Bigg Boss 7 Telugu: అయ్యయ్యో.. శోభా శెట్టికి సపోర్ట్ గా అందాల యాంకరమ్మ.. బూతులు తిడుతోన్న నెటిజన్స్‌

రోజులు గడిచే కొద్ది శోభా శెట్టి మాట్లాడే తీరు పూర్తిగా నెగెటివ్‌గా మారిపోయింది. కంటెస్టెంట్స్‌తో నిత్యం గొడవలు, సీరియల్ బ్యాచ్‌ కంటెస్టెంట్స్‌తో కలిసి ఇతరులను రెచ్చగొట్టడంతో శోభాకు సైకో ట్యాగ్ ఇచ్చేశారు జనాలు. ఆమె ఎలిమినేట్ కావాలంంటూ ప్రతి వారం కోరుకున్నారంటే శోభా ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే బిగ్ బాస్‌ కన్నడ బ్యూటీని సేవ్ చేస్తూ వచ్చాడు.

Bigg Boss 7 Telugu: అయ్యయ్యో.. శోభా శెట్టికి సపోర్ట్ గా అందాల యాంకరమ్మ.. బూతులు తిడుతోన్న నెటిజన్స్‌
Shobha Shetty, Anchor Varshini
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2023 | 6:45 PM

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో అత్యంత నెగెటివిటీ సంపాదించుకున్న కంటెస్టెంట్లలో కార్తీక దీపం విలన్‌ మోనిత అలియాస్‌ శోభా శెట్టి ఒకరు. హౌజ్‌లోకి వెళ్లే ముందు చాలామందికి ఆమెపై పాజిటివ్‌ ఓపినీయన్సే ఉన్నాయి. అయితే రోజులు గడిచే కొద్ది శోభా శెట్టి మాట్లాడే తీరు పూర్తిగా నెగెటివ్‌గా మారిపోయింది. కంటెస్టెంట్స్‌తో నిత్యం గొడవలు, సీరియల్ బ్యాచ్‌ కంటెస్టెంట్స్‌తో కలిసి ఇతరులను రెచ్చగొట్టడంతో శోభాకు సైకో ట్యాగ్ ఇచ్చేశారు జనాలు. ఆమె ఎలిమినేట్ కావాలంంటూ ప్రతి వారం కోరుకున్నారంటే శోభా ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే బిగ్ బాస్‌ కన్నడ బ్యూటీని సేవ్ చేస్తూ వచ్చాడు. అందుకే ప్రతి వారం ఓట్లు తక్కువ ఉన్నా శోభ సేవ్‌ అవుతోంది. అయితే ఎట్టకేలకు ఈ కార్తీక దీపం విలన్‌ బిగ్‌ బాస్ హౌజ్‌ నుంచి బయటకు వెళ్లే సమయం ఆసన్నమైంది. 14 వారం శోభానే ఎలిమినేట్ కావొచ్చని గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్న శోభకు మద్దతుగా స్టార్‌ యాంకర్‌ వర్షిణీ ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. అంతే.. నెటిజన్లు ఆమెపై బూతులతో విరుచుకుపడుతున్నారు. ‘సపోర్టు చేయడానికి ఇంకెవరూ దొరకలేదా?’ ‘వచ్చిందండి వయ్యారి’ అంటూ నెగెటివ్‌ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

‘ శోభాని సపోర్ట్ చేయడానికే వచ్చాను.. తను చాలా స్ట్రాంగ్ గర్ల్.. బిగ్‌ బాస్‌ సీజన్-6లోనే తను బిగ్‌బాస్‌కి హౌజ్‌లోకి రావాలి అనుకుంట. అప్పుడే తన ప్రిపరేషన్ ఎలా ఉండేదంటే.. సీజన్ 6 మొదలు కాకముందే జిమ్‌కి వెళ్లి వర్కవుట్స్‌ చేసేది. టాస్కుల్లో మగాళ్ల కంటే ముందే ఉండాలి అని వర్కవుట్, వ్యాయామాలు చేసేది. ఏ టాస్కు పెట్టినా అసలు ఓడిపోకూడదని భావించేది. బిగ్ బాస్‌ కోసం తనను తాను మానసికంగా సిద్ధం చేసుకుంది. అందుకు తగ్గట్టే హౌజ్‌లో గట్టిగా ఆడుతోంది. మనం కూడా ఆమెకు సపోర్టు చేయాలి’ అని వీడియోలో చెప్పుకొచ్చింది యాంకర్‌. వర్షిణి వీడియో అలా బయటికి రాగానే నెటిజన్లు ఆమెను ఏకి పారేస్తున్నారు. ‘శోభా పెట్టే సర్దేసుకునే సమయమొచ్చింది. నువ్వెళ్లి నీ పని చూసుకో’ అంటూ నెటిజన్లు స్టార్ యాంకర్‌ను తిట్టేస్తోన్నారు.

ఇవి కూడా చదవండి

యాంకర్ వర్షిణీ రిలీజ్ చేసిన వీడియో

హౌజ్ లో శోభా శెట్టి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..