AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: అమర్‏కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. జర్నీ వీడియో చూసి ఎమోషనల్..

క నిన్నటి ఎపిసోడ్‏లో ముందుగా అమర్ దీప్, అర్జున్ ఇద్దరి బిగ్‏బాస్ జర్ని వీడియోలను చూపించారు. ముఖ్యంగా అమర్ అమాయకత్వం.. అల్లరి.. ఆవేశం.. కోపం.. తప్పులు చేసి దొరికిపోవడం.. సరుకులు దాచుకోవడం నుంచి మొదటి ఐదు వారాలు హోస్ట్ నాగార్జున గట్టిగా క్లాసులు తీసుకోవడం వరకు ఇలా ప్రతి క్షణాన్ని చూపించారు. తన భార్య తేజును చూసి ఎమోషనల్ అయ్యాడు అమర్. తన బిగ్‏బాస్ జర్ని వీడియో చేస్తూ ఒక పెద్ద సినిమా ట్రైలర్ చూసినట్లుగా ఉందంటూ సంతోషంతో గంతులేశాడు.

Bigg Boss 7 Telugu: అమర్‏కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బిగ్‏బాస్.. జర్నీ వీడియో చూసి ఎమోషనల్..
Bigg Boss 7 Telugu
Rajitha Chanti
|

Updated on: Dec 12, 2023 | 6:46 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా సీజన్ తుది దశకు చేరుకుంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీంతో ఇక మిగిలింది కేవలం వారం రోజులే. ఈ వారం రోజులను కంటెస్టెంట్స్ కోసం అద్భుతంగా ప్లాన్ చేశారు బిగ్‏బాస్. ఒక్కో ఫైనలిస్ట్ కు తమ జర్నీని అందంగా.. మనసుకు దగ్గరయ్యేలా చూపించాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో ముందుగా అమర్ దీప్, అర్జున్ ఇద్దరి బిగ్‏బాస్ జర్ని వీడియోలను చూపించారు. ముఖ్యంగా అమర్ అమాయకత్వం.. అల్లరి..  కోపం.. తప్పులు చేసి దొరికిపోవడం.. సరుకులు దాచుకోవడం నుంచి మొదటి ఐదు వారాలు హోస్ట్ నాగార్జున గట్టిగా క్లాసులు తీసుకోవడం వరకు ఇలా ప్రతి క్షణాన్ని చూపించారు. తన భార్య తేజును చూసి ఎమోషనల్ అయ్యాడు అమర్. తన బిగ్‏బాస్ జర్ని వీడియో చేస్తూ ఒక పెద్ద సినిమా ట్రైలర్ చూసినట్లుగా ఉందంటూ సంతోషంతో గంతులేశాడు. అసలు నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్ధామా.

ముందుగా అమర్ దీప్ ను గార్డెన్ ఏరియాకు రమ్మాన్నాడు బిగ్‏బాస్. ఇక తలుపు తీసి చూసేసరికి గార్డెన్ ఏరియా మొత్తం మంచు ప్రపంచంలా కనిపించింది. అమర్ వస్తుండగా.. గ్యాంగ్ లీడర్ సినిమాలోని టైటిల్ సాంగ్ వేశారు. గార్డెన్ ఏరియాలో సెట్ చేసిన తన జర్నీ ఫోటోలను చూసి ఆశ్చర్యపోయాడు. బుక్ ఆఫ్ మెమొరీస్ లో తన భార్య తేజుతో ఉన్న ఫోటోస్ చూసి.. మా పెళ్లిలో కూడా ఇలాంటి ఫోటోస్ లేవు బిగ్‏బాస్.. థాంక్యూ సోమచ్ అంటూ మురిసిపోయాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ కాంజిత్.. కెప్టెన్సీ పోయినప్పుడు తట్టుకోలేక ఏడ్చిన క్షణాలను చూసి .. ఇప్పటికే బాధగా ఉందన్నాడు. ఇక ఆ తర్వాత యాక్టివిటీ రూంలో తన జర్నీని ప్లే చేసి చూపించాడు బిగ్‏బాస్. అక్కడ అమర్ దీప్ మనస్తత్వం గురించి చెప్పాడు బిగ్‏బాస్..

“మీ పేరుకి అర్థం ఎప్పటికీ వెలిగే జ్యోతి. అదే విషయం మీ ప్రయాణంలో ప్రతిబింబించింది. ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లాలనే కసి నిరంతరం మీలో జ్వలిస్తూ ఎలాగైనా ప్రతి ఆటలో గెలిచి చివరి వరకూ చేరాలనే మీ తపన మీ ప్రయాణాన్ని మలిచింది. మీ చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని మీ అల్లరిని మీ వెటకారాన్నీ మీ స్నేహితులకన్నా ఎక్కువగా అర్థం చేసుకున్నవారు లేరు… మిగతా వారికి తెలీకుండా మీరు మీ గోడౌన్ లో దాచిన ఆహారం గురించి మీకు.. బిగ్‏బాస్ కు మాత్రమే తెలుసు.. ఇలా మీ అలవాట్లు.. మీ ఆటను ముందుకు తీసుకుకెళ్లేందుకు ఒకరితో ఒకరు పంచుకున్న రహస్యాలు మీ స్నేహాన్ని ఇంకా బలంగా చేశాయి. కొన్నిసార్లు కట్టలు తెంతుకున్న భావోద్వేగాలు మీలో ఆవేశం ఎంతుందో చూపించాయి. కాకనీ మీలో వినోదం కూడా అంతే ఉంది. గెలవడం మీకు ఎంత ఇష్టమో.. మీ జుట్టు కూడా అంతే ఇష్టమని బిగ్‏బాస్ కు తెలుసు. ఎన్ని నిందలు వేసినా పట్టుదల ఒక్కశాతం తగ్గకుండా రెట్టింపు ఉత్సాహంతో పోరాడి ఫైనలిస్ట్ అయ్యారు. పొరపాట్లు తెలుసుకుని ముందుకు కదిలేవారిని ఎవరూ ఆపలేరు.. ” అంటూ చెప్పుకొచ్చాడు బిగ్‏బాస్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.