Brahmamudi, December 11th episode: కళావతికి సవతి పోరు.. ఎంట్రీ ఇచ్చిన రాజ్ ప్రియురాలు.. కనకం నెక్ట్స్ ప్లాన్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యకి థాంక్స్ చెప్తాడు కళ్యాణ్. నేనేం చేశాను కవి గారు అని కావ్య అంటే.. ఆ మొక్కను నాటింది మీరే వదినా.. అని కళ్యాణ్ అంటే.. కావ్య షాక్ అయి.. మీరెప్పుడు చూశారు? అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్.. ఎవరికీ తెలీకుండా రాత్రి జరిగింది కావ్యకు చెప్తాడు. మరి నాకు ఎందుకు చెప్పలేదని కళ్యాణ్ అంటాడు. ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఇక అంతే సంగతులు అని కావ్య అంటుంది. నిజానికి ఆ మొక్క నేనే మార్చేద్దాం అనుకున్నా కానీ నాకు ధైర్యం..

Brahmamudi, December 11th episode: కళావతికి సవతి పోరు.. ఎంట్రీ ఇచ్చిన రాజ్ ప్రియురాలు.. కనకం నెక్ట్స్ ప్లాన్!
Brahmamudi
Follow us

|

Updated on: Dec 11, 2023 | 11:29 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యకి థాంక్స్ చెప్తాడు కళ్యాణ్. నేనేం చేశాను కవి గారు అని కావ్య అంటే.. ఆ మొక్కను నాటింది మీరే వదినా.. అని కళ్యాణ్ అంటే.. కావ్య షాక్ అయి.. మీరెప్పుడు చూశారు? అని అడుగుతుంది. దీంతో కళ్యాణ్.. ఎవరికీ తెలీకుండా రాత్రి జరిగింది కావ్యకు చెప్తాడు. మరి నాకు ఎందుకు చెప్పలేదని కళ్యాణ్ అంటాడు. ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఇక అంతే సంగతులు అని కావ్య అంటుంది. నిజానికి ఆ మొక్క నేనే మార్చేద్దాం అనుకున్నా కానీ నాకు ధైర్యం సరిపోలేదు. మరి మీకు తప్పు చేస్తున్నాను అని అనిపించలేదా వదినా అని కళ్యాణ్ అడిగితే.. అనిపించింది కానీ తప్పలేదు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. కానీ జాతకాల్లో దోషం ఉందని.. ఇద్దరి ప్రేమికులను విడదీయడం నచ్చలేదు. అందుకే ఈ పని చేశాను. భార్యాభర్తలు కలిసి ఉండాలంటే కావాల్సింది ప్రేమ.. నమ్మకం. అవి ఉన్నంత కాలం భార్యాభర్తలను ఏ శక్తీ విడదీయ లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. నమ్మకం పెంచుకుంటూ.. చిన్న చిన్న తగాదాలు వచ్చినా సర్దుకు పోతూ ఉంటే ఏ కాపురం అయినా నిలబడుతుందని కావ్య అంటుంది. దీంతో కావ్యకి థాంక్స్ చెప్తాడు కళ్యాణ్.

అందర్నీ పిలిచి పంచాయితీ పెడతారు అనుకున్నా.. సైలెంట్ గా ఉన్నారేంటి: కావ్య

కావ్య, కళ్యాణ్ లు మాట్లాడుకున్నదంతా రాజ్ వినేస్తాడు. కావ్య చెప్తున్నా వినిపించుకోకుండా పైకి వెళ్తాడు. ఇప్పుడు ఆయన ఎంత గొడవ చేస్తారో ఏంటో అనుకుంటుంది. ఇంట్లో వాళ్లందర్నీ పిలిచి పంచాయితీ పెడతారు అనుకున్నా అని కావ్య అంటే.. ఏ విషయంలో అని రాజ్ అడుగుతాడు. అదే కవి గారి విషయంలో నేను తప్పు చేశానని, ఎండి పోయిన మొక్కను మార్చి.. ఈ ఇంట్లో మోసం చేశానని అందరికీ చెప్పి గొడవ చేస్తారేమో అనుకున్నా. కానీ ఇలా మౌనంగా గదిలోకి వచ్చారేంటా అని ఆశ్చర్యంగా ఉందని కావ్య చెప్తుంది. అంటే నేను ప్రతి విషయంలోనూ గొడవ పెడుతున్నానా అని రాజ్ అడుగుతాడు. ఏ విషయంలో మీరు గొడవ పెట్టలేదో చెప్పండి. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మా అక్కడ కడుపు విషయం తెలిసే వరకు ఏ విషయంలోనైనా నేనే మీకు దొరుకుతాను కదా.. అందరి చేత అరిపించారు.

