Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌లో శివాజీని గెలిపించండి.. అనాథ పిల్లలకు అభిమానుల అన్నదానం.. వీడియో చూశారా?

ఫినాలే అస్త్ర సాధించి ముందుగానే ఫినాలేలో ప్లేస్‌ సొంతం చేసుకున్నాడు అర్జున్ అంబటి. ఆ తర్వాత ప్రియాంక జైన్‌ రెండో ఫైనలిస్టుగా ఖరారైంది. వీరితో పాటు పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్, శివాజీ, అమర్‌ దీప్‌ కూడా బిగ్‌ బాస్‌ టైటిల్‌ రేసులో ఉన్నారు. దీనికి సంబంధించి ఓటింగ్ హోరాహోరీగా నడుస్తోంది. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి? ఈసారి బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేత ఎవరన్నది ఆందరిలో ఆసక్తి పెరిగింది.

Bigg Boss 7 Telugu: బిగ్‌ బాస్‌లో శివాజీని గెలిపించండి.. అనాథ పిల్లలకు అభిమానుల అన్నదానం.. వీడియో చూశారా?
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2023 | 6:46 PM

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ఫైనల్స్‌కు సమయం ముంచుకొస్తోంది. ఆదివారం (డిసెంబర్‌ 17)న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ హౌజ్‌లోకి అడుగుపెట్టగా టాప్‌ ఆరుగురు కంటెస్టెంట్స్‌ ఫైనల్‌ కు చేరుకున్నారు. ఫినాలే అస్త్ర సాధించి ముందుగానే ఫినాలేలో ప్లేస్‌ సొంతం చేసుకున్నాడు అర్జున్ అంబటి. ఆ తర్వాత ప్రియాంక జైన్‌ రెండో ఫైనలిస్టుగా ఖరారైంది. వీరితో పాటు పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్, శివాజీ, అమర్‌ దీప్‌ కూడా బిగ్‌ బాస్‌ టైటిల్‌ రేసులో ఉన్నారు. దీనికి సంబంధించి ఓటింగ్ హోరాహోరీగా నడుస్తోంది. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి? ఈసారి బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేత ఎవరన్నది ఆందరిలో ఆసక్తి పెరిగింది.. మరోవైపు తమ అభిమాన కంటెస్టెంట్స్‌ను విజేతగా నిలిపేందుకు అభిమానులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కంటెస్టె్ంట్స్‌ గురించి నెట్టింట భారీ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివాజీ అభిమానులు చేసిన ఒక పని అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే.. శివాజీని బిగ్‌ బాస్‌ విజేతగా నిలవాలంటూ కొందరు అభిమానులు పేదలు, అనాథలకు అన్నదానం నిర్వహించారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియోని శివాజీ అఫీషియల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ అయ్యింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.

లీడింగ్‌లో పల్లవి ప్రశాంత్‌

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ ఓటింగ్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బిగ్‌ బాస్‌ చాణక్యుడిగా, పెద్దన్నగా గుర్తింపు తెచ్చుకున్న శివాజీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత అమర్‌ దీప్‌, ప్రియాంక, అర్జున్‌, ప్రిన్స్‌ యావర్‌ ఉన్నారు. ఓటింగ్‌ కు ఇంకా మూడు రోజుల సమయముంది కాబట్టి ఏమైనా జరగొచ్చు. ఇక హౌజ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు శివాజీ. మైండ్ గేమ్స్ ఆడుతూ, తన అనుభవాన్ని ప్రదర్శిస్తూ చాణక్యుడిగా బుల్లితెర ప్రేక్షకుల ప్రేమాభిమానాలను చూరగొన్నారు. అన్నిటికీ ముఖ్యంగా హౌజ్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌లకు అండగా నిలవడం శివాజీకి బాగా హెల్ప్‌ అయ్యింది. మరి తన అనుభవంతో శివాజీ బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ టైటిల్‌ విజేతగా నిలుస్తాడా? లేదా? అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

ఇవి కూడా చదవండి

శివాజీ అభిమానుల అన్నదానం.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.