ మోండేటీ దర్శకత్వంలో తండెల్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మరోసారి సాయి పల్లవి చైతూ సరసన నటిస్తుంది. అంతేకాకుండా.. ఇటీవల ధూత వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుపెట్టాడు చైతూ. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

Naga Chaitanya: ఒక్కో సినిమాకు నాగచైతన్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. చైతూ బైక్స్, కార్స్ కలెక్షన్ చూశారా ?..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: Dec 08, 2023 | 8:19 PM

Share

అక్కినేని నాగార్జున నట వారసుడిగా జోష్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నాగ చైతన్య. ఆ తర్వాత ఏమాయ చేసావే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. నటుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్న చైతూ.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు చిత్రసీమలో నాగార్జున తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే కస్టడీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం చందూ మోండేటీ దర్శకత్వంలో తండెల్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మరోసారి సాయి పల్లవి చైతూ సరసన నటిస్తుంది. అంతేకాకుండా.. ఇటీవల ధూత వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుపెట్టాడు చైతూ. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

నాగార్జున నటవారసుడిగా అడుగుపెట్టిన చైతూ తనకంటూ గుర్తింపు.. ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు చైతూ దాదాపు రూ.154 కోట్ల నికర విలువతో దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఒకరిగా ఉన్నారు.. అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఒక్కో సినిమాకు చైతూ.. రూ.10 నుండి 12 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అంతేకాకుండా బ్రాండ్ ఎండార్సర్‌గా భారీగానే వసూలు చేస్తారు. నివేదికల ప్రకారం.. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు 2 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

నాగ చైతన్య నటనతో పాటు తన సొంత క్లౌడ్ కిచెన్ బ్రాండ్ షోయును (Shoyu) ప్రారంభించడం ద్వారా ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. అభివృద్ధి చెందుతున్న ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ప్రవేశించి.. హైదరాబాద్ ఆహార ప్రియులకు పాన్- ఆసియన్ వంటకాలను అందిస్తూ వ్యాపార రంగంలో సక్సెస్ అయ్యాడు. ఇవే కాకుండా.. హైదరాబాద్‌లోని సంపన్న జూబ్లీహిల్స్ పరిసరాల్లో తన తండ్రి ఇంటికి సమీపంలో ఒక విలాసవంతమైన బంగ్లాను కూడా కొనుగోలు చేశాడు.

View this post on Instagram

A post shared by Shoyu (@shoyu.hyd)

అలాగే చైతూకు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు అతని వద్ద దాదాపు రూ. 1.75 కోట్ల విలువైన ఫెరారీ ఎఫ్ 430, రూ. 3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఉన్నాయి. అలాగే రూ. 19 లక్షల విలువైన BMW R9T, సుమారు రూ. 13 లక్షల ఖరీదు చేసే ట్రయంఫ్ థ్రక్స్‌టన్ R వంటి సూపర్‌బైక్‌లను కలిగి ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
రెండో విడతలో వారికే ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి కీలక ఆదేశాలు
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
2027 వరల్డ్ కప్ రేస్ నుంచి హార్దిక్‌తోపాటు తెలుగోడు ఔట్?
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!
మేష రాశిలో కుజుడు.. ఆ రాశుల వారు వైవాహిక జీవితంలో జాగ్రత్త..!