మొదటి సారి తప్పు చేశాను: కావ్య

కానీ మొదటిసారి నేను నిజంగా తప్పు చేశాను. కవి గారికి సపోర్ట్ చేశాను. అలాంటప్పుడు మీ అలవాటు ప్రకారం.. చేసిన తప్పుకు శిక్ష వేయాలి కదా అని కావ్య అంటే.. నిన్ను నువ్వు సమర్దించుకున్న మాత్రాన.. గతంలో నువ్వు చేసిన తప్పని ఒప్పు అయిపోవు. అలాగని ఇప్పుడు నువ్వు చేసిన పని తప్పు అయితే అలాగే అరిచేవాడిని. కానీ నా తప్పుడి ప్రేమ గెలుస్తుందని అంటాడు రాజ్. మీ తమ్ముడి దాకా వచ్చేసరికి న్యాయం అయిపోయిందా.. అని కావ్య అంటే.. కాదు మీ అక్క నాతో పెళ్లికి సిద్ధపడి రాహుల్ తో వెళ్లిపోయింది. కానీ నా తమ్ముడిది నిజమైన ప్రేమ రాజ్.. అనేసి వెళ్లి పోతాడు.

ఇవి కూడా చదవండి

తాగి రుద్రాణికి చుక్కలు చూపించిన కనకం:

మరోవైపు రుద్రాణి గదిలో.. కనకం.. తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కనకాన్ని రుద్రాణి పిలిచి జ్యూస్ తాగమని మందు ఇస్తుంది. ఏంటి అని అడుగుతుంది కనకం. ఇది కూడా ఒక పళ్ల రసం అని అంటుంది రుద్రాణి. అది తెలీక కనకం తాగేస్తుంది. గ్లాసుల మీద గ్లాసులు ఫుల్లుగా తాగేస్తుంది కనకం. ఆ తర్వాత ఇక దెయ్యంలా మారుతుంది కనకం. అది చూసిన రుద్రాణి భయ పడుతుంది. రుద్రాణి పీక పట్టుకుని చంపేస్తాను. ఏమో నీకు నా కూతుళ్లు అంటే అంత మంట.. అని చెడా మడా కనకం వాయిం చేస్తుంది. కనకం టార్చర్ తట్టుకోలేక రుద్రాణి బాత్ రూమ్ లోకి వెళ్లి పోతుంది. ఆ తర్వాత పడుకుంటుంది కనకం.

కళావతికి సవతి పోరు.. ఫోన్ చేసిన రాజ్ గర్ల్ ఫ్రెండ్:

ఈ సీన్ కట్ చేస్తే.. కృష్టుడి దగ్గరకు వచ్చి.. తను చేసిన పని గురించి చెప్తుంది కావ్య. కళ్యాణ్, అనామికల ప్రేమను నిలబెట్టేలా చేశాను అని చెప్తుంది. నా కాపురంలో చిచ్చు పెట్టకు అని అంటుంది కావ్య. ఆ తర్వాత రాజ్ కి శ్వేత అనే అమ్మాయి కాల్ చేస్తుంది. ఎందుకు ఇప్పుడు కాల్ చేశావ్ అని రాజ్ అంటాడు. నిన్ను కలవాలి అని అడుగుతుంది శ్వేత. ఇప్పుడా అని అంటాడు రాజ్. సరే రేపు మన ఫేవరేట్ ప్లేస్ లో కలుద్దాం అని శ్వేత అడిగితే.. రేపు కాల్ చేస్తాను సరే ఓకే అని చెప్పి పెట్టేస్తుంది.

రాజ్ పై ఫైర్ అయిన కావ్య:

మీరు చేసే పని నాకు నచ్చలేదు. మీరు కూడా ఇలా చేస్తారని అనుకోలేదని కావ్య అంటుంది. దీంతో రాజ్ కంగారు పడుతుంది. నేనేమన్నా మీ కంపెనీ సీక్రెట్స్ తీసుకెళ్లి పక్క కంపెనీకి తీసుకెళ్లి అమ్మేస్తాను అనుకుంటున్నారా.. నా ముందు మీరు అంత సీక్రెట్ గా ఆఫీస్ కాల్స్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నా మీద ఆ నమ్మకం కూడా లేదా అని కావ్య అడిగితే.. నీకో విషయం తెలుసా.. మనకు తెలిసిన విషయాన్ని కావాల్సిన వాళ్లకు చెప్పేసి.. ఎవరికీ చెప్పకు సీక్రెట్ అని అంటాం. ఆ తర్వాత ఎవరికి తెలుస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలా టెన్షన్ పడటం ఎందుకు? సీక్రెట్ చెప్పడం ఎందుకు? పడుకో అని రాజ్ అంటాడు.

పెళ్లి చెడగొట్టాలని మరో ప్లాన్ వేస్తున్న కనకం:

ఆ తర్వాత తెల్లారుతుంది. అనామికకు కాల్ చేసి.. ఎప్పుడు బయలు దేరారా? ఎంత సమయం పడుతుంది అని అడుగుతూ ఉంటాడు. ఈలోపు కళ్యాణ్ వెనకకు వచ్చిన కనకం.. అవన్నీ వింటుంది. ఆ తర్వాత కనకం కవర్ చేస్తుంది. ఇందులో సీక్రెట్ ఏముంది ఆంటీ.. అనామిక వాళ్లు మొదటి పెళ్లి పత్రిక మనకు ఇవ్వడానికే వస్తున్నారు అని చెప్తాడు కళ్యాణ్. కనకం నవ్వుతున్నట్టు యాక్టింగ్ చేసి.. కళ్యాణ్ వెళ్లి పోయాక తిట్టుకుంటుంది. దీంతో మరో ప్లాన్ వేస్తుంది కనకం.

తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?
గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..
గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..
బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు
బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు
ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!
ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