Shah Rukh Khan: షిర్డీలో సందడి చేసిన షారుఖ్ ఖాన్.. కూతురుతో కలిసి బాబాకు పూజలు చేసిన బాద్షా
ఈ వీడియోలో తన కుమార్తెతో ఉన్న షారుఖ్ కనిపిస్తున్నాడు. మహారాష్ట్రలోని షిర్డీలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన తిరిగి వస్తున్నట్లు ఉన్న ఈ వీడియోలో షారుక్ ఖాన్ టోపీ ధరించి ముఖాన్ని కప్పుకుని కనిపించాడు. జీన్స్ , తెలుపు టీ-షర్ట్ ధరించి కనిపించాడు. సుహానా సల్వార్ సూట్‌లో కనిపించింది. ఒక్కసారిగా షారుఖ్ ఖాన్ ను చూసి అభిమానులు ఎగబడ్డారు. అంతేకాదు ఫోటోల కోసం కరచాలనం చేయడానికి పోటీపడ్డారు.
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ ఆధ్యాత్మిక పర్యటన చేపట్టినట్లున్నాడు. ఇటీవల వైష్ణోదేవిని దర్శించుకుని పూజలు చేసిన షారుఖ్ ఖాన్ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చెక్కర్లు కొట్టాయి. ఇప్పుడు గురువారం షారుఖ్ ఖాన్ తన కూతురు తో కలిసి షిర్డీలో పర్యటించారు. తన కుమార్తె సుహానాతో కలిసి షారుఖ్ ఖాన్ షిర్డీ సాయిబాబాకు పూజలను చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియోలో తన కుమార్తెతో ఉన్న షారుఖ్ కనిపిస్తున్నాడు.
మహారాష్ట్రలోని షిర్డీలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన తిరిగి వస్తున్నట్లు ఉన్న ఈ వీడియోలో షారుక్ ఖాన్ టోపీ ధరించి ముఖాన్ని కప్పుకుని కనిపించాడు. జీన్స్ , తెలుపు టీ-షర్ట్ ధరించి కనిపించాడు. సుహానా సల్వార్ సూట్‌లో కనిపించింది. ఒక్కసారిగా షారుఖ్ ఖాన్ ను చూసి అభిమానులు ఎగబడ్డారు. అంతేకాదు ఫోటోల కోసం కరచాలనం చేయడానికి పోటీపడ్డారు.
షారుక్ ఖాన్ నటించిన తాజా సినిమా డంకీ డిసెంబర్ 21 న విడుదల కానుంది. షారుఖ్ కు జోడీగా తాప్సీ నటించింది. విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు.
షారూఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి షిర్డీ సాయిబాబాకి పూజలు
#WATCH | Actor Shah Rukh Khan along with his daughter Suhana Khan visited and offered prayers at Shirdi Sai Baba Temple, in Shirdi, Maharashtra pic.twitter.com/e5WOUxDPfE
— ANI (@ANI) December 14, 2023
ఇటీవల రిలీజైన డంకీ ట్రైలర్ సినీ ప్రేమికులను బాగా ఆకట్టుకుంది. ట్రైలర్‌తో పాటు లూట్ పుట్ గయా, నిక్లే ది హమ్ కభీ ఘర్ సే, ఓ మహి హైన్ అనే మూడు పాటలు కూడా విడుదలయ్యాయి. ఈ ఏడాది షారుక్‌కి ఇది మూడో సినిమా కాబట్టి కింగ్‌ఖాన్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారు.ఈ ఏడాది షారుఖ్ జవాన్ , పఠాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు చిత్రాలూ సినీ అభిమానులను ఆకట్టుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. పఠాన్, జవాన్ లాగా డంకీ కూడా సూపర్ హిట్ అవుతుందని.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..