Aadikeshava: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన వైష్ణవ తేజ్ ఆదికేశవ.. స్ట్రీమింగ్ అప్పుడేనా..!
ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. తొలి సినిమాతోనే 100 కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు వైష్ణవ్. ఆ తర్వాత ఈ కుర్ర హీరో నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా అవి డిజాస్టర్స్ గానే మిగిలాయి.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు చాలా మంది సక్సెస్ అయ్యి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. తొలి సినిమాతోనే 100 కోట్లు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు వైష్ణవ్. ఆ తర్వాత ఈ కుర్ర హీరో నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా అవి డిజాస్టర్స్ గానే మిగిలాయి.
ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ కొండపోలం అనే సినిమా చేశాడు. ఈ సినిమా విక్రమ్ కుమార్ కే దర్శకత్వం వహించాడు. ఆతర్వాత రంగరంగవైభవంగా అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక రీసెంట్ గా ఆదికేశవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగవంశీ ఆదికేశవ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఆదికేశవ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. ఆదికేశవ సినిమా వచ్చే వారం ఓటీటీలోకి వస్తుందని టాక్ వైరల్ అవుతుంది. డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
View this post on Instagram
శ్రీలీల ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




