MLA KTR: ‘మన బంధం ఇలాగే కొనసాగాలి’.. పెళ్లి రోజున భార్యకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌, ఆయన సతీమణి శైలిమ సోమవారం (డిసెంబర్‌ 18) పెళ్లి రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ తన భార్యకు సోషల్‌ మీడియా వేదికగా ఒక సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం నాటి తన పెళ్లి ఫొటో, అలాగే తన భార్య పిల్లల ఫొటోలను ట్విట్టర్‌ లో షేర్‌ చేసిన కేటీఆర్‌..

MLA KTR: 'మన బంధం ఇలాగే కొనసాగాలి'.. పెళ్లి రోజున భార్యకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కేటీఆర్‌
MLA KTR Family
Follow us

|

Updated on: Dec 18, 2023 | 7:57 PM

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌, ఆయన సతీమణి శైలిమ సోమవారం (డిసెంబర్‌ 18) పెళ్లి రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ తన భార్యకు సోషల్‌ మీడియా వేదికగా ఒక సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం నాటి తన పెళ్లి ఫొటో, అలాగే తన భార్య పిల్లల ఫొటోలను ట్విట్టర్‌ లో షేర్‌ చేసిన కేటీఆర్‌ ‘ మై బ్యూటీఫుల్ వైఫ్ శైలిమకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 20 ఏళ్లుగా నాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నందుకు, ఇద్దరు అందమైన పిల్లలను ఇచ్చినందుకు, నా జీవిత ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా నిలిచినందుకు కృతజ్ఞతలు. మన జీవిత ప్రయాణం ఇలాగే మరెన్నో సంవత్సరాల పాటు కొనసాగాలని ఆశిస్తున్నాను’ అంటూ తన సతీమణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నెటిజన్లు కేటీఆర్‌- శైలిమ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరోవైపు కేటీఆర్‌, శైలిమల కుమారుడు హిమాన్షురావు కూడా తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘అమ్మానాన్నలకు 20వ పెళ్లిరోజు శుభాకాంక్షలు. మీరిద్దరూ నా అమ్మానాన్నలు అయినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నేను మిమ్మల్ని చాలాచాలా ప్రేమిస్తున్నాను’ అంటూ తన పేరెంట్స్‌తో కలిసున్న ఫొటోను షేర్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

1976లో జన్మించిన కేటీఆర్.. అమెరికాలో ఎంబీఏ చేశారు. అనంతరం అక్కడే కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేశారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. కేసీఆర్‌ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తెలంగాణ ప్రజలకు సేవలందించారు. ఇక కేటీఆర్‌ వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2003 డిసెంబర్ 18న శైలిమతో కలిసి పెళ్లిపీటలెక్కారీ డైనమిక్ లీడర్‌. తమ అన్యోన్య దాంపత్య బంధానికి ప్రతీకగా హిమాన్షు రావు, అలేఖ్య రావు అనే కుమారుడు, కూతురు వీరి జీవితంలోకి అడుగుపెట్టారు.

కేటీఆర్ ట్వీట్..

హిమాన్షు రావు పోస్ట్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..