AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leo Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘లియో’ ఇంగ్లీష్ వెర్షన్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా ?..

యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో త్రిష విజయ్ జోడిగా నటించింది. అడియన్స్ అంచనాలకు మించి ఈ సినిమాను రూపొందించాడు డైరెక్టర్ లోకేష్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనిపించాడు. థియోటర్లలో సక్సెస్ అయిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా దక్షిణాది భాషలతోపాటు.. హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇంగ్లీష్ వెర్షన్ డబ్బింగ్ పనులు ఆలస్యం కావడంతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది.

Leo Movie: ఓటీటీలోకి వచ్చేసిన 'లియో' ఇంగ్లీష్ వెర్షన్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా ?..
Leo Movie
Rajitha Chanti
|

Updated on: Dec 12, 2023 | 10:37 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటేస్ట్ సినిమా లియో. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో త్రిష విజయ్ జోడిగా నటించింది. అడియన్స్ అంచనాలకు మించి ఈ సినిమాను రూపొందించాడు డైరెక్టర్ లోకేష్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనిపించాడు. థియోటర్లలో సక్సెస్ అయిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా దక్షిణాది భాషలతోపాటు.. హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇంగ్లీష్ వెర్షన్ డబ్బింగ్ పనులు ఆలస్యం కావడంతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. తాజాగా రెండు వారాలు ఆలస్యంగా మంగళవారం ఇంగ్లీష్ వెర్షన్ ఓటీటీలోకి తీసుకువచ్చారు.

ఓవర్సీస్ తోపాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ డిమాండ్ మేరకే లియో సినిమా ఇంగ్లీష్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసినట్లు సమాచారం. కాంతార తర్వాత ఓటీటీలో ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ అయిన సౌత్ మూవీగా లియో నిలిచింది. అంతకు ముందు వచ్చిన కాంతార సైతం నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కావడం గమనార్హం. లియో సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు రూ.600 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా..ఇప్పటివరకు విజయ్ నటించిన అన్ని చిత్రాల్లో హయ్యేస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది లియో.

దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత విజయ్, త్రిష జోడిగా నటించారు. ఈ సినిమాకు దాదాపు రూ.100 కోట్ల వరకు దళపతి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపించింది. ఇక లియో సక్సెస్ తర్వాత అటు త్రిష సైతం పారితోషికాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తమిళ్ ఇండస్ట్రీలో మళ్లీ ఆఫర్స్ క్యూ కట్టాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్