Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే.. తెలుగు సీజన్స్‌లో విన్నర్స్ అయిన కంటెస్టెంట్స్ వీరే..
మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో.. ఇప్పుడు ఆరుగురు ఫైనలిస్ట్స్ మిగిలారు. అమర్, శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక ఈ ఆరుగురు ఫైనలిస్ట్స్ కాగా.. ఒకరు మాత్రమే ట్రోఫీ అందుకోనున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ముందు సీజన్స్ కంటే ఎక్కువగా సీజన్ 7 విన్నర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సోషల్ మీడియా టాక్ ప్రకారం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేత అయ్యాడని..
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అన్ని భాషల్లోనూ ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం హిందీలో 17వ సీజన్ నడుస్తుండగా.. తెలుగులో ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకుని.. 7వ సీజన్ ముగింపుకు వచ్చింది. తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 7 మరికొన్ని గంటల్లో పూర్తి కానుంది. ఇప్పటికే నెట్టింట గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. గత సీజన్స్ అన్నింటికంటే భిన్నంగా ఉల్టా పుల్టా అంటూ ఈ సీజన్ అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో.. ఇప్పుడు ఆరుగురు ఫైనలిస్ట్స్ మిగిలారు. అమర్, శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక ఈ ఆరుగురు ఫైనలిస్ట్స్ కాగా.. ఒకరు మాత్రమే ట్రోఫీ అందుకోనున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ముందు సీజన్స్ కంటే ఎక్కువగా సీజన్ 7 విన్నర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సోషల్ మీడియా టాక్ ప్రకారం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేత అయ్యాడని.. అమర్ దీప్ రన్నరప్ అయ్యాడని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మొదటి నుంచి ఇప్పటివరకు బిగ్‌బాస్ అన్ని సీజన్స్ విజేతలు ఎవరెవరు అయ్యారో ఇప్పుడు చూద్దాం.
సీజన్ 1.. బిగ్‌బాస్ రియాల్టీ షో మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేశారు. ఇందులో అందరూ వెండితెర నటీనటులే పాల్గొన్నారు. అప్పుడు సోషల్ మీడియా ప్రభావం సైతం అంతగా లేదు. దీంతో టీవీలో కనిపించే ఎపిసోడ్స్ చూసి వారి ప్రవర్తన ఆధారంగా ఓట్లు వేసి గెలిపించారు. మొదటి సీజన్ విజేతగా శివ బాలాజీ నిలిచాడు. రన్నర్ గా ఆదర్శ్ బాలకృష్ణ నిలిచాడు.
సీజన్ 2.. ఆ తర్వాత రెంవడ సీజన్ కు తారక్ కాకుండా.. న్యాచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేశాడు. ఇందులో వెండితెర, బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. మొత్తం 18 కంటెస్టెంట్లతో మొదలైన ఈ గేమ్.. మొత్తం 112రోజులు సాగింది. చివరకు.. కౌశల్ విన్నర్ కాగా.. గీతా మాధురి రన్నర్ గా నిలిచింది.
సీజన్ 3.. ఇక మూడవ సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 3 అన్ లిమిటెడ్ అందించింది. ముందు నుంచి సీజన్ 3 విన్నర్ శ్రీముఖి అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సింగర్ రాహుల్ సింప్లిగంజ్ విన్నర్ అయ్యాడు. శ్రీముఖి రన్నరప్ అయ్యింది.
సీజన్ 4.. ది బెస్ట్ సీజన్ అని చెప్పొచ్చు. ఇందులో యంగ్ హీరోహీరోయిన్స్, సీరియల్ నటీనటులు ఎంటర్ అయ్యారు. సీజన్ 4 విజేతగా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా హీరో అభిజిత్ నిలిచాడు. రన్నర్ గా అఖిల్ సార్థక్ నిలిచాడు. మొత్తం 105 రోజులు నడిచిన ఈ షోలో అభిజిత్ ఎంతో స్మార్ట్ గా .. ఓర్పుగా ప్రవర్తించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.
సీజన్ 5.. ఈ సీజన్ మొత్తానికి బుల్లితెర నటీనటులే సందడి చేశారు. ఇందులో షణ్ముఖ్ జస్వంత్, సన్నీ మధ్య హోరోహోరీ పోటీ నడిచింది. కానీ బిగ్‌బాస్ సీజన్ 5 ట్రోఫిని మాత్రం సన్నీ గెలుచుకున్నాడు. ఇక షణ్ముఖ్ రన్నర్ గా నిలిచాడు. అయితే ఈ షో ద్వారా అంతకుముందు ఫేమ్ పోగొట్టుకున్నాడు షణ్ముఖ్.
సీజన్ 6.. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్స్ లో 6 అట్టర్ ప్లాప్. అత్యంత తక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చిన సీజన్ ఇది. షోపై కంటెస్టెంట్లకు ఆసక్తి లేకపోవడంపై బిగ్‌బాస్ సైతం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు. శ్రీహాన్ ప్రైజ్ మనీ తీసుకోవడం వల్లే రేవంత్ కు ట్రోఫీ దక్కింది.
సీజన్ 7.. ఇప్పుడు ఉల్టా పుల్టా అంటూ సీజన్ 7 అడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. మొత్తం 19 మందితో మొదలైన ఈ షో.. ఇప్పుడు ఆరుగురు ఫైనలిస్ట్స్ మిగిలారు. అర్జున్, ప్రియాంక, శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ ఉన్నారు. వీరిలో ప్రశాంత్, అమర్ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరనేది తెలియనుంది.