Year Ender 2023: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన టాప్-10 సినిమాలు.. తెలుగు మూవీస్‌ ఏవంటే?

మరికొన్ని రోజుల్లో 2023కు శుభం కార్డు పడనుంది. 2024 సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్‌ ప్లాన్స్‌ కోసం ఇప్పటికే ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ ఏడాది త‌మ సెర్చ్ ఇంజిన్ లో బాగా శోధించిన అంశాల‌ వివ‌రాల‌ను విడుద‌ల చేసింది.

Year Ender 2023: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన టాప్-10 సినిమాలు.. తెలుగు మూవీస్‌ ఏవంటే?
Most Searched Movies, Web Series 2023
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2023 | 3:54 PM

మరికొన్ని రోజుల్లో 2023కు శుభం కార్డు పడనుంది. 2024 సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్‌ ప్లాన్స్‌ కోసం ఇప్పటికే ప్లాన్స్‌ వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ ఏడాది త‌మ సెర్చ్ ఇంజిన్ లో బాగా శోధించిన అంశాల‌ వివ‌రాల‌ను విడుద‌ల చేసింది. సినిమా, క్రీడలతో సహా పలు విభాగాలకు సంబంధించి నెటిజన్లు సెర్చ్‌ చేసిన అంశాలను విడుదల చేసింది. అలా 2023లో భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ జాబితాలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘ జవాన్‌ మూవీ’ నంబర్‌ 1 స్థానంలో నిలిచింది. 2023లో మరో సూపర్ హిట్ చిత్రం ‘గదర్ 2’ రెండో స్థానంలో నిలిచింది. విపరీతమైన చర్చను సృష్టించిన క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘ఓపెన్‌హైమర్’ చిత్రానికి 3వ స్థానం లభించింది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం 4వ స్థానంలో నిలిచింది. 5వ స్థానంలో ‘పఠాన్’, 6వ స్థానంలో ‘ది కేరళ స్టోరీ’, 7వ స్థానంలో రజనీకాంత్ ‘జైలర్’ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో అత్యధికమంది సెర్చ్ చేసిన సినిమాలివే..

  • జవాన్‌
  • గదర్‌2
  • ఒప్పొన్‌హైమర్‌
  • ఆదిపురుష్‌
  • పఠాన్‌
  • ది కేరళ స్టోరీ
  • జైలర్‌
  • లియో
  • టైగర్‌-3
  • వారిసు

2023లో అత్యధికంగా శోధించిన టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు

  •  ఫెర్గీ
  •   వెన్స్‌డే
  •   అసుర్
  •   రానా నాయుడు
  •  ది లాస్ట్ ఆఫ్ అజ్‌
  •   స్కామ్ 2003
  •  బిగ్ బాస్ 17
  •  గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ 9. సెక్స్/లైఫ్
  •  తాజా ఖబర్

కాగా షారూఖ్ ఖాన్‌కు 2023 సంవత్సరం మరుపురాని సంవత్సరం అని చెప్పుకోవచ్చు.  ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ‘జవాన్’, ‘పఠాన్’ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. బాక్సాఫీస్‌లోనే కాకుండా గూగుల్ సెర్చ్ (గూగుల్‌లో అత్యధికంగా శోధించిన సినిమాలు) లో కూడా షారుక్ ఖాన్ నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

షారుక్ డబుల్ ధమాకా..

బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లదే హవా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.