Netflix – Mahesh Babu: లోగొట్టు ఎవరికి ఎరక.? మహేష్‌ను కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో..
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ హైదరాబాద్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో సమావేశమవుతున్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కుటుంబాన్ని కలిసి కాసేపు ముచ్చటించారు. చిరంజీవి ఇంట్లో లంచ్ చేసి.. చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిర్మాత శోభు యార్లగడ్డతో మాట్లాడారు. నందమూరి ఫ్యామిలిని కూడా కలిశారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ హైదరాబాద్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో సమావేశమవుతున్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కుటుంబాన్ని కలిసి కాసేపు ముచ్చటించారు. చిరంజీవి ఇంట్లో లంచ్ చేసి.. చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిర్మాత శోభు యార్లగడ్డతో మాట్లాడారు. నందమూరి ఫ్యామిలిని కూడా కలిశారు. నెట్‍ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం కాసేపు తారక్, కళ్యాణ్ రామ్, డైరెక్టర్ కొరటాల శివతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తారక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు టెడ్ సరండోస్ సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశాడు. తాజాగా గుంటురు కారం సెట్లో ఉన్న మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇద్దరిని కలిశారు నెట్‍ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్. వారితో కలిసి దిగిన ఫోటోను మహేష్ తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. నెట్‍ఫ్లిక్స్ సీఈవో టెడ్ సంరడోస్.. అతని టీం మోనికా షెర్గిల్, అభిషేక్ గోరాడియాలతో ఫ్యూచర్ ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన కొన్ని విషయాలు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా..నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ టెడ్ సరండోస్ ఆకస్మాత్తుగా మాట్లాడటం చూస్తుంటే టాలీవుడ్ సినీ స్టార్లతో నెట్‍ఫ్లిక్స్ ఏదైనా మూవీ లేదా సిరీస్ ప్లాన్ చేస్తుందా ?.. అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

