Bigg Boss Telugu 7: రైతు బిడ్డ పేరు మార్చేసిన ఆస్కార్ విజేత.. ఫుల్ ఖుషిలో పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌.. వీడియో

ఆదివారం ఎపిసోడ్‌కు ఆస్కార్‌ విజేత కీరవాణి అతిథిగా హాజరయ్యారు. నాగార్జున హీరోగా నటిస్తోన్న 'నా సామిరంగ' సినిమాలోని పాటను బిగ్ బాస్ వేదికగా లాంచ్‌ చేశారాయన. అనంతరం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ ఫినాలేకు చేరుకున్నట్లుగా ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు కీరవాణి. ఆస్కార్‌ విజేత నోటి వెంట తన పేరు రాగానే పల్లవి ప్రశాంత్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

Bigg Boss Telugu 7: రైతు బిడ్డ పేరు మార్చేసిన ఆస్కార్ విజేత.. ఫుల్ ఖుషిలో పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌.. వీడియో
Bigg Boss Telugu 7
Follow us
Basha Shek

|

Updated on: Dec 11, 2023 | 8:08 PM

బుల్లితెర ప్రేక్షకులకు బోలెడు వినోదం అందజేస్తోన్న బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ సెలబ్రిటీ గేమ్ షోకు ఎండ్‌ కార్డ్‌ పడనుంది. డిసెంబర్‌ 17న గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. ఇక 14 వారంలో శోభా శెట్టి ఎలిమినేట్‌ కాగా.. మిగిలిన టాప్‌-6 కంటెస్టెంట్లతో గ్రాండ్‌ ఫినాలేను నిర్వహించనున్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌, శోభా శెట్టి, అర్జున్‌ అంబటి ఫినాలే లిస్టులో ఉన్నారు. దీనికి సంబంధించి ఆదివారం (డిసెంబర్‌ 10) వీకెండ్‌ ఎపిసోడ్‌లో ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశాడు బిగ్‌ బాస్‌. ఇదిలా ఉంటే ఆదివారం ఎపిసోడ్‌కు ఆస్కార్‌ విజేత కీరవాణి అతిథిగా హాజరయ్యారు. నాగార్జున హీరోగా నటిస్తోన్న ‘నా సామిరంగ’ సినిమాలోని పాటను బిగ్ బాస్ వేదికగా లాంచ్‌ చేశారాయన. అనంతరం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ ఫినాలేకు చేరుకున్నట్లుగా ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు కీరవాణి. ఆస్కార్‌ విజేత నోటి వెంట తన పేరు రాగానే పల్లవి ప్రశాంత్‌ భావోద్వేగానికి గురయ్యాడు. మోకాళ్లపై కూర్చొని మొదట కీరవాణికి, ఆతర్వాత భూమికి నమస్కారం చేశాడు.

ఈ సందర్భంగా కీరవాణి పల్లవి ప్రశాంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రశాంత్.. నువ్వు రైతు బిడ్డవు కదా. ఇప్పటి నుంచి నీ పేరు బీబీ బిడ్డ అని మారుస్తున్నాను. అంటే నువ్వు పదే పదే భూమికి నమస్కరిస్తున్నావు కాబట్టి భూమి బిడ్డను చేశాను’ అన్నారు. ఆ తర్వాత కీరవాణి ‘బీబీ బిడ్డ అంటే మరో పేరు కూడా వస్తుంది. అదే బిగ్ బాస్ బిడ్డ. అంటే ఇప్పటి నుంచి నువ్వు భూమి బిడ్డ ప్రశాంత్ లేదా బిగ్ బాస్ ప్రశాంత్‌గా గుర్తింపు తెచ్చుకుంటావు’ అన్నారు కీరవాణి. ఆస్కార్‌ విజేత పొగడ్తలతో పల్లవి ప్రశాత్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన రైతు బిడ్డ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఈ సీజన్‌లో పల్లవి ప్రశాంతే టైటిల్‌ విన్నర్‌గా నిలుస్తాడని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన ఆట సందీప్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..