Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sesham Mike-il Fathima OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

ఇప్పుడుమరో మలయాళ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. తెలుగు వెర్షన్‌లో కూడా స్ట్రీమింగ్‌ కానుంది. అదే కల్యాణి ప్రియ దర్శన్‌ నటించిన శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా. నవంబర్‌ 17న మలయాళంలో రిలీజైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అయితే థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌..

Sesham Mike-il Fathima OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Sesham Mike Il Fathima Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 10, 2023 | 6:11 PM

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రైమ్‌, కామెడీ, సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్‌.. ఏ జోనర్‌ మలయాళ సినిమాలకైనా సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. సహజత్వానికి పెద్ద పీట వేయడమే మాలీవుడ్‌ సినిమాల స్పెషాలిటీ. అందుకే మలయాళం సినిమా వస్తుందంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు తెలుగు ఓటీటీ ఆడియెన్స్‌. 2018, పద్మినీ, జర్నీ ఆఫ్‌ 18 ప్లస్, ఆర్‌ డీ ఎక్స్‌, కాసర్‌ గోల్డ్‌, కన్నూర్‌ స్వ్కాడ్‌ తదితర మలయాళ సినిమాలు తెలుగు ఆడియెన్స్‌ను బాగా అలరించాయి. ఇప్పుడుమరో మలయాళ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. తెలుగు వెర్షన్‌లో కూడా స్ట్రీమింగ్‌ కానుంది. అదే కల్యాణి ప్రియ దర్శన్‌ నటించిన శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా. నవంబర్‌ 17న మలయాళంలో రిలీజైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అయితే థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేస్తోంది. డిసెంబర్‌ 15 నుంచే కల్యాణి ప్రియ దర్శన్‌ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

మనూ సి కుమార్ తెరకెక్కించిన శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌తో పాటు ఫెమినా జార్జ్, షహీన్ సిద్ధికీ, పార్వతి, అనీశ్ మీనన్, సాబుమన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ముస్లిం కుటుంబానికి చెందిన ఫాతిమా నూర్జహాన్‌(కల్యాణి ప్రియదర్శన్)కు ఫుట్‌ బాల్‌ కామెంటేటర్‌ అవ్వాలనుకుంటుంది. అయితే ఫ్యామిలీలో ఎవరి మద్దతు లభించదు. దీంతో స్థానిక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు కామెంటరీ చేస్తుంటుంది. అయితే ఇంటర్నేషనల్‌ ఫుట్ బాల్‌ మ్యాచ్‌లకు కామెంటరీ కావాలన్నదే ఫాతిమా లక్ష్యం. మరి ఆమె లక్ష్యం నెరవేరిందా? అందుకు ఫాతిమా స్నేహితులు ఎలాంటి సాయం చేశారన్నది తెలుసుకోవాలంటే శేషమ్ మైక్-ఇల్ ఫాతిమా సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..