WPL Auction 2024: ఐపీఎల్‌ వేలంలో తెలంగాణ అమ్మాయికి జాక్‌ పాట్.. గుజరాత్‌ టీమ్‌లోకి త్రిష.. ఎన్ని లక్షలంటే?

మహిళల ప్రీమియర్ లీగ్ సెకెండ్ సీజన్‌ కోసం ముంబై వేదికగా శనివారం (డిసెంబర్‌ 9) మినీ వేలం జరుగుతోంది. అయితే ఈ ప్రీమియర్‌ బిడ్డింగ్‌లో కొంతమంది స్టార్ ప్లేయర్లు, సీనియర్‌ ఆటగాళ్లను తీసుకోవడానికి ఫ్రాంఛైజీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో యంగ్ ప్లేయర్ల కోసం లక్షలు, అవసరమైతే కోట్లు కూడా వెచ్చిస్తున్నాయి. తాజాగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో తెలంగాణ అమ్మాయికి జాక్‌ పాట్‌ తగిలింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన త్రిష పూజితను

WPL Auction 2024: ఐపీఎల్‌ వేలంలో తెలంగాణ అమ్మాయికి జాక్‌ పాట్.. గుజరాత్‌ టీమ్‌లోకి త్రిష.. ఎన్ని లక్షలంటే?
Trisha Poojita
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2023 | 7:44 PM

మహిళల ప్రీమియర్ లీగ్ సెకెండ్ సీజన్‌ కోసం ముంబై వేదికగా శనివారం (డిసెంబర్‌ 9) మినీ వేలం జరుగుతోంది. అయితే ఈ ప్రీమియర్‌ బిడ్డింగ్‌లో కొంతమంది స్టార్ ప్లేయర్లు, సీనియర్‌ ఆటగాళ్లను తీసుకోవడానికి ఫ్రాంఛైజీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో యంగ్ ప్లేయర్ల కోసం లక్షలు, అవసరమైతే కోట్లు కూడా వెచ్చిస్తున్నాయి. తాజాగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో తెలంగాణ అమ్మాయికి జాక్‌ పాట్‌ తగిలింది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన త్రిష పూజితను రూ. 10 లక్షలతో గుజరాత్ జెయింట్స్‌ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న ఆమె హైదరాబాద్‌లోనే శిక్షణ పొందింది. అండర్-16, 19, 23 విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది. హైదరాబాద్‌ టీమ్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడింది. ఇప్పుడు ఏకంగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ఆడే అవకాశం దక్కించుకుంది. ఈక్రమంలో డబ్ల్యూపీఎల్‌ త్రిష గొప్పగా ఆడి జాతీయ జట్టుకు ఎంపిక కావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

కాగా ఇదే వేలంలో మరో యువ ప్లేయర్‌ బృందా దినేష్‌ను 1.30 కోట్లకు కొనుగోలు చేసింది యూపీ వారియర్స్. రూ. 10 లక్షల బేస్‌ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఆమె కోసం మొదట ఆర్సీబీ రూ. 15 లక్షల బిడ్డింగ్‌ వేసింది. అయితే ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ ఆర్సీబీ లెక్కలను తలకిందులు చేశాయి. ముఖ్యంగా కర్ణాటక యువ క్రీడాకారిణిని కొనుగోలు చేసేందుకు యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ బాగా పోటీ పడ్డాయి. దీంతో బృందా దినేష్ నికర విలువ ఒక్కసారిగా కోటి రూపాయలకు చేరుకుంది. చివరకు యూపీ వారియర్స్ ఈ యంగ్‌ క్రికెటర్‌ను1.30 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇవి కూడా చదవండి

గుజరాత్ టీమ్ లో ఛాన్స్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అప్పటికీ.. ఇప్పటికీ పూర్తిగా మారిపోయిన ఈశాన్య భారతం
అప్పటికీ.. ఇప్పటికీ పూర్తిగా మారిపోయిన ఈశాన్య భారతం
మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్..
మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్..
క్యాన్సర్ రోగులకు కాస్త ఊరట.. కేంద్రం చొరవతో తగ్గిన మందుల రేట్లు
క్యాన్సర్ రోగులకు కాస్త ఊరట.. కేంద్రం చొరవతో తగ్గిన మందుల రేట్లు
ఇలా చేశావేంటి సిరాజ్ మియా.. కఠిన శిక్షకు సిద్ధమైన ఐసీసీ
ఇలా చేశావేంటి సిరాజ్ మియా.. కఠిన శిక్షకు సిద్ధమైన ఐసీసీ
ఎట్టకేలకు పెరిగిన ఇండియా ఫారెక్స్ నిల్వలు..!
ఎట్టకేలకు పెరిగిన ఇండియా ఫారెక్స్ నిల్వలు..!
దేశంలోని మెడికల్ కాలేజీల కోసం భారీగా పోస్టులు
దేశంలోని మెడికల్ కాలేజీల కోసం భారీగా పోస్టులు
మూడు నిమిషాల పాటకు రూ. 2కోట్లు అందుకుంటుంది..
మూడు నిమిషాల పాటకు రూ. 2కోట్లు అందుకుంటుంది..
గోరువెచ్చని నీటిలో ఇవి కలిపి తాగితే.. పొట్ట ఫ్లాట్‌గా మారిపోతుంది
గోరువెచ్చని నీటిలో ఇవి కలిపి తాగితే.. పొట్ట ఫ్లాట్‌గా మారిపోతుంది
బుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్లు.. ఏడాదిలో లక్ష దాటనున్న సెన్సెక్స్
బుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్లు.. ఏడాదిలో లక్ష దాటనున్న సెన్సెక్స్
మమతా బెనర్జీ నుంచి ఒమర్ అబ్దుల్లా వరకు రాష్ట్ర సిఎంలకు ఆహ్వానం..
మమతా బెనర్జీ నుంచి ఒమర్ అబ్దుల్లా వరకు రాష్ట్ర సిఎంలకు ఆహ్వానం..