Shivaji: శివాజీ ఎలిమినేషన్‌తో ఏడ్చేసిన కుమారుడు.. బిగ్‌ బాస్‌ చాణక్యుడి రెమ్యునరేషన్‌ ఎన్ని లక్షలంటే?

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ టైటిల్‌ విన్నర్‌ శివాజీనే అని చాలా మంది భావించారు. సోషల్ మీడియాలోనూ అతని పేరు మార్మోగిపోయింది. అందుకు తగ్గట్టుగానే ప్రతివారం ఓటింగ్‌లో దూసుకుపోయారు శివాజీ. బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే వీక్‌ ప్రారంభానికి ముందు వరకు శివాజీనే టైటిల్‌ విజేతగా నిలుస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి వారంలో అంతా ఉల్టాపుల్టాగా మారిపోయింది.

Shivaji: శివాజీ ఎలిమినేషన్‌తో ఏడ్చేసిన కుమారుడు.. బిగ్‌ బాస్‌ చాణక్యుడి రెమ్యునరేషన్‌ ఎన్ని లక్షలంటే?
Bigg Boss 7 Telugu, Shivaji
Follow us
Basha Shek

|

Updated on: Dec 18, 2023 | 6:17 PM

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు శివాజీ. తన అనుభవంతో మైండ్‌ గేమ్స్‌ ఆడుతూ బిగ్‌ బాస్‌ పెద్దన్నగా, చాణక్యుడిగా నాగార్జునతో పాటు అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. మధ్యలో అస్వస్థతకు గురైనా ఫిజికల్‌ టాస్కుల్లో యాక్టివ్‌గానే పాల్గొన్నారు. దీంతో బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ టైటిల్‌ విన్నర్‌ శివాజీనే అని చాలా మంది భావించారు. సోషల్ మీడియాలోనూ అతని పేరు మార్మోగిపోయింది. అందుకు తగ్గట్టుగానే ప్రతివారం ఓటింగ్‌లో దూసుకుపోయారు శివాజీ. బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే వీక్‌ ప్రారంభానికి ముందు వరకు శివాజీనే టైటిల్‌ విజేతగా నిలుస్తారని ప్రచారం జరిగింది.  అయితే చివరి వారంలో అంతా ఉల్టాపుల్టాగా మారిపోయింది. ఓటింగ్‌లో రెండో స్థానానికి పడిపోయారు శివాజీ. అదే సమయంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, సీరియల్‌ నటుడు అమర్‌ దీప్‌ ఓటింగ్‌లో టాప్‌-2 కు దూసుకెళ్లారు. దీంతో టైటిల్‌ విజేతగా నిలుస్తారనుకున్న శివాజీ మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఆదివారం జరిగిన బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు శివాజీ కుమారులు కూడా హాజరయ్యారు. అయితే శివాజీ ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించగానే ఇద్దరు కుమారులు ఎమోషనల్‌ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. దీంతో వెంటనే నాగార్జున వారిని బిగ్‌ బాస్‌ స్టేజ్‌పైకి పిలిచారు. అక్కడ కూడా తండ్రిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు కుమారుడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.. ఇక విజేతగా నిలవనప్పటికీ బిగ్‌ బాస్‌ షోతో భారీగానే సంపాదించుకున్నారు శివాజీ. మొత్తం 105 వారాల పాటు హౌజ్‌లో ఉన్న అతను రోజుకు రూ.60 వేల పారితోషకం తీసుకున్నారట. అంటే వారానికి సుమారు రూ.4.25 లక్షలు అన్నమాట. ఇలా మొత్తం 105 రోజులకు గానూ సుమారు రూ.64 లక్షలు అందుకున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఒక రకంగా బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ కంటే ఎక్కువగానే శివాజీ పారితోషకం అందుకున్నాడన్నమాట.

ఇద్దరు కుమారుల ఎమోషనల్..

విన్నర్ కంటే ఎక్కువ గానే రెమ్యునరేషన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.