Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raakshasa Kaavyam OTT: ఓటీటీలో సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రాక్షస కావ్యం’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

థియేటర్లలో విడుదలై ఓ మోస్తరుగా ఆడిన సినిమా ఒకటి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. అదే రాక్షస కావ్యం. ఒక విభిన్నమైన కథతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అభయ్ నవీన్ బేతినేని, అన్వేష్ మైకేల్, కుశాలిని ప్రధాన పాత్రల్లో నటించారు. అక్టోబర్‌ 13న థియేటర్లలో రాక్షస కావ్యం సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అయితే పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో ఎక్కువ రోజులు

Raakshasa Kaavyam OTT: ఓటీటీలో సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'రాక్షస కావ్యం'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Raakshasa Kaavyam Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2023 | 5:34 PM

ఈ మధ్యన థియేటర్లలో రిలీజై పెద్దగా ఆకట్టుకోని సినిమాలు ఓటీటీలో మాత్రం హిట్‌ అవుతున్నాయి. సిల్వర్‌ స్క్రీన్‌పై అలరించనప్పటికీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ మాత్రం మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా హార్రర్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. అలా థియేటర్లలో విడుదలై ఓ మోస్తరుగా ఆడిన సినిమా ఒకటి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. అదే రాక్షస కావ్యం. ఒక విభిన్నమైన కథతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అభయ్ నవీన్ బేతినేని, అన్వేష్ మైకేల్, కుశాలిని ప్రధాన పాత్రల్లో నటించారు. అక్టోబర్‌ 13న థియేటర్లలో రాక్షస కావ్యం సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అయితే పెద్దగా ప్రమోషన్లు లేకపోవడంతో ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా రాక్షస కావ్యం డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. డిసెంబర్‌15వ తేదీ నుంచి ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా మూవీ పోస్టర్స్‌ను షేర్‌ చేసింది. ‘విలన్లు బ్రతకాలి.. విలన్లు చావకూడదు.. విలన్లు గెలవాలి! ఈ రాక్షస కావ్యం ఏంటో తెలియాలి అంటే Dec 15 వరకు ఆగాల్సిందే. ‘కాలం రాసిన ‘రాక్షస కావ్యం’. డిసెంబరు 15 న ఆహాలో’ అని రాక్షస కావ్యం పోస్టర్స్‌, ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది ఆహా ఓటీటీ.

శ్రీమాన్‌ కీర్తి తెరకెక్కించిన రాక్షస కావ్యం సినిమాలో దయానంద్ రెడ్డి, పవన్ రమేశ్, యాదమరాజు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. రుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ పతాకాలపై దామురెడ్డి, సింగనమల కల్యాణ్ నిర్మించారు. రాజీవ్ రాజ్, శ్రీకాంత్ సంగీతం అందించారు. రుషి కోనాపురం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సినిమా కథ విషయానికి వస్తే.. సుపారీ తీసుకొని హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్‌గా ఉంటాడు అజయ్‍ (అభయ్ నవీన్). మరోవైపు విజయ్ (అన్వేష్ మైకేల్) మాత్రం సినిమాలు చేయాలని ఆరాటపడుతుంటాడు. వెరైటీగా విలన్లను హైలైట్ చేస్తూ సినిమాలు తీయాలని విజయ్ ఆలోచిస్తుంటాడు. అయితే అజయ్, విజయ్ మధ్య శత్రుత్వం ఉంటుంది. మరి ఈ ఇద్దరి మధ్య శత్రుత్వానికి కారణమేంటి.. చివరికి ఏమైంది అన్నది తెలుసుకోవాలంటే రాక్షస కావ్యం సినిమా చూడాల్సిందే. ట్రైలర్‌ చాలా కొత్తగా అనిపించింది. థియేటర్లలో ఈ థ్రిల్లర్‌ మూవీని మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో ఓ లుక్కేయండి మరి.

ఇవి కూడా చదవండి

రాక్షస కావ్యం ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.