Brahmamudi, December 18th episode: కావ్యకు చిక్కుల మీద చిక్కులు.. కళావతిని వదిలించుకునేందుకు రాజ్ ప్లాన్!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. కళ్యాణ్, అప్పూతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి అనామిక, అనామిక వాళ్ల అమ్మ శైలు కుళ్లుకుంటారు. వెంటనే అనామిక వెళ్లి కళ్యాణ్ తీసుకుని వెళ్తుంది. ఇది చూసిన కనకం బాధ పడుతుంది. ఈ లోపు సరిగ్గా.. రాజ్ కి శ్వేత కాల్ చేస్తుంది. వెంటనే రాజ్.. పక్కకు వెళ్లి మాట్లాడతాడు. ఏంటి రాజ్.. నిన్ను కలవాలని గుడికి వస్తే.. కలవడం లేదేంటి అని శ్వేత అడిగితే.. అందరూ ఉన్నారు కదా అందుకే కుదరడం లేదని రాజ్ అంటాడు. రాజ్ కంగారును రుద్రాణి..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో.. కళ్యాణ్, అప్పూతో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి అనామిక, అనామిక వాళ్ల అమ్మ శైలు కుళ్లుకుంటారు. వెంటనే అనామిక వెళ్లి కళ్యాణ్ తీసుకుని వెళ్తుంది. ఇది చూసిన కనకం బాధ పడుతుంది. ఈ లోపు సరిగ్గా.. రాజ్ కి శ్వేత కాల్ చేస్తుంది. వెంటనే రాజ్.. పక్కకు వెళ్లి మాట్లాడతాడు. ఏంటి రాజ్.. నిన్ను కలవాలని గుడికి వస్తే.. కలవడం లేదేంటి అని శ్వేత అడిగితే.. అందరూ ఉన్నారు కదా అందుకే కుదరడం లేదని రాజ్ అంటాడు. రాజ్ కంగారును రుద్రాణి గమనిస్తుంది. రాజ్ ని త్వరగా రమ్మని పక్క నుంచి సైగ చేస్తుంది శ్వేత. నువ్వు నన్ను ఇరికించేస్తున్నావ్.. అని రాజ్ అంటే.. అయితే వెళ్లి పోమంటావా అని శ్వేత అంటుంది. అది శ్వేత.. వస్తున్నా అని చెప్తాడు. ఫోన్ పెట్టేసి.. నాన్మమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్తాడు. ఏవండీ కార్తీక దీపాలు వదలాలి అని కావ్య అంటే.. నేనేం గుడి వదిలి పారిపోవడం లేదు. వెంటనే వస్తాను అని సీరియస్ గా చెప్పి వెస్తాడు రాజ్.
రాజ్ ఎదపై వాలిపోయిన శ్వేత..
శ్వేతను వెతుక్కుంటూ వెళ్తూంటాడు రాజ్. చేయి పట్టుకుని రాజ్ ని లాగుతుంది. టెన్షన్ గా ఉందా.. నేను నీకు మోయలేని భారంగా తయారయ్యానా.. వెళ్లి పోమ్మంటావా అని శ్వేత అడిగితే.. అయ్యో నా గురించి నీకు తెలీదా.. నేను ఎందుకు అలా అనుకుంటాను అని రాజ్ అంటే.. థాంక్స్.. నువ్వు తప్ప నా మనసును ఎవరూ అర్థం చేసుకోలేరని శ్వేత అంటుంది. సరే ఎందుకు రమ్మన్నావో చెప్పు అని రాజ్ అడిగితే.. చేతులు పట్టుకుని ఏడుస్తూ ఏదో చెప్తుంది శ్వేత.
గుడిలో రాజ్, శ్వేతలను చూసిన అపర్ణ..
అయ్యో అన్నీ తెచ్చాం కానీ.. అసలైంది మర్చిపోయాం అని ఇందిరా దేవి అంటుంది. ఏంటి అత్తయ్యా? అని అపర్ణ అడిగితే.. అగ్గిపెట్టే అని చెప్తుంది పెద్దావిడ. దీంతో అగ్గిపెట్టె తీసుకు రావడానికి అపర్ణ వెళ్తుంది. సరిగ్గా అప్పుడే శ్వేత.. రాజ్ ని కౌగిలించుకుని ఉంటుంది. వాళ్లిద్దర్నీ చూసి షాక్ అవుతుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లి పోతుంది. రాజ్ ఇంకా రావడం లేదని మరోవైపు కావ్య కూడా వెతకడానికి వెళ్తుంది. రాజ్ కనబడక పోయే సరికి మళ్లీ వెళ్తుంది. సరిగ్గా అప్పుడే రాజ్ ఎక్కడ? ఇంకా రాలేదని.. పెద్దావిడ ఫోన్ చేయమంటుంది. దీంతో సుభాష్.. రాజ్ కి ఫోన్ చేసి త్వరగా రమ్మంటాడు. నువ్వేం కంగారు పడకు.. నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉన్నానని మర్చిపోకు అని చెప్పి వెళ్తాడు రాజ్. శ్వేత ఏడ్చుకుంటూ వెళ్తుంది.
