AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ‘కష్టానికి ప్రయత్నానికి తగ్గ ఫలితం’.. ప్రశాంత్‏కు టైటిల్ గెలిచాడా ?.. అఫీషియల్ పోస్ట్‏..

ప్పటికే గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన లీక్స్ బయటకు వచ్చాయి. ఇక జరిగిన ఫినాలే షూటింగ్ లో ఆరవ స్థానంలో అర్జున్ అంబటి ఎలిమినేట్ కాగా.. ఆ తర్వాత ఐదవ స్థానంలో ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది. వీరిద్దరికి పది లక్షల సూట్ కేసు ఆఫర్ ఇచ్చారట. కానీ ఇద్దరు తిరస్కరించి ఖాళీ చేతులతో బయటకు వచ్చేశారు. వీరిద్దరి ఎలిమినేషన్ తర్వాత మిగిలిన నలుగురు అమర్, శివాజీ, యావర్, ప్రశాంత్ ముందు రూ.15 లక్షల సూట్ కేసు ఆఫర్ ఇచ్చారట.

Bigg Boss 7 Telugu: 'కష్టానికి ప్రయత్నానికి తగ్గ ఫలితం'.. ప్రశాంత్‏కు టైటిల్ గెలిచాడా ?.. అఫీషియల్ పోస్ట్‏..
Pallavi Prashanth
Rajitha Chanti
|

Updated on: Dec 17, 2023 | 3:51 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 మరికొన్ని గంటల్లో ముగిసిపోనుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ఇప్పుడు ఆరుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. అమర్, శివాజీ, యావర్, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక ఫైనలిస్ట్స్ కాగా.. అత్యధిక ఓటింగ్‏తో అమర్, పల్లవి ప్రశాంత్ టైటిల్ రేసులో ముందున్నారు. అయితే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ శనివారం ఉదయమే స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్.. ఫైనలిస్ట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్నారు. ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన లీక్స్ బయటకు వచ్చాయి. ఇక జరిగిన ఫినాలే షూటింగ్ లో ఆరవ స్థానంలో అర్జున్ అంబటి ఎలిమినేట్ కాగా.. ఆ తర్వాత ఐదవ స్థానంలో ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది. వీరిద్దరికి పది లక్షల సూట్ కేసు ఆఫర్ ఇచ్చారట. కానీ ఇద్దరు తిరస్కరించి ఖాళీ చేతులతో బయటకు వచ్చేశారు. వీరిద్దరి ఎలిమినేషన్ తర్వాత మిగిలిన నలుగురు అమర్, శివాజీ, యావర్, ప్రశాంత్ ముందు రూ.15 లక్షల సూట్ కేసు ఆఫర్ ఇచ్చారట. అయితే యావర్ రూ.15 లక్షల సూట్ కేసు తీసుకుని ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత మూడో స్థానంలో శివాజీ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్, అమర్ ఇద్దరిలో ఎవరో ఒకరు విజేత కానున్నారు.

అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య పోటీ రసవంతరంగా సాగుతుంది. ఇద్దరిలో ఎక్కువ ఓటింగ్‏తో ముందు నుంచి మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. దీంతో అతడే విన్నర్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే అతడి ఫ్యాన్స్ నెట్టింట సంబరాలు స్టార్ట్ చేశారు. ఇక స్వల్ప ఓటింగ్ తేడాతో రెండో స్థానంలో ఉన్నాడు అమర్. దీంతో ఈసారి సీజన్ ఉల్టా పుల్టా అంటూ విన్నర్ ఎవరిని అనౌన్స్ చేయబోతున్నారనే విషయంపై కాస్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి సీజన్ 7 విన్నర్ అయ్యేందుకు ప్రశాంత్‏కు అవకశాలు ఎక్కువే ఉన్నాయి. ఎంతో నెగిటివిటీతో హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రశాంత్.. మొదటి రెండు వారాలు రతికతో పులిహోర కలపడం.. అతిగా ప్రవర్తించడంతో దారుణంగా ట్రోల్స్ జరిగాయి. కానీ ఆ తర్వాత రతిక వెన్నుపోటుతో రియలైజ్ అయ్యాడు. దీంతో ఫోకస్ మొత్తం ఆట పైనే పెట్టి.. అన్ని టాస్కులలో అదరగొట్టేశాడు.

ఇదిలా ఉంటే.. ఇంకా గ్రాండ్ ఫినాలేకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రశాంత్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు అతడి ఫ్యాన్స్. ఈ క్రమంలో అతడి ఇన్ స్టాలో ఓ పోస్ట్ వైరలవుతుంది. ప్రశాంత్ విన్నర్ అయ్యాడనే ఆ పోస్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. “మనం చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉంటే ఆ ప్రకృతి సైతం మన వెన్నంటే ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టానికి ప్రయత్నానికి ఫలితం లభిస్తుంది. పట్టు వదలకు సోదరా విజయం తప్పక నీదే రా” అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్.. ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్.. టైటిల్ కొట్టేశాడంటూ అతడి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు అతడికి నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.