Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS ENG: రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి.. ఇంగ్లండ్ ఘన విజయం.. సిరీస్‌ కూడా పాయే

భారత మహిళలు మళ్లీ నిరాశ పర్చారు. శనివారం (డిసెంబర్‌ 9) ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సమష్ఠిగా విఫలమయ్యారు. 4 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఇంగ్లండ్‌కు సిరీస్‌ అప్పగించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ మహిళల జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

IND VS ENG: రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి.. ఇంగ్లండ్ ఘన విజయం.. సిరీస్‌ కూడా పాయే
IND W vs ENG W
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2023 | 10:17 PM

భారత మహిళలు మళ్లీ నిరాశ పర్చారు. శనివారం (డిసెంబర్‌ 9) ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సమష్ఠిగా విఫలమయ్యారు. 4 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఇంగ్లండ్‌కు సిరీస్‌ అప్పగించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ మహిళల జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియాకు ఆశించిన శుభారంభం లభించలేదు. ఓపెనర్ షఫాలీ వర్మ (0) తొలి ఓవర్ 2వ బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. స్మృతి మంధాన 10 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 9 పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. ఆ తర్వాత దీప్తి శర్మ, రిచా ఘోష్ (4), పూజా వస్త్రాకర్ (6)ల సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు, అయితే మరోవైపు జెమీమా రోడ్రిగ్స్ క్రీజులో నిలదొక్కుకుంది. 33 బంతుల్లో 30 పరుగులు చేసి సారా గ్లెన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటైపోయింది. ఆతర్వాత రాంకా పాటిల్ 4 పరుగులు చేయగా, టిటాస్ సాధు 2 పరుగులు చేశారు. చివరకు సైకా ఇషాక్ 8 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ కావడంతో టీమిండియా 16.2 ఓవర్లలో కేవలం 80 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లాండ్ బౌలర్లలో షార్లెట్ డీన్, లారెన్ బెల్, ఎకిల్‌స్టోన్, సారా గ్లెన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. నాట్‌సీవర్, ఫ్రెయా కెంప్ తలా ఒక వికెట్ తీశారు.

81 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ జట్టుకు కూడా శుభారంభం లభించలేదు. మూడో ఓవర్‌లో సోఫియా డంక్లీ (6), డేనియల్ వ్యాట్ (0)లను బౌల్డ్ చేసి రేణుకా సింగ్ టీమిండియాకు మంచి ఆరంభం ఇచ్చింది. అయితే ఆలిస్ క్యాప్సే – నాట్ స్కివర్-బ్రంట్ ఈ దశలో ఒక మంచి భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 42 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే పూజా వస్త్రాకర్ బౌలింగ్ లో నాట్ స్కివర్ (16) అవుటైంది. ఆ తర్వాత సైకా ఇషాక్‌ను ఆలిస్ కాప్సీ (25) స్టంపౌట్ చేసింది. దీని తర్వాత దీప్తి శర్మ అమీ జోన్స్, ఫ్రెయా కెంప్ వికెట్లను తీశారు. అయితే లక్ష్యం మరీ తక్కువ కావడంతో ఇంగ్లండ్ జట్టు 11.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. 4 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ కే హైలైట్ ఈ క్యాచ్.. వీడియో

భారత్ ప్లేయింగ్ 11:

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాంకా పాటిల్, పూజా వస్త్రాకర్, టీటాస్ సాధు, రేణుకా ఠాకూర్ సింగ్, సైకా ఇషాక్.

ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:

సోఫియా డంక్లీ, డేనియల్ వాట్, ఆలిస్ క్యాప్సే, నాట్ స్కివర్-బ్రంట్, హీథర్ నైట్ (కెప్టెన్), అమీ జోన్స్ (వికెట్ కీపర్), ఫ్రెయా కెంప్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..