Bigg Boss Telugu 7: బిగ్ బాస్‌పై సర్వే.. టాప్- 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. టైటిల్ విన్నర్, రన్నరప్ ఎవరంటే?
మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే జరగనున్నట్లు తెలుస్తోంది. అంటే మరో వారం రోజుల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలనుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌజ్‌లో ఫినాలే టాస్కులు, గేమ్స్‌లు ప్రారంభమయ్యాయి. ఓటింగ్ కూడా షురూ అయింది. ప్రేక్షకులు, అభిమానులు తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కు మద్దతుగా ఓట్లు వేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆఖరి అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 3న ప్రారంభమైన సెలబ్రిటీ గేమ్ షో సక్సెస్ ఫుల్‌గా 14 వారాలు పూర్తి చేసుకుంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే జరగనున్నట్లు తెలుస్తోంది. అంటే మరో వారం రోజుల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలనుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌజ్‌లో ఫినాలే టాస్కులు, గేమ్స్‌లు ప్రారంభమయ్యాయి. ఓటింగ్ కూడా షురూ అయింది. ప్రేక్షకులు, అభిమానులు తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కు మద్దతుగా ఓట్లు వేస్తున్నారు. ప్రస్తుతం హౌజ్‌లో 7 గురు కంటెస్టెంట్స్ ఉండగా.. ఈ వారంలో శోభా శెట్టి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. అంటే హౌస్ లో 6 మంది కంటెస్టెంట్స్ మిగులుతారు. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, యావర్, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి హౌజ్‌లో ఉంటారు. వీరిలో ఇప్పటికే అర్జున్ అంబటి ఫినాలేలోకి వెళ్లిపోయాడు. మరి ఆరుగురు కంటెస్టెంట్స్‌లో టాప్-5 కంటెస్టెంట్స్ ఎవరు అవుతారన్నది అసక్తిగా మారింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ రియాలిటీ షోపై ఎప్పటికప్పుడూ సర్వేలు నిర్వహిస్తూ నివేదికలిస్తోంది
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్. దేశ వ్యాప్తంగా సినీ తారలతో పాటు వివిధ అంశాలసౌ సర్వేలు నిర్వహించే ఈ సంస్థ లేటెస్ట్‌గా మరొకసారి కంటెస్టెంట్స్ పై సర్వే చేసి జాబితాను విడుదల చేసింది. డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు సంబంధించి టాప్-5 కంటెస్టెంట్స్ జాబితాను విడుదల చేసింది. ఎప్పటిలాగే ఈ లిస్టులో బిగ్ బాస్ పెద్దన్న శివాజీ టాప్ లో ఉన్నాడు. ఓటింగ్‌లో అగ్రస్థానంలో దూసుకెళుతోన్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఆర్మాక్స్ సర్వేలో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. సీరియల్ బ్యాచ్ లీడర్ అమర్ దీప్ చౌదరి మూడో స్థానంలో ఉండగా, కన్నడ బ్యూటీ ప్రియాంక జైన్ నాలుగో స్థానంలో ఉంది. ఇక అర్జున్ అంబటి ఐదో ప్లేస్‌లో ఉన్నాడు. ప్రస్తుతమున్న ట్రెండ్‌ను చూస్తుంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆర్మాక్స్ సర్వే రిజల్ట్స్ ఇవే..
Ormax Characters India Loves: Top 5 most popular #BiggBossTelugu7 contestants (Dec 2-8) #OrmaxCIL pic.twitter.com/m8VHCwYYel
— Ormax Media (@OrmaxMedia) December 10, 2023
బిగ్ బాస్ హౌజ్ లో అమర్ దీప్ చౌదరి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..