కావ్యపై ఎటాక్ స్టార్ట్ చేసిన అనామిక తల్లి..
ఆ తర్వాత లేడీస్ అందరూ నిల్చుని కార్తీక దీపాలను వదులుతారు. ఆ తర్వాత ఆ దీపాలకు నమస్కారం పెట్టుకుంటారు. ఈ సమయంలో కనకం.. అనామిక దీపం ఆపాలని.. నీళ్లను తోస్తుంది. అనామిక కళ్లు తెరిచే సరికి ఆ దీపం మునిగి పోతూ ఉంటుంది. అయ్యో నా దీపం మునిగి పోతుంది అని అంటుంది. దీంతో కావ్య.. నీళ్లను తోస్తూ దీపాన్ని వెనక్కి నెడుతుంది. అనామికా ఇప్పుడేం కాదులే అని అంటుంది కావ్య. ఎంత బాగా నటిస్తున్నారు మీ అక్కా చెల్లెళ్లు. ఇద్దరూ కలిసి చెరో పక్కన చేరి.. నా కూతురు వెలిగించిన దీపం మునిగి పోయేలా చేశారని అనామిక తల్లి శైలు అంటుంది. మీరు ఎవర్ని అంటున్నారు? అని కావ్య అడిగితే.. నిన్నే అంటున్నానని శైలు అంటుంది. నా కూతురు వెలిగించిన దీపం ఆరిపోవాలనే కదా నువ్వు నీళ్లను ఎగదోసింది. అంతా చూస్తూనే ఉన్నాను. మీరేం చూశారు? నేనేం చేశాను? అని కావ్య అడుగుతుంది. మొదటి నుంచీ అన్నీ చూస్తూనే ఉన్నాను. పెళ్లి శుభలేఖ కాల్చావ్.. ఇప్పుడు ఈ దీపాలు ఆర్పాలి అనుకున్నావ్. . చూస్తుంటే అన్నీ నువ్వు కావాలనే చేస్తున్నావ్ అని అర్థం అవుతుంది.
నీ చెల్లిని కళ్యాణ్ కి చేయాలనే.. ప్లాన్ చేస్తున్నావ్..
కళ్యాణ్ కి తన చెల్లెల్ని ఇచ్చి చేయాలనే కదా ఇన్నాళ్లూ తన వెంట తిప్పుకుంది.. అని అంటుంది శైలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అని అప్పూ అంటే.. యే ఇంత వరకూ నువ్వు కళ్యాణ్ తో తిరగలేదా.. ఆ సంగతి ఇక్కడ ఎవరికీ తెలీదా ఏంటి? అని శైలు అంటే.. ఏవండీ మీరు మా చెల్లెలి గురించి తప్పుగా మాట్లాడుతున్నారుని కావ్య సీరియస్ అవుతుంది. ముందు మీ అక్కని తీసుకొచ్చి ఈ ఇంటికి కోడల్ని చేశావ్.. తర్వాత మీ చెల్లెల్ని కూడా ఈ ఇంటికే కోడలిని చేయాలని చూస్తున్నావ్.. అందుకే ఇదంతా చేస్తున్నావ్. మా అనామిక నీకు అడ్డుగా ఉంది కాబట్టి ఇలాంటి అపశకునాలు సృష్టిస్తున్నావ్ అని అంటుంది శైలు.
అనామిక పేరెంట్స్ పై సీరియస్ అయిన రాజ్, కళ్యాణ్ లు..
ఆ తర్వాత రాజ్ కూడా సీరియస్ అవుతాడు. అంతా నీ ప్లాన్ చేసేది నీ భార్య.. ఆ విషయం మీరెవరూ తెలుసుకు కోవడం లేదు అని శైలూ అంటే.. ఆంటీ ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి అని అప్పూ, కళ్యాణ్ లు అంటారు. అప్పూ నాకు ఫ్రెండ్.. ఆ విషయం మీ అనామికకు కూడా తెలుసు. అయినా నా విషయంలో మా వదినను తప్పు పడుతున్నారు ఏంటి? మా వదిన ఎలాంటిదో నాకు బాగా తెలుసు అని కళ్యాణ్ అంటాడు. ఏం తెలుసు కళ్యాణ్ బాబూ నీకు? మీ ఆంటీ చెప్తున్నదే నిజం.. మీ వదిన నిన్నూ నీ చెల్లెల్ని కలపడం కోసం అనామికతో పెళ్లి ఆపాలని చూస్తుందని అనామిక తండ్రి సుబ్రమణ్యం అంటాడు.
