Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ విన్నర్‌ ఎవరో లీక్‌ చేసిన సందీప్‌ మాస్టర్‌ భార్య.. ఆమె చెబితే కన్ఫార్మ్‌ అయినట్టే

బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేత ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియాలోనూ ఈ విషయంపై విస్తృత చర్చ నడుస్తోంది. పల్లవి ప్రశాంత్, అమర్‌ దీప్‌లు ప్రధానంగా టైటిల్‌ రేసులో ఉన్నప్పటికీ బిగ్‌ బాస్‌ పెద్దన్న శివాజీని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదంటున్నారు బిగ్‌ బాస్‌ ఆడియెన్స్‌, ఫ్యాన్స్‌. ఇక సెలబ్రిటీలు కూడా తమకు నచ్చిన కంటెస్టెంట్ల పేరును సూచిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ విన్నర్‌ ఎవరో లీక్‌ చేసిన సందీప్‌ మాస్టర్‌ భార్య.. ఆమె చెబితే కన్ఫార్మ్‌ అయినట్టే
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2023 | 3:59 PM

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ రియాలిటీ షోకు మరికొన్ని గంటల్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో ఏడో సీజన్ కూడా పూర్తి చేసుకోడానికి సిద్ధంగా ఉంది. ఆదివారం (డిసెంబర్‌ 17) బిగ్ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ అంగరంగ వైభవంగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేత ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియాలోనూ ఈ విషయంపై విస్తృత చర్చ నడుస్తోంది. పల్లవి ప్రశాంత్, అమర్‌ దీప్‌లు ప్రధానంగా టైటిల్‌ రేసులో ఉన్నప్పటికీ బిగ్‌ బాస్‌ పెద్దన్న శివాజీని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదంటున్నారు బిగ్‌ బాస్‌ ఆడియెన్స్‌, ఫ్యాన్స్‌. ఇక సెలబ్రిటీలు కూడా తమకు నచ్చిన కంటెస్టెంట్ల పేరును సూచిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్‌ ఏడో సీజన్‌ కంటెస్టెంట్‌, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ సందీప్‌ మాస్టర్‌ సతీమణి జ్యోతి రాజ్‌ నెట్టింట ఒక పోస్ట్‌ షేర్‌ చేసింది. చాలా మంది చెబుతున్నట్లే రైతు బిడ్డ పల్లవి ప్రశాంతే బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడని తెలిపింది.ఆమె ఇన్‌స్టాలో ‘హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ కాదు. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి తమ్ముడు’ అని అంటూ రైతు బిడ్డ ఫొటోను షేర్‌ చేసింది. అందులో స్పై ఫ్యాన్స్ 8.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోకు వచ్చేయండి అని కూడా ఉంది.

కాగా నిజానికి శనివారం జరిగిన బిగ్‌ బాస్‌ షూటింగ్‌లో సందీప్ మాస్టర్‌తో పాటు జ్యోతి రాజ్ కూడా పాల్గొందట అలాంటిది ఆమె పల్లవి ప్రశాంత్ గెలుస్తాడని పోస్ట్ పెట్టడంతో ఇది నిజమే అవుతుందని అంతా భావిస్తున్నారు. టైటిల్‌ విజేత కన్ఫార్మ్ కావడం వల్లే ఈ పోస్టు చేసిందని ప్రశాంత్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా గ్రాండ్‌ ఫినాలేకు చేరుకున్న ఆరుగురు కంటెస్టెంట్లలో ఇప్పటకే అంబటి అర్జున్‌, ప్రియాంక జైన్, ప్రిన్స్‌ యావర్‌, శివాజీలు ఎలిమినేట్‌ అయ్యారని న్యూస్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పల్లవి ప్రశాంత్‌, అమర్‌ దీప్‌లలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌజ్ లో పల్లవి ప్రశాంత్ పేరెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.