Vadhuvu OTT: మళ్లీ భయపెట్టేందుకు వచ్చిన అవిక.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోన్న ‘వధువు’.. ఎక్కడ చూడొచ్చంటే?

1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమా, మ్యాన్షన్‌ 24 వెబ్‌ సిరీసుల్లో అవికా అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ప్రేక్షకులను భయపెట్టేందుకు వధువుగా వచ్చింది. అవికా గోర్‌ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు వెబ్‌ సిరీస్‌ వధువు. 'మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్' అనేది సిరీస్‌ క్యాప్షన్‌. పోస్టర్స్‌, టీజర్స్‌, ట్రైలర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ వెబ్‌ సిరీస్ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Vadhuvu OTT: మళ్లీ భయపెట్టేందుకు వచ్చిన అవిక.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోన్న 'వధువు'.. ఎక్కడ చూడొచ్చంటే?
Vadhuvu Web Series
Follow us
Basha Shek

|

Updated on: Dec 08, 2023 | 4:34 PM

గతంలో ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలు, ఫ్యామిలీ స్టోరీస్‌ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్‌. గ్లామరస్‌ రోల్స్‌తోనూ మెప్పించింది. అయితే ఈ మధ్యన హార్రర్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలు, సిరీస్‌లతో భయపెడుతోందీ అందాల తార. 1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమా, మ్యాన్షన్‌ 24 వెబ్‌ సిరీసుల్లో అవికా అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ప్రేక్షకులను భయపెట్టేందుకు వధువుగా వచ్చింది. అవికా గోర్‌ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు వెబ్‌ సిరీస్‌ వధువు. ‘మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్’ అనేది సిరీస్‌ క్యాప్షన్‌. పోస్టర్స్‌, టీజర్స్‌, ట్రైలర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ వెబ్‌ సిరీస్ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో శుక్రవారం (డిసెంబర్‌ 8) నుంచి వధువు వెబ్‌ సిరీస్‌ అందుబాటులోకి వచ్చేసింది. పోలేరు కృష్ణ తెరకెక్కించిన వధువు వెబ్‌ సిరీస్‌లో భారీ తారగణమే ఉంది. అలీ రెజా, నందు, వీఎస్ రూపా లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి, అమ్మ రమేష్, కాంచన్ బమ్నే, కేఎల్ కే మణి, శ్రీదేవి అర్రోజు, సౌజాస్, ఇందు అబ్బే, సురభి పద్మజ, తులసీ శ్రీనివాస్, సురభి దీప్తి, శుభశ్రీ రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఎస్‍వీఎఫ్ పతాకంపైశ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోనీ వధువు వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు. మద్దూరి శ్రీరామ్ సంగీతం అందించారు. ఇక వధువు వెబ్‌ సిరీస్‌ కథ విషయానికి వస్తే.. ఇందూ (అవికా గోర్‌) ఆనంద్‌ (నందూ)ను పెళ్లి చేసుకుని అత్తారింట్లోకి అడుగు పెడుతుంది. అయితే అక్కడ మొదటి రోజు నుంచే విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇందూపై హత్యా ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ప్రతి ఒక్కరూ అనుమానాస్పదంగా కనిపిస్తారు. మరి ఇందూను ఎవరు, ఎందుకు హత్య చేయాలనుకున్నారు? దీని వెనక ఉన్న రహస్యాలను ఇందూ ఎలా తెలుసుకుంది అన్నది తెలియాలంటే వధువు వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్..

ప్రధాన పాత్రలో చిన్నారి పెళ్లి కూతురు..

వధువు ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..