ఇక నిన్ను ఎప్పటికీ కలవను కళ్యాణ్: అప్పూ
ఆపండి.. అనామిక, కళ్యాణ్ ల పెళ్లి జరగాలని అందరి కన్నా ఎక్కువ ఈ కళావతే కోరుకుందని రాజ్ అంటే.. ఏంటి అనామిక నీకు మొత్తం తెలిసి కూడా మీ అమ్మ అలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? అని కళ్యాణ్ అంటాడు. నువ్వు నా కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అప్పూకే ఇస్తుంటే.. నేనెంత ఫీల్ అవుతున్నానో నీకు తెలుసా? అని అనామిక కూడా అంటుంది. నువ్వు ఇంత నెగిటివ్ గా ఆలోచిస్తున్నావా అని అనామిక అంటే.. చాలు ఇక నిన్ను ఎప్పటికీ కలవను కళ్యాణ్.. నా గురించి మీరు గొడవలు పడొద్దు. సారీ అనామిక.. కళ్యాణ్, నేనూ ఎప్పుడూ ఫ్రెండ్స్ లానే ఉన్నాం. నీ మనసులో ఉన్నది తెలియక కళ్యాణ్ నాతో చనువుగా ఉన్నాడు.. అంతే.. ఇక నేను వెళ్తాను అని అప్పూ అంటుంది.
నాకు కాబోయే అల్లుడితో కనిపించకు.. అప్పూకి శైలు వార్నింగ్..
ఇంకెప్పుడూ నాకు కాబోయే అల్లుడితో మీ కూతురు కనిపించకుండా చూసుకోండి అని అనామిక తల్లి శైలూ అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా.. నువ్వు చదువుకున్నదానివే కదా.. అలా ఎలా ఒక ఆడపిల్ల మీద నింద వేస్తావ్? అని పెద్దావిడ, నిజానికి మా కళ్యాణ్ ని, మీ అనామికను కలిపింది అప్పూనే. తన గురించి అలా మాట్లాకండి. పైగా కావ్య మా కోడలు తన గురించి కూడా మీరు అపార్థంగా మాట్లాడుతున్నారు అని ధాన్య లక్ష్మి కూడా అంటుంది. వెళ్తున్న అప్పూని పిలిచి.. మళ్లీ తీసుకొస్తాడు కళ్యాణ్. ఇప్పుడు నువ్వు వెళ్లి పోతే వాళ్ల అన్నమాటలు నిజం అవుతాయి. ఎవరో ఏదో అనుకున్నారని.. నువ్వు మన ఫ్రెండ్ షిప్ ని వదులు కోవడం నాకు ఇష్టం లేదు బ్రో. ఏంట్రా నువ్వు మాట్లాడేది.. అప్పూ వెళ్లి పోతేనే సమస్య తీరి పోతుంది. అయినా తప్పు అనామిక ఫ్యామిలీది కాదురా.. కూతుళ్లను మగ స్నేహితులతో తిప్పిన ఆ కన్నవాళ్లకు ఉండాలి బుద్ధి. రుద్రాణి నీ కొడుకును నువ్వు సవ్యంగా పెంచావా.. ప్రతి దానిలో వాళ్ల తప్పులు వెతుకుతావా.. వాళ్ల స్నేహాన్ని వాళ్లు కూడా అర్థం చేసుకోవడం లేదు.
అనామిక తల్లికి.. కళ్యాణ్ వార్నింగ్..
కానీ ఇప్పటివరకూ జరిగిన అపశకునాలన్నీ చూస్తుంటే ఈ కావ్యే అన్నీ చేస్తున్నట్టు ఉంది అని శైలు అంటే.. చూడండి మా వదిన గురించి ఇంకొక్క మాట అంటే బావుండదు చెప్తున్నా.. అసలు మా వదిన గురించి మీకేం తెలుసు. తనే లేక పోయి ఉంటే.. మా పెళ్లి నిన్నే ఆగి పోయేదని కళ్యాణ్ అంటాడు. అనామిక మీ అమ్మానాన్న అపార్థంలో ఉన్నారు. నేను నీ శ్రేయోభిలాషినని నువ్వైనా గుర్తిస్తే చాలు. మిమ్మల్ని ఎవరూ విడదీయలేరని కావ్య అంటే.. సరే ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అని అనామిక వాళ్ల పేరెంట్స్ కి చెబుతుంది.
శ్వేతతో రాజ్ కబుర్లు.. కావ్యని వదిలించుకునేందుకు ప్లాన్..
ఇక తెల్లారుతుంది. కళ్యాణ్ ఎవరూ లేని ప్లేస్ కి వచ్చి శ్వేతకి కాల్ చేస్తాడు. సారీ శ్వేత నిన్న నువ్వు నాతో మాట్లాడలేదు. నాకు చాలా గిల్టీగా ఉంది శ్వేత.. నిన్ను ఇలా దొంగతనంగా కలవడం.. ఎవరూ లేకుండా ఫోన్ చేయడం నాకు నచ్చడం లేదని రాజ్ అంటే.. మన మంచి కోసమే అని నువ్వు చెప్పావు కదా.. అని శ్వేత అంటుంది. చెప్పాను కానీ నా ఫ్యామిలీ గురించి ఆలోచించి.. నిన్ను ఇబ్బంది పెడుతున్నా అని అనిపిస్తుంది. ఇక రాజ్, వ్వేతలు ఆనందంగా మాట్లాడుకుంటారు. రాజ్ ని చూసిన అపర్ణ.. గుడిలో కనిపించిన అమ్మాయి ఎవరు? వాళ్లిద్దరికీ సంబంధం ఏంటి? మనసులో అనుకుంటుంది. ఇక ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.