Mohammed Shami: ప్రపంచ కప్‌లో సూపర్‌ పెర్ఫామెన్స్‌.. దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం రేసులో మహ్మద్‌ షమీ

గతంలో 2021లో టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. అలాగే విరాట్‌ కోహ్లి (2013), రోహిత్‌ శర్మ (2015), రవిచంద్రన్‌ అశ్విన్‌ (2014), రవీంద్ర జడేజా (2019) అర్జున అవార్డు గెలుచుకున్న వారిలో ఉన్నారు.

Mohammed Shami: ప్రపంచ కప్‌లో సూపర్‌ పెర్ఫామెన్స్‌.. దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం రేసులో మహ్మద్‌ షమీ
Mohammed Shami
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2023 | 8:48 PM

వన్డే ప్రపంచ కప్‌లో వికెట్ల పంట పండించి టీమిండియాను ఫైనల్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ. కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ 10.70 సగటుతో మొత్తం 24 వికెట్లు తీసి వరల్డ్‌ కప్‌ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో షమీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రపంచకప్‌లో మహ్మద్‌ షమీ అత్యుత్తమ ప్రదర్శనకు గుర్తింపుగా దేశ ప్రతిష్టాత్మక క్రీడా గౌరవం అర్జున అవార్డుకు అతని పేరు నామినేట్‌ అయ్యింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అర్జున అవార్డుకు టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం . మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వెలువరించిన ఒక నివేదిక ప్రకారం.. దేశ రెండవ అత్యున్నత క్రీడా గౌరవానికి నామినీల జాబితాలో మొదట మహ్మద్‌ షమీ పేరు లేదు. అయితే అర్జున అవార్డు నామినేషన్స్‌లో టీమిండియా సీనియర్‌ బౌలర్‌ పేరును పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐ క్రీడా మంత్రిత్వ శాఖకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. దీంతో అర్జున అవార్డు రేసులో మహ్మద్ షమీ పేరు చేరనున్నట్టు సమాచారం.

కాగా గతంలో 2021లో టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. అలాగే విరాట్‌ కోహ్లి (2013), రోహిత్‌ శర్మ (2015), రవిచంద్రన్‌ అశ్విన్‌ (2014), రవీంద్ర జడేజా (2019) అర్జున అవార్డు గెలుచుకున్న వారిలో ఉన్నారు. ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టుకు దూరంగా ఉన్నాడు మహ్మద్‌ షమీ. త్వరలోనే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో మళ్లీ టీమ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఫిట్‌నెస్‌పై సందేహాలున్నా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న 2 మ్యాచ్‌ల సిరీస్‌లో షమీ ఆడటం దాదాపు ఖాయం. షమీతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌ కోసం జట్టులో చేరనున్నారు.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ స్పెషల్ సిఫారసు..

ఫైనల్ ఓటమి అనంతరం షమీని ఓదారుస్తోన్న పీఎం నరేంద్ర మోడీ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..