AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: పట్టువదలని పల్లవి ప్రశాంత్.. అవమానాలను అధిగమించి బిగ్‏బాస్ విజేతగా నిలిచిన రైతుబిడ్డ

రిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్‌ అంటే చాలా మందికి తెలియదు. బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ప్రారంభంలో బియ్యపు మూటతో హౌజ్‌లోకి వచ్చినప్పుడు కూడా 'ఇలాంటి వాళ్లని చాలామందిని చూశాం.. హౌజ్‌లో ఎన్ని రోజులుంటాడో చూద్దాం' అని అనుకున్న వాళ్లే ఎక్కువ. అయితే వాళ్లందరి అంచనాలు, అభిప్రాయాలు తప్పని నిరూపించడానికి ఎంతో సమయం పట్టలేదు.

Bigg Boss 7 Telugu: పట్టువదలని పల్లవి ప్రశాంత్.. అవమానాలను అధిగమించి బిగ్‏బాస్ విజేతగా నిలిచిన రైతుబిడ్డ
Bigg Boss 7 Telugu, Pallavi Prashanth
Basha Shek
|

Updated on: Dec 17, 2023 | 10:52 PM

Share

‘అన్నా మల్లోచ్చినా.. అన్నా రైతు బిడ్డనన్నా.. నన్ను బిగ్ బాస్‌లోకి తీసుకోండన్నా’ అంటూ ఎట్టకేలకు హౌజ్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‌ చరిత్ర సృష్టించాడు. కామన్‌ మెన్‌ గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ ఏకంగా బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేతగా అవతరించాడు. తద్వారా బిగ్‌ బాస్‌ హిస్టరీలోనే తొలిసారిగా కామన్‌ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్ గా రికార్డుల కెక్కాడు. సరిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్‌ అంటే చాలా మందికి తెలియదు. బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ప్రారంభంలో బియ్యపు మూటతో హౌజ్‌లోకి వచ్చినప్పుడు కూడా ‘ఇలాంటి వాళ్లని చాలామందిని చూశాం.. హౌజ్‌లో ఎన్ని రోజులుంటాడో చూద్దాం’ అని అనుకున్న వాళ్లే ఎక్కువ. అయితే వాళ్లందరి అంచనాలు, అభిప్రాయాలు తప్పని నిరూపించడానికి ఎంతో సమయం పట్టలేదు. హౌజ్‌లో తనదైన ఆటతీరు, మాటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు పల్లవి ప్రశాంత్‌. ‘రైతు బిడ్డ’ అనే ట్యాగ్‌ కొంచెం అతనిపై సెంటిమెంట్ ను క్రియేట్‌ చేసినప్పటికీ హౌజ్‌లో తన ఆటతీరుతోనే  ఆకట్టుకున్నాడు. బిగ్‌ బాస్‌ ఇచ్చిన గేమ్స్‌, టాస్కుల్లో యాక్టివ్‌ గా పార్టిసిపేట్‌ చేశాడు. రతికా రోజ్‌ లాంటి కంటెస్టెంట్స్‌ ప్రేమ పేరుతో తనను ఇబ్బంది పెట్టినా వారిని పెద్ద మనసుతో క్షమించాడే తప్ప పగలు, ప్రతీకారాలకు పోలేదు. అలాగే చాలామంది కంటెస్టెంట్స్‌ తక్కువగా చూసినా, పరుషపు మాటలతో తన మనసును గాయపరిచినా తన లక్ష్యం వైపే దృష్టి సారించాడు. అనుకున్నది సాధించాడు. బిగ్‌ బాస్‌ విజేతగా అవతరించి చరిత్ర సృష్టించాడు.

కేవలం హౌజ్‌లోనే కాదు బయట కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్‌. తనకు అప్పటికే పెళ్లైందని, కోట్ల ఆస్తులున్నాయని కొన్ని పీఆర్‌ టీమ్స్‌ నెగెటివ్‌ ప్రచారం చేసినా అవేవీ తన విజయాన్ని అపలేకపోయాయి. ముఖ్యంగా ఓటింగ్‌లో రైతు బిడ్డకు తిరుగులేని మద్దతు లభించింది. అదే తనను విజేతగా నిలిపింది. రెండో స్థానంలో సీరియల్‌ నటుడు అమర్‌ దీప్‌ నిలవగా, మూడో స్థానంలో శివాజీ నిలిచాడు. నాలుగో స్థానంలో ప్రిన్స్‌ యావర్, ఐదో స్థానంలో ప్రియాంక జైన్‌, ఆరో ప్లేస్‌లో అర్జున్ అంబటి నిలిచారు.

ఇవి కూడా చదవండి

రైతులకే వెచ్చిస్తా..

కాగా విజేతగా నిలిచిన అనంతరం తనకు దక్కిన ప్రైజ్ మనీని రైతులకే వెచ్చిస్తానన్నాడు పల్లవి ప్రశాంత్. అలాగే కారును తన తండ్రికి, నెక్లెస్ ను తన తల్లికి బహుమతిగా ఇస్తానని బిగ్ బాస్ వేదికపనే ప్రకటించాడు పల్లవి ప్రశాంత్. కాగా పల్లవి ప్రశాంత్ విజయంతో అతని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  సోషల్ మీడియాలో రైతు బిడ్డ పేరు మార్మోగిపోతోంది.

బిగ్ బాస్ హౌజ్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.