AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2024 Auction: 20 ఏళ్ల అమ్మాయి సంచలనం.. భారత అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌కు రికార్డు ధర.. ఏకంగా అన్ని కోట్లా?

ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అన్‌క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్న 20 ఏళ్ల కశ్వీ గౌతమ్‌ సంచలనం సృష్టించింది. వేలంలో ఆమె బేస్‌ ప్రైజ్‌ కేవలం 10 లక్షలు మాత్రమే.  అయితే 20 రెట్లు ఎక్కువ చెల్లించి మరీ కశ్వీ గౌతమ్‌ను దక్కించుకుంది గుజరాత్‌ జెయింట్స్‌. అంటే ఏకంగా..

WPL 2024 Auction: 20 ఏళ్ల అమ్మాయి సంచలనం.. భారత అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌కు రికార్డు ధర.. ఏకంగా అన్ని కోట్లా?
Kashvee Gautam
Basha Shek
|

Updated on: Dec 09, 2023 | 6:50 PM

Share

మ‌హిళ‌ల క్రికెట్ ప్రీమియ‌ర్ లీగ్ రెండో మినీ వేలం ముంబై వేదికగా జరుగుతోంది. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చూపిన ఆటగాళ్లపై ఐపీఎల్‌ ప్రాంఛైజీలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అన్‌క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్న 20 ఏళ్ల కశ్వీ గౌతమ్‌ సంచలనం సృష్టించింది. వేలంలో ఆమె బేస్‌ ప్రైజ్‌ కేవలం 10 లక్షలు మాత్రమే.  అయితే 20 రెట్లు ఎక్కువ చెల్లించి మరీ కశ్వీ గౌతమ్‌ను దక్కించుకుంది గుజరాత్‌ జెయింట్స్‌. అంటే ఏకంగా రూ. 2కోట్లన్న మాట. ఈ ధరతో ఈ వేలంలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్‌ రికార్డు సృష్టించారు. రూ.10 లక్షల బేస్‌ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఈ యంగ్‌ క్రికెటర్‌ను దక్కించుకునేందుకు మొదట ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ పోటీ పడ్డాయి. అయితే మొత్తం రూ.50 లక్షలు దాటగానే RCB వెనక్కి తగ్గింది. అయితే మరోవైపు కశ్వీ గౌతమ్‌ను కొనుగోలు చేసేందుకు గుజరాత్ జెయింట్స్ జట్టు ఎక్కువ ఆసక్తి చూపింది. ఫలితంగా గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య హోరా హోరీ పోటీ నెలకొంది. దీంతో కశ్వీ బిడ్డింగ్ మొత్తం ఒకటిన్నర కోట్లు దాటింది. ఈ దశలో కూడా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అసలు వెనక్కి తగ్గలేదు. రూ.1.90 కోట్ల వరకు ముంబై ఇండియన్స్‌ పోటీ పడింది. అయితే చివరికి గుజరాత్ జెయింట్స్ కశ్వీ గౌతమ్‌ను రూ. 2 కోట్లకు బిడ్డింగ్ చేసి సొంతం చేసుకుంది.

కాగా ప‌దునైన ఫాస్ట్ బౌలర్‌గా కష్వీ గౌత‌మ్ కు మంచి పేరుంది. సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ టీ20 ట్రోఫీలో హ్యాట్రిక్‌తో పాటు మొత్తం 5 వికెట్ల పడగొట్టిన ఈ ఛండీగడ్‌ ఫ్లేయర్‌ భారత్-ఎ జట్టులో చోటు దక్కించుకుకుంది. 2020లో అండర్‌-19 వన్డే కప్‌ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ పై ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టింది. తద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్లో మొత్తం 10 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా రికార్డుల కెక్కింది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న అండర్-23 టోర్నమెంట్‌లో ఆమె చండీగఢ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

ఇవి కూడా చదవండి

వన్డే మ్యాచ్ లో 10 వికెట్లు..

గుజరాత్ రిటైన్‌ చేసుకున్న ప్లేయర్స్‌:

ఆష్లీగ్ గార్డనర్, బెత్ మూనీ, దయాలన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, స్నేహా రాణా, తనూజా కన్వర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..