Yatra 2 Movie: వైఎస్‌ భారతి ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. భలే సూట్‌ అయ్యిందిగా.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

భారీ మెజారిటీతో జగన్ ముఖ్యమంత్రి పీఠం చేపట్టడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం తదితర అంశాలను యాత్ర 2 లో చూపించనున్నారు డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌. ఇప్పటికే యాత్ర 2 నుంచి రిలీజైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. శనివారం (డిసెంబర్‌ 9) వైఎస్‌ భారతి పుట్టిన రోజు సందర్భంగా యాత్ర 2 సినిమాలో ఆమె క్యారెక్టర్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

Yatra 2 Movie: వైఎస్‌ భారతి ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. భలే సూట్‌ అయ్యిందిగా.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
Yatra 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2023 | 6:13 PM

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ తెరకెక్కించిన పొలిటికల్‌ డ్రామా యాత్ర. 2019లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర 2 వస్తోంది. ఇందులో వైఎస్‌ రాజశేఖర రెడ్డితో పాటు సీఎం జగన్‌ పాత్రలు కూడా ఉండనున్నాయి. వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించగా, కోలీవుడ్ హీరో జీవా సీఎం జగన్‌ పాత్రను పోషించనున్నారు. రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, వైఎస్సార్ స్నేహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. వైఎస్సార్‌ మరణం తర్వాతి పరిణామాలు అంటే వైఎస్‌ జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం, పాదయాత్ర, భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠం చేపట్టడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం తదితర అంశాలను యాత్ర 2 లో చూపించనున్నారు డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌. ఇప్పటికే యాత్ర 2 నుంచి రిలీజైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. శనివారం (డిసెంబర్‌ 9) వైఎస్‌ భారతి పుట్టిన రోజు సందర్భంగా యాత్ర 2 సినిమాలో ఆమె క్యారెక్టర్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు’ అంటూ భారతి చెప్పే డైలాగ్‌ను ఈ పోస్టర్‌పై రాసుకొచ్చారు. అలాగే ‘ఒక నాయకుడు ఎదుగుదల వెనుక ఒక స్థిరమైన శక్తి’ అంటూ ఈ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు మేకర్స్‌. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అరే.. ఎవరామే? అచ్చం వైఎస్‌ భారతిలా ఉంది? బాగా సూటయ్యింది’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకీ వైఎస్‌ భారతి పాత్రలో కనిపించిందెవరో తెలుసా? ప్రముఖ మలయాళ చెందిన కేతకి నారాయణ్‌. హిందీ, మరాఠీ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. 83, అవియాల్, విచిత్రం, సమైరా.. ఆమెకు మంచి గుర్తింపు ఇచ్చాయి. గతంలో ‘FCUK.. చిట్టి ఉమా కార్తీక్‌’ అనే ఓ తెలుగు సినిమాలోనూ నటించింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో కేతకికి గుర్తింపు రాలేదు. ఇప్పుడు యాత్ర 2లో వైఎస్‌ భారతి రోల్‌తో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనుంది. యాత్ర లాగే యాత్ర 2ను కూడా ఫిబ్రవరి 8 నే రిలీజ్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మది కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు.త్వరలోనే ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్‌ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..