AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బాహుబలిలా అర్జున్.. భార్య ఫోటోస్ చూసి ఎమోషనల్.. నవ్వించిన బిగ్‏బాస్..

గార్డెన్ ఏరియాలోకి అర్జున్ ఎంట్రీ ఇస్తుండగా.. వీడు ఆరడుగుల బుల్లెటు పాట ప్లే చేశారు. ఇక బిగ్‏బాస్ సెట్ చేసిన సెటప్ చూసి షాకయ్యాడు అర్జున్. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన తన జర్నీ ఫోటోస్ చూసి మురిసిపోయాడు. ఆ తర్వాత బుక్ ఆఫ్ మెమొరీస్ పుస్తకాన్ని ఓపెన్ చేసి.. అందులో తన భార్య హౌస్ లోకి వచ్చిన ఫోటోస్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మూడు ఫోటోస్ నా బెస్ట్.. థాంక్యూ బిగ్‏బాస్ అని అన్నాడు. ఆ తర్వాత అక్కడే పక్కన గిన్నెలు ఉల్లిపాయలు కూడా పెట్టాడు. దీంతో తన టాస్క్ గుర్తొచ్చి నవ్వుకున్నాడు అర్జున్.

Bigg Boss 7 Telugu: బాహుబలిలా అర్జున్.. భార్య ఫోటోస్ చూసి ఎమోషనల్.. నవ్వించిన బిగ్‏బాస్..
Bigg Boss 7 Arjun
Rajitha Chanti
|

Updated on: Dec 12, 2023 | 7:11 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 ఇప్పుడు చివరి వారానికి వచ్చేసింది. మరో ఐదు రోజుల్లో సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. మొన్నటి వరకు గొడవలు.. కోట్లాటలో సాగిన బిగ్‏బాస్ హౌస్.. ఇప్పుడు మొత్తం ఎమోషనల్ వాతావరణం వచ్చేసింది. నిన్నటి ఎపిసోడ్ లో అమర్ దీప్, అర్జున్ ఇద్దరి జర్నీ వీడియోలు చూపించారు. ముందుగా అమర్.. ఆ తర్వాత అర్జున్ తమ జర్నీ వీడియో చూసి భావోద్వేగానికి గురయ్యాడు. గార్డెన్ ఏరియాలోకి అర్జున్ ఎంట్రీ ఇస్తుండగా.. వీడు ఆరడుగుల బుల్లెటు పాట ప్లే చేశారు. ఇక బిగ్‏బాస్ సెట్ చేసిన సెటప్ చూసి షాకయ్యాడు అర్జున్. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన తన జర్నీ ఫోటోస్ చూసి మురిసిపోయాడు. ఆ తర్వాత బుక్ ఆఫ్ మెమొరీస్ పుస్తకాన్ని ఓపెన్ చేసి.. అందులో తన భార్య హౌస్ లోకి వచ్చిన ఫోటోస్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మూడు ఫోటోస్ నా బెస్ట్.. థాంక్యూ బిగ్‏బాస్ అని అన్నాడు. ఆ తర్వాత అక్కడే పక్కన గిన్నెలు ఉల్లిపాయలు కూడా పెట్టాడు. దీంతో తన టాస్క్ గుర్తొచ్చి నవ్వుకున్నాడు అర్జున్. ఉల్లిపాయాలు తింటారా అంటూ కామెడీ చేశాడు బిగ్‏బాస్.

ఇక ఆ తర్వాత యాక్టివిటీ ఏరియాకు పిలిచి తన బిగ్‏బాస్ జర్నీ వీడియోను చూపించారు. అంతకు ముందు అర్జున్ గురించి ఆసక్తికర మాటలు చెప్పాడు బిగ్‏బాస్. అర్జున్.. కదిలే బండిలోకి ఎక్కడ సాహసంతో కూడిన చర్య. అది అంతే ప్రమాదం కూడా. కానీ ఆరోవారంలో ఇంట్లో అడుగుపెట్టగానే ఆ ప్రమాదం మీ రూపంలో ఇంటి సభ్యులకు కనిపించింది. వచ్చిన మొదటి రోజు నుంచి ఎవరూ కదపలేని ఏకాగ్రతను చూపిస్తూ ఒక్కొక్కటిగా టాస్కుల్లో గెలుస్తూ మీ లక్ష్యం వైపు దూసుకెళ్లారు. మీ ప్రత్యర్థులకు మాటలతో తక్కువగా.. మీ చేతలతో ఎక్కువగా ఆన్సర్ ఇచ్చారు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నమ్మిన విషయం కోసం గట్టిగా మీ గొంతు వినిపించారు. కండ బలం, బుద్ధి బలం కలగలపిన బలవంతుడిగా నిరూపించుకొని బలవంతులం అనుకున్నవారిని ఆలోచనలో పడేశారు. లక్ష్యం చేరాలనే పట్టుదల మిమ్మల్ని ఆట గురించి ఆలోచించేలా చేసింది. అందులో మీ భార్య కూడా సగమైంది. ఆ ప్రేమో మిమ్మల్ని ముందుకు నడిపింది. మీరు ఎవరి వైపు ఉన్నారో తెలియని సమయంలో మీ పూర్తి ఏకాగ్రత ఆటపై ఉంచి సీజన్ 7 మొదటి ఫైనలిస్ట్ అయ్యేలా చేసింది. ఎప్పుడొచ్చామని కాదు. ఆట పూర్తయ్యే సమయానికి ఎక్కడ ఉన్నామన్నదే ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు బిగ్‏బాస్.

ఇక ఆ తర్వాత బిగ్‏బాస్ జర్నీ వీడియో చూసి భావోద్వేగానికి గురయ్యాడు అర్జున్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన క్షణాల నుంచి ఫినాలే అస్త్రం గెలిచినంత వరకూ అర్జున్ జర్నీని చాలా అద్భుతంగా కట్ చేశారు. ప్రతి టాస్కులో అర్జున్ గెలిచిన తీరు.. తోటి కంటెస్టెంట్లతో చేసిన కామెడీని చూపించారు. ఇక హౌస్ లోకి తన భార్య వచ్చిన క్షణాలను చూసి ఎమోషనల్ అయ్యాడు అర్జున్. జీవితంలో ఫస్ట్ చైల్డ్ అంటే అందరికీ స్పెషలే. కానీ ఇలాంటి సమయంలో కూడా నన్ను సపోర్ట్ చేసి పంపించింది నా వైఫ్. నిజంగా తన కల పూర్తిగా నెరవేర్చాలనే ఉంది. ఒక్కడినే ఉన్నా.. నా కోసమే ఆడాను. ఒక్కడినే ఇక్కడి వరకూ వచ్చాను. మీరు ఇచ్చిన మెమొరీస్ ఎప్పటికీ మర్చిపోలేను బిగ్‏బాస్ అన్నాడు అర్జున్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us