Bigg Boss 7 Telugu: అన్న మాటకు కట్టుబడిన యావర్.. రూ.15 లక్షలతో బయటకొచ్చిన ప్రిన్స్..
యంగ్ హీరో రాజ్ తరుణ్, హీరో అల్లరి నరేష్ హౌస్‌లో నుంచి యావర్‌ను బయటకు తీసుకువచ్చారు. ముందుగా నాగ్ నటిస్తోన్న నా సామిరంగ ప్రమోషన్స్ కోసం వీరిద్దరు బిగ్‌బాస్ స్టేజ్ పైకి వచ్చారు. వీరితోపాటు హీరోయిన్ ఆషికా, డైరెక్టర్ విజయ్ బన్నీ వచ్చి నా సామిరంగ టీజర్ లాంచ్ చేశారు. అనంతరం రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ఇద్దరు రూ.15 లక్షల సూట్ కేసు తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టారు. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఇందులో రూ.15 లక్షలు ఉన్నాయని.. ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని కంటెస్టెంట్లను ఒప్పించడం మొదలు పెట్టారు.
ప్రిన్స్ యావర్.. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం లేని అబ్బాయి. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలుగు సరిగ్గా రాకపోయిన టాస్కులలో అదరగొట్టేశాడు. యావర్‌తో పోటి అంటే తోటి కంటెస్టెంట్స్ ఆలోచించేలా చేశాడు. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 7 ఫైనలిస్ట్‌గా నిలిచాడు. అయితే టాప్ 6లో ఉన్న యావర్ ఇప్పుడు నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్, హీరో అల్లరి నరేష్ హౌస్‌లో నుంచి యావర్‌ను బయటకు తీసుకువచ్చారు. ముందుగా నాగ్ నటిస్తోన్న నా సామిరంగ ప్రమోషన్స్ కోసం వీరిద్దరు బిగ్‌బాస్ స్టేజ్ పైకి వచ్చారు. వీరితోపాటు హీరోయిన్ ఆషికా, డైరెక్టర్ విజయ్ బన్నీ వచ్చి నా సామిరంగ టీజర్ లాంచ్ చేశారు. అనంతరం రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ఇద్దరు రూ.15 లక్షల సూట్ కేసు తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టారు. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఇందులో రూ.15 లక్షలు ఉన్నాయని.. ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని కంటెస్టెంట్లను ఒప్పించడం మొదలు పెట్టారు. ముందుగా పల్లవి ప్రశాంత్‌ను డబ్బులు తీసుకోమని అడిగారు.
అయితే అందరికీ ఆదర్శంగా నిలవడానికి వచ్చానని.. ప్రేక్షకులు బయటకు పంపిస్తే.. వెళ్తానని చెప్పాడు. ఇక ప్రశాంత్ తల్లిదండ్రులు కూడా డబ్బులు తీసుకోవద్దని చెప్పారు. ఇక అమర్ గెలుస్తాననే నమ్మకం ఉందని డబ్బులు వద్దన్నాడు. ఇక ఆ తర్వా యవర్ కు డబ్బులు అవసరం ఉందని.. ఎన్నో అప్పులు ఉన్నాయంటూ నాగార్జున గుర్తుచేయడంతో ఆలోచనలో పడ్డాడు యావర్.
ఇక ఆ తర్వాత అతడి అన్న, తమ్ముడితో మాట్లాడించగా.. వారు కూడా డబ్బులు తీసుకుంటే మంచిదే అని.. తమ అప్పులు తగ్గిపోతాయని చెప్పారు. దీంతో తను ఆడేది తన కుటుంబం కోసమే అని.. తన అన్న చెప్పిన మాట ప్రకారమే డబ్బులు తీసుకుంటున్నానని అన్నాడు. ఇక ఆ తర్వాత యావర్ గోల్డెన్ సూట్ కేసు పట్టుకోగా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ అతడిని బయటకు తీసుకువచ్చారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.