Guntur Karam: ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. మహేష్‏తో శ్రీలీల పోస్టర్ చూశారా ?..

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అంతేకాదు.. ఇందులో మహేష్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. దీంతో గుంటూరు కారం చిత్రాన్ని చూసేందుకు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది ఈ మూవీ. కానీ ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది

Guntur Karam: 'గుంటూరు కారం' సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. మహేష్‏తో శ్రీలీల పోస్టర్ చూశారా ?..
Guntur Karam
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 09, 2023 | 6:03 PM

సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. అల వైకుంఠపురంలో హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అంతేకాదు.. ఇందులో మహేష్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. దీంతో గుంటూరు కారం చిత్రాన్ని చూసేందుకు అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది ఈ మూవీ. కానీ ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ సింగిల్ కు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దమ్ మసాలా అంటూ సాగే పాట ఆకట్టుకుంది.

దీంతో ఈ మూవీలో సెకండ్ సింగిల్ పై ఆసక్తి నెలకొంది. కొద్ది రోజులుగా ఈ మూవీ సెకండ్ సింగిల్ కోసం అడియన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే రిలీజ్ చేయబోతున్నామంటూ థమన్, నిర్మాత నాగవంశీ, హీరోయిన్ శ్రీలీల హింట్స్ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్ వస్తుందా అని ఎదురుచూసారు. ఎట్టకేలకు ఈ మూవీ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఇందులో మహేష్ బాబుకు బుగ్గమీద శ్రీలీల ముద్దు పెడుతున్న పోస్టర్ రిలీజ్ చేసి.. ‘ఓ మై బేబీ’ అనే సాంగ్ ప్రోమో డిసంబర్ 11న సాయంత్రం 4 గంటలకు రాబోతుందని తెలిపారు. అలాగే ఫుల్ సాంగ్ డిసెంబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు శ్రీలీల కేవలం సెకండ్ హీరోయిన్ అని.. మహేష్ బాబుకు మరదలి పాత్రలో కనిపించనుందని ప్రచారం జరిగింది. కానీ ఇందులో ఆమె పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది తెలియరాలేదు.కానీ ఇప్పుడు పోస్టర్ చూస్తుంటే..మహేష్ , శ్రీలీల కాంబోలో సాంగ్ ఉండనుందని తెలుస్తోంది. ఇది రొమాంటిక్ సాంగ్ లా ఉండబోతుందని అర్థమవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.